iDreamPost
android-app
ios-app

ఇన్ఫోసిస్ మరో కీలక నిర్ణయం.. ఆ ఉద్యోగులకు ఇక తప్పదు!

Infosys calls Employees: దేశీయ టెక్ దిగ్గజాల్లో ఇన్ఫోసిస్ కంపెనీ ఒకటి. ఐటీ రంగంలో ఇన్ఫోసిస్ తనదైన మార్క్ ను చూపిస్తుంది. తమ ఉద్యోగులను ఆఫీస్ లకు రప్పించడానికి మరో ఎత్తు వేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇన్ఫోసిస్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

Infosys calls Employees: దేశీయ టెక్ దిగ్గజాల్లో ఇన్ఫోసిస్ కంపెనీ ఒకటి. ఐటీ రంగంలో ఇన్ఫోసిస్ తనదైన మార్క్ ను చూపిస్తుంది. తమ ఉద్యోగులను ఆఫీస్ లకు రప్పించడానికి మరో ఎత్తు వేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇన్ఫోసిస్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

ఇన్ఫోసిస్ మరో కీలక నిర్ణయం.. ఆ ఉద్యోగులకు ఇక తప్పదు!

వర్క్ ఫ్రమ్ హోం… గతకొన్నేళ్ల నుంచి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల నోటి నుంచి ఎక్కువగా వినిపిస్తోన్న మాట. కరోనా సమయంలో అన్ని టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అవకాశం కల్పించాయి. ఇక కరోనా సమయంలో ఐటీ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి పని చేశారు. కరోనా వేవ్ తగ్గిపోయింది. అయితే ఉద్యోగులు మాత్రం కంపెనీలకు వెళ్లేందుకు సుముఖం చూపించడం లేదు. దీంతో పలు టెక్ సంస్థలు తమ ఉద్యోగులను ఆఫీస్ లకు రప్పించేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

దేశీయ టెక్ దిగ్గజాల్లో ఇన్ఫోసిస్ కంపెనీ ఒకటి. ఐటీ రంగంలో ఇన్ఫోసిస్ తనదైన మార్క్ ను చూపిస్తుంది. ఇక అన్ని ఐటీ కంపెనీల మాదిరిగానే ఇన్ఫోసిస్ కూడా కరోనా సమయంలో ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అవకాశం కల్పిచింది. అయితే కరోనా ప్రభావం తగ్గిన తరువాత తిరిగి ఉద్యోగాలను ఆఫీస్ కి పిలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పలు కీలకనిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నిబంధనల్లో భాగంగా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘ఇంజినీరింగ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్’ ప్రాజెక్టుల్లోని ఉద్యోగుల కోసం ఇన్- పర్సన్ కొలాబ్ వీక్స్ ప్రవేశపెట్టింది. అంటే ఆయా ప్రాజెక్టుల్లో పని చేసే ఐటీ ఉద్యోగులు తప్పనిసరిగా ఆయా వారాల్లో ఆఫీసులకు రావాలని ఆదేశించింది. తమకు కేటాయించిన వారంలో కంపెనీకి వచ్చి పని చేయాలని తెలిపింది.

Infosys is another key decision

ఇన్ పర్సన్ కొలాబ్ వీక్స్ కార్యక్రమంలో భాగంగా ప్రతి త్రైమాసికంలో ముఖ్యమైనవి ఆరు వారాలను ఎంపిక చేయనుంది. ఎంపిక చేసిన వారాల్లో ఎంప్లాయిస్ ఆఫీసుకి రావాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని ఉద్యోగులకు ఇ-మెయిల్స్ పంపిస్తున్నట్లు ఎకనామిక్ టైమ్స్ ఓ కథనం పేర్కొంది. ఇన్ పర్సన్ కొలాబరేషన్ వీక్ అనేది నిత్య ప్రక్రియని ఇన్ఫోసిస్  మెయిల్స్ లో పేర్కొంది. అలాగే.. ఉద్యోగులు కూడా కొత్తగా తీసుకున్న ఈ మార్పులకు సిద్ధంగా ఉండాలని సూచించింది. అలా మార్కులకు సిద్ధంగా ఉండాలనే కోరుతూనే హైబ్రిడ్ మోడ్ వర్క్ చేసేందుకు సన్నద్ధం కావాలని తెలిపింది. నెలలో కనీసం 10 రోజులు ఆఫీసులకు రావాలని సూచించింది. గతేడాది నవంబర్ లో ప్రవేశపెట్టిన హైబ్రిడ్ వర్క్ పాలసీ ప్రకారం, ఇన్ఫోసిస్ ఉద్యోగులు నెలకు కనీసం 10 రోజులు లేదా మూడు నెలలకు 30 రోజులు ఆఫీస్ నుంచి పని చేయాలని తెలిపింది.

ఇదే సమయంలో ఆఫీస్ నుంచి దూర ప్రాంతాల్లో ఉండే వారు తిరిగి వచ్చేందుకు ప్రణాళికలు చేసుకోవాలని కోరింది. అయితే ఎప్పటి నుంచి ఈ ఇన్- పర్సన్ వీక్స్ మొదలవుతాయనే విషయంపైనా కంపెనీ స్పష్టత ఇవ్వలేదు. ఈ త్రైమాసికం నుంచే ప్రారంభించే అవకాశం ఉన్నట్లు ఎకనామిక్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. 2024 ఏప్రిల్ 1 నుంచి 2024 జూన్ 30 వరకు తొలి త్రైమాసిక ఇన్-పర్సన్ కొలాబ్ వీక్స్ ప్రకటించే ఛాన్స్ ఉందని తెలిపింది. మొత్తంగా ఉద్యోగులను ఆఫీసుకు రప్పించేందుకు ఇలాంటి కొత్త ప్లాన్ వేస్తుందని పలువురు  అభిప్రాయ పడుతున్నారు. మరి.. ఇన్ఫోసిస్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.