యూజర్లకు గుడ్ న్యూస్.. విదేశాల్లోనూ UPI సేవలు.. ఎలా ప్రారంభించాలంటే?

యూపీఐ యూజర్లకు గుడ్ న్యూస్. ఇక విదేశాల్లోనూ యూపీఐ సేవలను వినియోగించుకోవచ్చు. భారత్ ఫారిన్ లో యూపీఐ సేవలను ప్రారంభించింది. ఇతర దేశాల్లో యూపీఐ సేవలను ఎలా ప్రారంభించాలంటే?

యూపీఐ యూజర్లకు గుడ్ న్యూస్. ఇక విదేశాల్లోనూ యూపీఐ సేవలను వినియోగించుకోవచ్చు. భారత్ ఫారిన్ లో యూపీఐ సేవలను ప్రారంభించింది. ఇతర దేశాల్లో యూపీఐ సేవలను ఎలా ప్రారంభించాలంటే?

డిజిటల్ వరల్డ్ లో ప్రజలంతా డిజిటల్ పేమెంట్స్ కే మొగ్గు చూపుతున్నారు. చిన్న మొత్తాల నుంచి పెద్ద మొత్తాల వరకు చెల్లింపులన్నీ ఆన్ లైన్ విధానంలో చేస్తున్నారు. నేటి రోజుల్లో దాదాపు బ్యాంకులకు వెళ్లాల్సిన పని లేదు. ఇంట్లోనే కూర్చుని స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ సాయంతో ట్రాన్సాక్షన్స్ చేసేస్తున్నారు. అయితే ఈ సౌలభ్యం కేవలం మనదేశంలోనే ఉపయోగించేందుకు వీలుండేది. మరి విదేశాల్లో యూపీఐ సేవలు వినియోగించాలంటే ఇబ్బందికరంగా మారింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని విదేశాల్లోనూ పేమెంట్స్ చేసే విధంగా భారత్ యూపీఐ సేవలను విదేశాల్లోనూ ప్రారంభించింది. మరి ఫారిన్ కంట్రీస్ లో ఎలా వాడాలి? యూపీఐ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

విదేశాల్లోనూ యూపీఐ సేవలతో భారత్ నుంచి విదేశాలకు ఆన్ లైన్ పేమెంట్ చేసుకోవచ్చు. విదేశాల నుంచి భారత్ కు మనీ సెండ్ చేసుకోవచ్చు. ఈ సదుపాయం విదేశాల్లో స్థిరపడిన వారికి ఎంతో ఉపపయోగకరంగా ఉంటుంది. స్వదేశంలోని తమ వారికి సులువుగా డబ్బులు పంపుకునే వీలు కలుగుతుంది. ఇప్పుడు భారతీయులు నేపాల్, సింగపూర్, యూఏఈ, కెనడా, ఒమన్, సౌధీ అరేబియా, ఫ్రాన్స్ వంటి విదేశాల్లో యూపీఐని వినియోగించుకోవచ్చు. అయితే విదేశాల్లో యూపీఐ సేవల కోసం స్వదేశంలో ఎలా అయితే పేమెంట్స్ చేస్తున్నామో అదే విధంగా చేసుకోవచ్చు.

దీని కోసం మీరు మీ బ్యాంకుకు వెళ్లి మీరు వెళ్లాలనుకునే దేశంలో యూపీఐ పేమెంట్స్ ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. యూపీఐ సేవలు ఉంటే గనక ఫోన్ లో యూపీఐ ఇంటర్నేషనల్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఆ తరువాత ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ పేమెంట్స్ సర్వీస్ కు ఫారెక్స్ ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉంది. విదేశాల్లోనూ యూపీఐ సేవలతో చెల్లింపుల ప్రక్రియ సులభతరం అవుతుంది.

Show comments