iDreamPost
android-app
ios-app

వెంటనే PAN నంబర్‌ కావాలా.. ఇంట్లో కూర్చోని ఫ్రీగా e-PAN పొందొచ్చు.. ఎలా అంటే?

  • Published Apr 23, 2024 | 3:39 PM Updated Updated Apr 23, 2024 | 3:39 PM

పాన్ కార్డు నెంబర్ తక్షణమే కావాలంటే ఏ చేయాలో తెలియక టెన్షన్ పడుతుంటారు. ఇలాంటి వారికోసం ఇన్ స్టంట్ ఈ పాన్ పొందే అవకాశం కల్పిస్తోంది ఆదాయపన్ను విభాగం. ఎలా పొందొచ్చంటే?

పాన్ కార్డు నెంబర్ తక్షణమే కావాలంటే ఏ చేయాలో తెలియక టెన్షన్ పడుతుంటారు. ఇలాంటి వారికోసం ఇన్ స్టంట్ ఈ పాన్ పొందే అవకాశం కల్పిస్తోంది ఆదాయపన్ను విభాగం. ఎలా పొందొచ్చంటే?

  • Published Apr 23, 2024 | 3:39 PMUpdated Apr 23, 2024 | 3:39 PM
వెంటనే PAN నంబర్‌ కావాలా.. ఇంట్లో కూర్చోని ఫ్రీగా e-PAN పొందొచ్చు.. ఎలా అంటే?

పాన్.. పర్మినెంట్ అకౌంట్ నెంబర్. దీన్ని భారత ఆదాయపన్ను శాఖ జారీ చేస్తుంది. దీన్ని ఐడెంటిఫికేషన్ పత్రంగా కూడా ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుత రోజుల్లో అనేక పనులకు పాన్ కార్డ్ తప్పనిసరిగా మారింది. పాన్ కార్డుతో అనేక ఉపయోగాలున్నాయి. వాహనాలు కొనుగోలు చేయాలన్నా పాన్ కార్డ్ అవసరం. బ్యాంక్ ఖాతా తెరిచేందుకు కూడా పాన్ కార్డ్ ఉండాల్సిందే. అదే విధంగా రూ.50,000 డిపాజిట్లకు కూడా పాన్ అవసరం అవుతుంది. క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసుకునేటప్పుడు, డీమ్యాట్ అకౌంట్ ప్రారంభించేందుకు కూడా పాన్ అవసరం అవుతుంది.

ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగపడే పాన్ కార్డ్ నెంబర్ తక్షణమే కావాలంటే ఎలా? కొత్తగా పాన్ కార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునేవారు రోజులత‌ర‌బ‌డి ఎదురుచూడాల్సిన ప‌ని లేకుండా త‌క్షణమే ఈ-పాన్ పొందే సదుపాయం ఉంది. ఇలాంటి వారికి వెంటనే ఈ-పాన్ పొందే సదుపాయం కల్పిస్తోంది ఆదాయపన్ను విభాగం. ఈ- పాన్ ను పూర్తి ఉచితంగా పొందొచ్చు. ఇందుకోసం ఏం చేయాలంటే?. ఇంట్లో కూర్చోని ఈ-పాన్ పొందే అవకాశాన్ని కల్పిస్తోంది ఆదాయపన్ను విభాగం. ఇందుకోసం ఆవ్యక్తి ఆధార్ నెంబర్ కలిగి ఉండాలి అది మొబైల్ నెంబర్ తో లింక్ అయి ఉండాలి. ఈ విధంగా నిమిషాల్లోనే ఈ పాన్ ను పొందొచ్చు.

e-PAN.. ఫ్రీగా పొందండిలా!

  • ముందుగా ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్‌కు వెళ్లాలి.
  • స్క్రీన్‌పై ఎడమవైపు కనిపిస్తున్న క్విక్ లింక్స్ సెక్షన్‌లో ఇన్ స్టంట్e-PAN ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
  • ఆ తర్వాత గెట్ న్యూ e-PAN ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • మీ ఆధార్‌ కార్డ్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి కింద కనిపించే ఐ కన్ఫామ్ దట్ చెక్‌బాక్స్‌పై టిక్‌ చేసి కంటిన్యూ పై క్లిక్‌ చేయాలి.
  • మీ ఆధార్‌ కార్డ్‌కు లింక్‌ అయిన మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్‌ చేయగానే వ్యక్తిగత వివరాలు స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతాయి.
  • ఆ వివరాలు సరిగ్గా ఉన్నాయో, లేదో ఓసారి పరిశీలించి ఐ యాక్సెప్ట్ దట్ చెక్‌ బాక్స్‌ను ఎంచుకొని కంటిన్యూ పై క్లిక్‌ చేయాలి.
  • అంతే మీ ఇన్‌స్టంట్‌ పాన్‌ కోసం దరఖాస్తు పూర్తయినట్లే. మీకో ఎక్నాలెడ్జ్‌మెంట్‌ నంబర్‌ కూడా జనరేట్‌ అవుతుంది. దాన్ని జాగ్రత్తగా భద్రపర్చుకోవాలి.
  • ఆధార్‌ లింక్‌ చేసిన మొబైల్‌ నంబర్‌కు కన్ఫర్మేషన్‌ మెసేజ్‌ కూడా అందుతుంది. ఆ ఎస్సెమ్మెస్‌ అందగానే గెట్ న్యూ e- PANపక్కనే ఉన్న చెక్ స్టేటస్ / డౌన్ లోడ్ పాన్ ఆప్షన్‌ పై క్లిక్ చేయాలి.
  • ఆధార్‌ నంబర్‌, ఓటీపీ ఎంటర్‌ చేయగానే మీ పాన్‌ అప్‌డేట్‌కు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. ఇలా ఈజీగా ఈ పాన్ ను పొందొచ్చు.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet girişjojobet giriş