Keerthi
Indian Railway: రాబోయే నెల రోజుల్లో దసరా, దీపావళి వస్తున్నాయి. ఇక ఈ పండుగ వేడుకల్లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా చాలామంది వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేస్తారనే విషయం తెలిసిందే. మరి అలాంటి ప్రయాణికుల కోసం తాజాగా రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.
Indian Railway: రాబోయే నెల రోజుల్లో దసరా, దీపావళి వస్తున్నాయి. ఇక ఈ పండుగ వేడుకల్లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా చాలామంది వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేస్తారనే విషయం తెలిసిందే. మరి అలాంటి ప్రయాణికుల కోసం తాజాగా రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.
Keerthi
అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న పండగ సీజన్ రానే వచ్చేసింది. ఇక ఈ పండగ సీజన్ వచ్చిదంటే చాలు.. పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లే ప్రజలు చాలామంది ఉంటారు. అసలే సంక్రాతి తర్వాత.. లాంగ్ గ్యాప్ లో దసరా,దీపావళి పండుగలు వస్తున్నాయి. కనకు ఈ పండుగలను కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని చాలామంది అభిప్రాయపడతారు. ఈ క్రమంలోనే.. ఉపాధి నిమిత్తం దూర ప్రాంతాలకు వలస వచ్చిన ఉద్యోగులు,కార్మికులు చాలామంది సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతారు. దీంతో పండుగలకు ఇంటికి వెళ్లే ప్రయాణికులు రద్దీ ఎక్కువగానే ఉంటుంది. ఇక ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొనే రైల్వే శాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా ప్రయాణికుల సౌకర్యం కోసం కొన్ని ప్రత్యేక రైళ్లను అదనంగా నడిపేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆ వివరాళేంటో చూద్దాం.
రాబోయే నెల రోజుల్లో దసరా, దీపావళి వస్తున్నాయి. ఇక ఈ పండుగ వేడుకల్లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా చాలామంది వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేస్తారు. అయితే ఆ సమయంలో రైళ్ల సంఖ్య తక్కువగా ఉంటే.. ప్రయాణికులు చాలా అసౌకర్యానికి గురవుతారు. కనుక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న రైల్వే సిబ్బంది తాజాగా ఈ పండుగల్లో కొన్ని ప్రత్యేక రైళ్లను నడిపేందదుకు సన్నాహాలు చేస్తోంది. కాగా, ఇదే విషయాన్ని తాజాగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం ( సెప్టెంబర్28)నాడు ఓ ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా.. ఈ ఏడాది పండగ సీజన్ లో దేశ వ్యాప్తంగా దాదాపు 5వేల 975 స్పెషల్ ట్రైన్స్ ను నడుపుతున్నట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
ఇకపోతే ఈ పండుగ సీజన్ లో ప్రయాణికులు రద్దీని తగ్గించేందుకు రైల్వే శాఖ.. రోజువారి 108 రెగ్యులర్ ట్రైన్స్ తో పాటు వాటికి అదనంగా కోచ్ లను పెంచనుంది. అనగా.. సుమారు రైళ్లకు 12వేల 500 కోచ్ లను పెంచి నడిపేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే.. అక్టోబర్ 12న దసరా, అక్టోబర్ 31న దీపావళి, నవంబర్ 7న ఛత్ పూజ పండుగలు ఉండటంతో.. ఆ సమయంలో రద్దీ ఎక్కువగా ఉండే బీహార్, యూపీ, వెస్ట్ బెంగాల్ లో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా రైల్వే శాఖ ప్రత్యేక ట్రైన్స్ నడపనున్నారు. మరి, ఈసారి దసరా, దీపావళి పండుగలకు రైల్వే శాఖ అదనంగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటన చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.