iDreamPost
android-app
ios-app

ICICI కస్టమర్లకు గుడ్ న్యూస్..! మీ డబ్బే.. మీకు డబ్బులు సంపాదించి పెట్టే ఛాన్స్!

ICICI Bank: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ విత్త సంస్థ ఐసీఐసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. మీ డబ్బులతో మీకు డబ్బులు సంపాదించే అరుదైన ఛాన్స్ గురించి కీలక ప్రకటన వెల్లడించింది. ఇంతకు ఆ గుడ్ న్యూస్ ఏంటంటే..?

ICICI Bank: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ విత్త సంస్థ ఐసీఐసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. మీ డబ్బులతో మీకు డబ్బులు సంపాదించే అరుదైన ఛాన్స్ గురించి కీలక ప్రకటన వెల్లడించింది. ఇంతకు ఆ గుడ్ న్యూస్ ఏంటంటే..?

ICICI కస్టమర్లకు గుడ్ న్యూస్..! మీ డబ్బే.. మీకు డబ్బులు సంపాదించి పెట్టే ఛాన్స్!

దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. వడ్డీ రేట్లను సవరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిక్స్ డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. సవరించిన ఎఫ్డీ రేట్లు రూ. 3 కోట్ల వరకు వర్తించనున్నాయిన తెలిపింది. అలాగే సీనియర్ సిటిజెన్లకు అత్యధిక వడ్డీని అందిస్తుంది. 7.80 శాతం వడ్డీని నిర్ణయించింది. ఈ మేరకు ఈ విత్త సంస్థ సవరించిన రేట్లను అధికారిక వెబ్ సైట్‌లో పేర్కొంది. టెన్యూర్‌ను బట్టి వడ్డీ రేట్లు పెరిగాయి. వారం రోజుల నుండి 10 సంవత్సరాల కాల వ్యవధి వరకు రెగ్యులర్ సిటిజెన్లకు 3 శాతం నుండి 7.25 శాతం వడ్డీ రేట్లను అందిస్తుంది. ఇక సీనియర్ సీనియర్ సిటిజెన్లకు 55 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీని పెంచింది.

సవరించిన వడ్డీ ప్రకారం.. ఫిక్స్ డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజెన్లకు అత్యధికంగా రూ. 7.80 వడ్డీ రేటును అందిస్తుంది. ఏడు రోజుల 29 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే ఎఫ్డీలకు 3 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 30 నుండి 40 రోజుల కాల వ్యవధి అయితే.. 3.5 శాతం వడ్డీని పొందొచ్చు. ఇక 46 రోజుల నుండి 60 రోజుల మధ్య పీరియడ్ అయితే 4.25 శాతం ఇంట్రస్ట్ అందిచనుంది ఐసీఐసీఐ. ఇక 60 రోజుల నుండి 90 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే ఎప్డీలకు 4.5 శాతం వడ్డీని, 91 నుండి 184 రోజుల మధ్య కాల వ్యవధికి 5.75 శాతం వడ్డీని విత్త సంస్థ ఇవ్వనుంది. 185 -270 రోజుల మధ్య ఎఫ్డీలకు 5.75 శాతం వడ్డీ, 271 రోజుల నుండి ఏడాది కాలం వ్యవధి అయితే 6 శాతం వడ్డీ లభిస్తుంది. సంవత్సరం నుండి పదిహేను నెలల లోపు మెచ్యూరిటీ ఉన్నఎఫ్డీలకు 6.7 శాతం వడ్డీని ఆఫర్ చేస్తుంది.

బ్యాంక్ తన FD వడ్డీ రేటును 15 నెలల నుండి రెండు సంవత్సరాల కాలవ్యవధిలో 5 బేసిస్ పాయింట్లు పెంచింది. గతంలో 7.20 శాతం ఉండగా. ఇప్పుడు 7.25 శాతం అదనపు వడ్డీని పొందొచ్చు. 18 నెలల నుంచి 2 సంవత్సరాల కాలవ్యవధిని ఎఫ్డీలకు కూడా వడ్డీ రేటు ఇవ్వనుంది. అలాగే రెండు సంవత్సరాల ఒక రోజు నుండి- 5 సంవత్సరాల కాల వ్యవధి ఉన్న ఎప్డీలకు 7 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 5 ఏళ్ల తర్వాత నుండి పదేళ్ల మధ్య ఎప్డీలకు 6.9 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. అన్నింటికంటే ఎక్కువ వడ్డీ 15 నెలల నుంచి 18 నెలల వ్యవధి టెన్యూర్ డిపాజిట్లకే వస్తుంది. ఇక సీనియర్ సిటిజన్లకు కూడా గరిష్టంగా 7.80 శాతం వడ్డీని అందిస్తుంది. అది కూడా 15 నెలల నుండి 18 నెలల వ్యవధి కాలానికే. 18 నుండి 2 సంవత్సరాల మెచ్యూరిటీ అయితే.. 7.75 శాతం వడ్డీని అందిస్తుంది. ఉదాహరణకు 18 నెలల కాలానికి జనరల్ కేటగిరి వడ్డీ రేట్లను పరిశీలిస్తే.. రూ. 5 లక్షలు జమ చేస్తే మెచ్యూరిటీకి రూ. 53, 986 రూపాయలు చేతికి వస్తాయి. అదే సీనియర్ సిటిజన్లకు 7.8 శాతం చూస్తే.. రూ.5, 58, 078 చేతికి వస్తుంది.