iDreamPost
android-app
ios-app

తక్కువ ధరకే ఇన్స్టాంట్ ట్యాప్ వాటర్ హీటర్.. 15 ఏళ్ల వారంటీ!

  • Published Aug 24, 2024 | 10:04 PM Updated Updated Aug 24, 2024 | 10:04 PM

Instant Tap Water Heater: చలికాలం, వర్షాకాలంలో చన్నీళ్ళ స్నానం అంటే చాలా కష్టంగా ఉంటుంది కొంతమందికి. ఇమ్మర్షన్ రాడ్ హీటర్లు కొన్ని రోజులే పని చేస్తుంది. పోనీ గీజర్లు వాడడమంటే ధర ఎక్కువ. అయితే ఎక్కువ కాలం వారంటీతో తక్కువ ధరకే వచ్చే హీటర్ ఏదైనా ఉంటే బాగుంటుంది కదా. అది కూడా ప్రత్యేకించి స్పేస్ వేస్ట్ అవ్వకుండా ఉండేలా చిన్నగా ఉంటే బాగుంటుంది కదా అనుకునేవారికి మంచి వాటర్ హీటర్ ని తీసుకొచ్చాము.

  • Published Aug 24, 2024 | 10:04 PMUpdated Aug 24, 2024 | 10:04 PM
తక్కువ ధరకే ఇన్స్టాంట్ ట్యాప్ వాటర్ హీటర్.. 15 ఏళ్ల వారంటీ!

వాటర్ హీటర్ రాడ్ కొంటే వచ్చే సమస్య ఏంటంటే.. దాన్ని ఎక్కడ పెట్టినా గానీ పిల్లలు ముట్టుకుంటే షాక్ కొడుతుందన్న భయం వెంటాడుతుంది. పైగా ఇంట్లో వాటర్ హీటర్ పెట్టి స్విచ్ ఆన్ చేసి మర్చిపోతే బకెట్ కాలిపోవడంతో పాటు ఆ నీళ్లు నేల మీదకి వచ్చేస్తాయి. ఎక్కువ సేపు అలా వదిలేసినా స్విచ్ బోర్డు పాడైపోతుంది. వాటర్ హీటర్ రాడ్స్ కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యి పేలిపోతాయి. గీజర్ లు పెట్టుకుందామంటే రేటు ఎక్కువ ఉంటుంది. పైగా ఇన్స్టాలేషన్ హడావుడి అది ఉంటుంది. తక్కువ ధరకు వచ్చేవి కొందామన్నా గానీ మంచి బ్రాండ్ వి అందుబాటులో లేవు. మంచి కంపెనీ గీజర్లు కొనాలంటే 10 వేల దాకా పెట్టాల్సి ఉంటుంది. ఎప్పుడో కట్టిన ఇల్లు అయితే గీజర్ పాయింట్స్ ఉండకపోవచ్చు.

ఇలాంటి పరిస్థితుల్లో ఉపయోగపడే పరికరం ఏదైనా ఉందా అంటే అది ఇన్స్టాంట్ ట్యాప్ వాటర్ హీటరే. ఇది కుళాయిలోంచి వచ్చే చన్నీటిని వేడి నీటిగా మార్చేస్తుంది. టెక్ కింగ్ కంపెనీకి చెందిన ఇన్స్టాంట్ ట్యాప్ వాటర్ హీటర్, గీజర్ ఒకటి అందుబాటులో ఉంది. దీన్ని వంట గది సింకులో పెట్టుకోవచ్చు. బాత్రూంలో స్నానానికి వాడుకోవచ్చు. రెస్టారెంట్స్, ఆఫీసుల్లో, ల్యాబ్స్, క్లినిక్స్, సెలూన్ వంటి వాటిలో వీటినే వాడతారు. చిన్న సైజులో ఉండడం, అప్పటికప్పుడు వేడి నీటిని అందించడం దీని ప్రత్యేకత. హై ప్రెజర్ వాటర్ ప్రూఫ్ డిజైన్ తో ఇది వస్తుంది. అంట్లు తోమడానికి, కూరగాయలు కడగడానికి, స్నానానికి ఇలా పలు ఇతర పనులకు ఇది బాగా ఉపయోగపడుతుంది. 3 సెకన్లలోనే నీటిని వేగంగా వేడి చేస్తుంది.

దీన్ని రెండు రకాలుగా వాడుకోవచ్చు. మన శరీరం తట్టుకునేదాన్ని బట్టి టెంపరేచర్ ని సెట్ చేసుకోవచ్చు. నీటి ఫ్లోని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ట్యాప్ ని ఒకవైపు తిప్పితే వేడి నీళ్లు, మరోవైపు తిప్పితే చన్నీళ్ళు వచ్చేలా డిజైన్ చేశారు. ఈ ట్యాప్ చిన్న ట్యాంక్ తో వస్తుంది. ఈ ట్యాంక్ లో పడ్డ చల్లని నీరు వెంటనే వేడెక్కుతుంది. ఈ ఇన్స్టాంట్ ట్యాప్ హీటర్ మీద కంపెనీ 15 ఏళ్ల వారంటీ ఇస్తుంది. దేశంలోని అన్ని చోట్లా రీప్లేస్మెంట్ వారంటీ ఇస్తుంది. వారంటీ పీరియడ్ లోపు ప్రాడెక్ట్ డ్యామేజ్ అయితే కొత్త ట్యాప్ ని ఇస్తుంది. దీని అసలు ధర రూ. 4,999 ఉండగా ఆఫర్ లో రూ. 2,299కే అందుబాటులో ఉంది. ఈ ఇన్స్టాంట్ ట్యాప్ వాటర్ హీటర్ ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.