iDreamPost
android-app
ios-app

షాకిచ్చిన ప్రభుత్వ బ్యాంకు.. ఖాతాదారులపై ప్రతి నెలా మరింత భారం!

Big Shock To Bank Customers: కస్టమర్లకు కొన్నిసార్లు బ్యాంకులు గుడ్ న్యూస్ లు చెప్తుంటాయి. కొన్నిసార్లు చేదు వార్తలు చెప్తుంటాయి. తాజాగా ఓ ప్రభుత్వ బ్యాంకు ఖాతాదారులకు షాకిచ్చింది. దీంతో కస్టమర్లపై ప్రతి నెలా మరింత భారం పడనుంది. ఇంతకీ ప్రభుత్వ బ్యాంకు తీసుకున్న నిర్ణయం ఏంటంటే?

Big Shock To Bank Customers: కస్టమర్లకు కొన్నిసార్లు బ్యాంకులు గుడ్ న్యూస్ లు చెప్తుంటాయి. కొన్నిసార్లు చేదు వార్తలు చెప్తుంటాయి. తాజాగా ఓ ప్రభుత్వ బ్యాంకు ఖాతాదారులకు షాకిచ్చింది. దీంతో కస్టమర్లపై ప్రతి నెలా మరింత భారం పడనుంది. ఇంతకీ ప్రభుత్వ బ్యాంకు తీసుకున్న నిర్ణయం ఏంటంటే?

షాకిచ్చిన ప్రభుత్వ బ్యాంకు.. ఖాతాదారులపై ప్రతి నెలా మరింత భారం!

దేశంలో ప్రముఖ ప్రభుత్వ బ్యాంకుల్లో ఒకటైన ఇండియన్ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. తాజాగా బ్యాంకు కష్టమర్లకు షాక్ ఇచ్చింది. దీంతో ఖాతాదారులపై మరింత భారం పడనుంది. ఇండియన్ బ్యాంక్ తాజాగా లోన్ వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఖాతాదారులపై ఈఎంఐ భారం పడనుంది. రుణ ఆధారిత వడ్డీ రేట్లను పెంచింది ఇండియన్ బ్యాంకు. వేరు వేరు టెన్యూర్స్ పై 5 బేసిస్ పాయింట్ల వరకూ వడ్డీ రేట్లు పెంచుతూ ప్రకటించింది. ఓవర్ నైట్, వన్ మంత్, ఎంసీఎల్ఆర్ మినహాయిస్తే మిగతా అన్నింటిపైనా లోన్ వడ్డీ రేట్లు పెంచింది. ఈ నిర్ణయంతో లోన్ తీసుకునేవారిపై, ఆల్రెడీ తీసుకున్న వారిపై తీవ్ర ప్రభావం పడనుంది.

ఈ వడ్డీ రేట్ల పెంపుతో గృహ రుణాలు, వాహన ఋణం, వ్యక్తిగత రుణాలు వంటివి తీసుకుంటే వడ్డీ రేట్లు పెరుగుతాయి. ఈ కారణంగా ఈఎంఐ కూడా పెరుగుతుంది. ఆయా టెన్యూర్ ని బట్టి వడ్డీ రేటు ఎంత పెరిగితే అంత ఈఎంఐ పెరుగుతుంది. గతంలో ఇండియన్ బ్యాంకులో ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ రేటు 8.15 శాతంగా ఉండగా.. నెల ఎంసీఎల్ఆర్ 8.35 శాతంగా ఉండేది. ఇప్పుడు కూడా ఇవే వడ్డీ రేట్లు కొనసాగుతున్నాయి. వీటిలో ఎలాంటి మార్పు లేదు. అయితే 3 నెలలు, 6 నెలలు, 12 నెలల ఎంసీఎల్ఆర్ రేటు మాత్రం పెరిగింది. గతంలో మూడు నెలల ఎంసీఎల్ఆర్ రేటు 8.50 శాతంగా ఉండగా.. ఇప్పుడు దాన్ని 8.55 శాతానికి పెంచారు. గతంలో 8.70 శాతంగా ఉన్న 6 నెలల ఎంసీఎల్ఆర్ రేటు ఇప్పుడు 8.75 శాతానికి పెరిగింది.

గతంలో 8.85 శాతంగా ఉన్న ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు ఇప్పుడు 8.90 శాతానికి పెరిగింది. ఎంసీఎల్ఆర్ నే కాకుండా ట్రెజరీ బిల్స్, లింక్డ్ లెండింగ్ రేట్లను కూడా అసెట్ లయబిలిటీ మేనేజ్మెంట్ కమిటీ పెంచేసింది. టీబీఎల్ఆర్ రేట్ల విషయానికొస్తే.. గతంలో 3 నెలల కంటే తక్కువ వ్యవధిపై వడ్డీ రేటు 6.85 శాతంగా ఉండేది. ఇప్పుడది 6.95 శాతానికి పెరిగింది. 3 నెలల నుంచి 6 నెలల టెన్యూర్ పై 7 శాతంగా ఉంది. 6 నెలల నుంచి ఏడాది, ఏడాది నుంచి మూడేళ్ళ టెన్యూర్ పై వడ్డీ రేటు 7.05 శాతంగా ఉంది. మొత్తం మీద ఇండియన్ బ్యాంక్ తన ఖాతాదారులకు లోన్ వడ్డీ రేట్లను పెంచుతూ బిగ్ షాక్ ఇచ్చింది. దీంతో లోన్ తీసుకునే ఖాతాదారులకు ఈఎంఐ భారం పడనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి