iDreamPost
android-app
ios-app

మరో హైదరాబాద్ గా ఆ జిల్లా.. ఈ ఏరియాల్లో పెట్టుబడి పెడితే భవిష్యత్తు బంగారమే

మీరు స్థలాలపై పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా?అయితే ఆజిల్లాలోని ఆ ఏరియాల్లో పెట్టుబడి పెడితే అధిక రాబడులు ఖాయం అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ ఏరియాలు ఏవంటే?

మీరు స్థలాలపై పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా?అయితే ఆజిల్లాలోని ఆ ఏరియాల్లో పెట్టుబడి పెడితే అధిక రాబడులు ఖాయం అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ ఏరియాలు ఏవంటే?

మరో హైదరాబాద్ గా ఆ జిల్లా.. ఈ ఏరియాల్లో పెట్టుబడి పెడితే భవిష్యత్తు బంగారమే

డబ్బు.. డబ్బు.. డబ్బు.. ఇది ఉన్న వాళ్లకైనా.. లేని వాళ్లకైనా ఇంకా కావాలనే ఉంటుంది. కొంతమంది డబ్బు సంపాదన కోసం వ్యాపారాలు చేయడం, స్టాక్ మార్కెట్ లు, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టడం చేస్తుంటారు. మరికొంత మంది భూములపై పెట్టుబడులు పెడుతుంటారు. అయితే స్థిరాస్థిపై పెట్టుబడి పెడితే భవిష్యత్తు బంగారుమయం అవుతుందనడంలో సందేహం లేదు. మరి మీరు కూడా స్థలాలపై పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? మీరు చేసిన ఇన్వెస్ట్ మెంట్ ద్వారా అధిక లాభాలు పొందాలని ఆలోచిస్తున్నారా? అయితే ఆ జిల్లాలోని ఆ ఏరియాల్లో పెట్టుబడిపెడితే భవిష్యత్తులో కనకవర్షం కురవడం తథ్యం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఆ జిల్లా మరో హైదరాబాద్ గా అవతరించబోతోంది కనుక.

హైదరాబాద్ నగరం ఎంతటి అభివృద్ధి సాధించిందో వేరే చెప్పక్కర్లేదు. అన్ని రంగాల్లో అనగా ఫార్మా, ఐటీ, హెల్త్ కేర్, ఆర్గానిక్ క్లస్టర్లు ఇతర పరిశ్రమల ఏర్పాటుతో ఘననీయమైన అభివృద్ధిని సాధించి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నది. భాగ్యనగరం గ్లోబల్ సిటీగా అవతరిస్తున్న వేళ అంతర్జాతీయంగా పేరుగాంచిన కంపెనీలు నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నాయి. దీంతో హైదరాబాద్ లోని భూముల ధరలకు రెక్కలొస్తున్నాయి. కాగా ఇప్పుడు హైదరాబాద్ కు ధీటుగా మరో జిల్లా అభివద్ధికి చిరునామాగా మారబోతోంది. అదే సంగారెడ్డి జిల్లా. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ జిల్లాలోని జహీరాబాద్, న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లో పారిశ్రామిక అభివృద్ధిని సాధించడమే లక్ష్యంగా జాతీయ పారిశ్రామిక ఉత్పత్తి మండలి(నిమ్జ్‌)ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ ప్రాతంలో పరిశ్రమల స్ధాపన మొదలైంది. దాదాపు రెండున్నర లక్షల మందికి ఉపాధి దక్కనుంది.

Places at low rates are huge profits

మరో హైదరాబాద్ గా సంగారెడ్డి:

నిమ్జ్ ప్రాజెక్ట్ లో పూర్తి స్థాయిలో పరిశ్రమలు ఏర్పాటైతే ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోనుంది. దీంతో సంగారెడ్డి మరో హైదరాబాద్ గా రూపంతరం చెందనుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఆ ఏరియాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్ నుంచి దాదాపు 125 కి.మీ. దూరం మాత్రమే ఉండడం పెట్టుబడిదారులకు కలిసొచ్చే అంశం. రోడ్డు, రైలు, మెట్రో మార్గాలు కూడా సమీపంలోనే ఉండడం ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. కాగా సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లో స్థలాల రేట్లు ప్రస్తుతం తక్కువగా ఉన్నాయి. స్క్వేర్ ఫీట్ కు కేవలం రూ. 500 నుంచి రూ. 1000 వరకు పలుకుతోంది. నిమ్జ్ లో పూర్తి స్థాయిలో పరిశ్రమల స్థాపన జరిగినట్లైతే జహీరాబాద్ ప్రాంతంలో హైదరాబాద్ లోని స్థలాలకు పలికిన ధరలే ఇక్కడ కూడా పలుకుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పుడు పెట్టుబడిపెడితే ఒకటి రెండు సంవత్సారాల్లోనే రెట్టింపు లాభాలు అందుకోవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మీరు జహీరాబాద్ ప్రాంతంలో స్వ్కేట్ ఫీట్ కు రూ. 500 చొప్పున 1200 స్క్వేర్ ఫీట్ స్థలాన్ని కొనుగోలు చేసినట్లైతే రూ. 6లక్షలు అవుతుంది. అంటే మీకు చాలా తక్కువ పెట్టుబడితోనే 1200 స్క్వేర్ ఫీట్ స్థలం వచ్చేస్తోంది. ఇదే స్థలాన్ని హైదరాబాద్ లో కొనుగోలు చేసినట్లైతే స్వ్కేర్ ఫీట్ కు రూ. 5000 వేలు అనుకుంటే రూ. 6000000 అవుతుంది. ఈ లెక్కన మీరు అతి తక్కువ పెట్టుబడితోనే జహీరాబాద్ లో స్థలాలను కొనుగోలు చేసుకోవచ్చు. రెండేళ్ల తర్వాత స్వ్కేర్ ఫీట్ ధర రూ. 500 కాస్త రూ. 400 వేలు పలికితే అప్పుడు 1200 స్క్వేర్ ఫీట్ స్థలానికి రూ. 4000000 వస్తుంది. అంటే మీరు ప్రస్తుతం పెట్టుబడి పెట్టిన రూ. 6 లక్షలు తీసేస్తే.. దాదాపు 34లక్షల వరకు అధిక లాభం అందుకున్నట్లే అవుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు వెల్లడిస్తున్నారు.