iDreamPost
android-app
ios-app

ఈవాళే లాస్ట్.. రూ.1000తో విమానం ఎక్కొచ్చు.. త్వరపడండి

  • Published Aug 15, 2024 | 4:33 PM Updated Updated Aug 15, 2024 | 4:33 PM

Indigo Freedom Sale 2024: మీరు విమానం ఎక్కాలని భావిస్తున్నారా.. అయితే ఈ ఆఫర్ మీ కోసమే.. రూ.వెయ్యితో ఫ్లైట్ జర్నీ చేయ్యొచ్చు. ఆ వివరాలు..

Indigo Freedom Sale 2024: మీరు విమానం ఎక్కాలని భావిస్తున్నారా.. అయితే ఈ ఆఫర్ మీ కోసమే.. రూ.వెయ్యితో ఫ్లైట్ జర్నీ చేయ్యొచ్చు. ఆ వివరాలు..

  • Published Aug 15, 2024 | 4:33 PMUpdated Aug 15, 2024 | 4:33 PM
ఈవాళే లాస్ట్.. రూ.1000తో విమానం ఎక్కొచ్చు.. త్వరపడండి

జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలని ప్రతి ఒక్కరు భావిస్తారు. కానీ ఫ్లైట్ ఎక్కాలంటే.. భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే మారుతున్న కాలంతో పాటు విమానయాన సంస్థలు కూడా ప్రయాణికులను ఆకర్షించి.. లాభాలు పెంచుకోవడం కోసం రకరకాల ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఇక తాజాగా ఓ విమానయాన సంస్థ ఇలాంటి బంపరాఫర్ ప్రకటించింది. దీన్ని వాడుకుంటే.. 1000 లోపే విమానం ఎక్కొచ్చు. ఇంతకు ఏ కంపెనీ ఈ ఆఫర్ ఇచ్చింది.. ఎలా వాడుకోవాలంటే.. ఆ వివరాలు..

పండగలు, ప్రత్యేక పర్వదినాల సమయంలో విమానయాన సంస్థలు ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. నేడు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇప్పటికే పలు దేశీయ, అంతర్జాతీయ సంస్థలు ఫ్లైట్ టికెట్ల మీద భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి. వీటిలో ఇండిగో ఎయిర్ లైన్స్ కూడా ఉంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇండిగో ఫ్రీడమ్ సేల్ ని ప్రకటించింది. ఆగస్టు 13 న ప్రారంభమైన ఈ డిస్కౌంట్ సేల్.. ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి వరకూ అందుబాటులో ఉంటుంది. దీని గురించి ఇండిగో తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇండిగో ఫ్రీడమ్ సేల్లో మీరు విమాన టికెట్ ను కేవలం రూ. 1015కే కొనుగోలు చేయొచ్చు.

You can board a plane with a thousand

ఇండిగో ఫ్రీడమ్ సేల్..

ఫ్రీడమ్ సేల్ లో భాగంగా ఇండిగో.. ప్రయాణికులకు విమాన ఛార్జీలు, అదనపు సేవలపై గణనీయమైన భారీ డిస్కౌంట్ ను అందిస్తోంది. హెడ్‌లైన్ ఆఫర్ దేశీయ విమానాలకు రూ. 1,015 నుంచి ప్రారంభమవుతున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులను సందర్శించడానికి లేదా సెలవు తీసుకోవడానికి ప్లాన్ చేసే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

ఇండిగో దేశీయ ప్యాసింజర్స్ కు మాత్రమే కాక.. అంతర్జాతీయ ప్రయాణికులకు కూడా అదిరే డిస్కౌంట్ ను అందిస్తోంది. అన్నీ కలుపుకొని వన్-వే ఛార్జీలు రూ. 3,715 నుంచి ప్రారంభమవుతున్నాయి. అయితే ఇండిగో అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా చేసిన బుకింగ్‌లకు మాత్రమే ఈ డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది.

ఫ్రీడమ్ సేల్ లో అద్భుతమైన డీల్‌లను అందిస్తున్నప్పటికీ, టికెట్ బుకింగ్ వ్యవధి చాలా తక్కువగా ఉంది. ఆగస్టు 13న సేల్ ప్రారంభం కాగా కేవలం రెండు రోజుల వ్యవధిలోనే అనగా.. ఆగస్టు 15, గురువారం  అర్ధరాత్రి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ లోపే టికెట్లు బుక్ చేసుకోవాలి. ప్రయాణికులు 2024 ఆగస్టు 22 నుంచి 2025 మార్చి 31 మధ్య ప్రయాణించేందుకు టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ధరలకు అదనంగా కొన్ని ట్యాక్సులు, ఎక్స్ ట్రా చార్జీలు ఉంటాయి. ఇండిగో ప్రకటించిన ఆఫర్ ముగియడానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. కనుక త్వరపడండి.