iDreamPost
android-app
ios-app

Infosys: 23 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. ఇన్ఫోసిన్‌ నుంచి 26 వేల మంది ఉద్యోగులు ఔట్‌

  • Published Apr 19, 2024 | 9:06 AM Updated Updated Apr 19, 2024 | 9:06 AM

దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 23 తర్వాత తొలిసారి కంపెనీ నుంచి 26 వేల మంది ఉద్యోగులు బయటకు వెళ్లారు. కారణం ఏంటంటే..

దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 23 తర్వాత తొలిసారి కంపెనీ నుంచి 26 వేల మంది ఉద్యోగులు బయటకు వెళ్లారు. కారణం ఏంటంటే..

  • Published Apr 19, 2024 | 9:06 AMUpdated Apr 19, 2024 | 9:06 AM
Infosys: 23 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. ఇన్ఫోసిన్‌ నుంచి 26 వేల మంది ఉద్యోగులు ఔట్‌

ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. దిగ్గజ కంపెనీలు మొదలు.. చిన్న చిన్న స్టార్టప్‌లు సైతం ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాయి. గూగుల్‌ ఈ ఏడాది రెండో సారి వేల మంది ఉద్యోగులను తొలగిస్తూ.. ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దిగ్గజ కంపెనీలన్ని ఇదే బాటలో పయనిస్తున్నాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటిలెజెన్స్‌ రాకతో ఐటీ రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. దాంతో నిర్వహణ భారం తగ్గిచుకోవడం కోసం కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తూ.. ఆదేశాలు జారీ చేస్తున్నాయి. అయితే దిగ్గజ కంపెనీలన్నింటిలో ఇదే పరిస్థితి నెలకొని ఉండగా.. తాజాగా ఇన్ఫోసిస్‌ కూడా ఇదే బాటలో పయనిస్తోంది. 23 ఏళ్ల చరిత్రలో తొలిసారి కంపెనీ నుంచి 26 మంది ఉద్యోగులు వెళ్లిపోయారు. దీనిలో కంపెనీ తొలగించిన వారితో పాటు.. వారంతట వారే వెళ్లిన వారు కూడా ఉన్నారు. ఇన్ఫోసిస్‌లో ఉద్యోగుల సంఖ్య తగ్గడం వరుసగా ఇది ఐదో త్రైమాసికం అంటున్నారు.

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో 2023-24 ఆర్థిక సంవత్సరంలో 25,994 మంది ఉద్యోగులు తగ్గిపోయారు. 2001 తర్వాత కంపెనీలో ఇంత భారీ ఎత్తున ఉద్యోగులు తగ్గి పోవడం ఇదే తొలిసారి అని.. తాజాగా ఫలితాల ప్రకటన సందర్బంగా ఇన్ఫోసిస్‌ వెల్లడించింది. ప్రస్తుతం ఇన్ఫోసిస్‌లో మొత్తం ఎంప్లాయిస్‌ 3,17,240 మంది ఉన్నారు. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే.. ఇది 7.5 శాతం వరకు తగ్గింది. ఇక త్రైమాసిక పరంగా చూస్తే.. క్రితం త్రైమాసికంలో అనగా జనవరి-మార్చి వరకు ఇన్ఫోసిస్‌ నుంచి 5,423 మంది వెళ్లిపోయారు.

ఇన్ఫోసిస్‌ సంస్థ గురువారం అనగా ఏప్రిల్‌ 18 నాడు క్యూ4 ఫలితాల్ని ప్రకటించింది. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ.. భారీగా లాభాలు నమోదు చేసింది. క్రితం త్రైమాసికంతో పోలిస్తే.. 30 శాతం వృద్ధి సాధించి రూ.7,969 కోట్లకు చేరింది. కంపెనీ ఆదాయం 1.2 శాతం మేర పుంజుకుని.. రూ.37,923 కోట్లుగా నమోదైంది. టీసీఎస్‌ కూడా క్యూ4 ఫలితాలను ప్రకటించగా.. భారీగా లాభాలు నమోదు చేసింది. ఇక టీసీఎస్‌లో కూడా భారీగా ఉద్యోగుల సంఖ్య తగ్గింది. 19 ఏళ్లలో ఇంత భారీగా ఉద్యోగుల సంఖ్య తగ్గడం ఇదే తొలిసారి అంటున్నారు.

ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గుతుండటం.. వారి స్థానాల్లో కొత్తవారిని నియమించుకోకపోవడం.. ఫ్రెషర్లకు ఆందోళనకర అంశం అని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా ఉద్యోగుల సంఖ్య 5 వేలకుపైగా తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో (క్యూ3) ఉద్యోగుల సంఖ్య 6,101 పడిపోయింది. రెండో త్రైమాసికంలో 7,530 తగ్గింది. ఈ త్రైమాసికంలో కూడా తగ్గడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం అని చెప్పవచ్చు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom