హ్యూండాయ్ క్రేజీ ఆఫర్.. ఆ మోడల్స్ పై 43 వేల వరకు తగ్గింపు

కారు కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హ్యుండాయ్ ఆ మోడల్ కార్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఏకంగా రూ. 43 వేల వరకు తగ్గింపు ప్రకటించింది.

కారు కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హ్యుండాయ్ ఆ మోడల్ కార్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఏకంగా రూ. 43 వేల వరకు తగ్గింపు ప్రకటించింది.

ఇటీవల ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు కొన్ని మోడళ్లపై ధరలు పెంచుతూ కస్టమర్లకు షాకిచ్చిన విషయం తెలిసిందే. నిర్వహణా వ్యయాలు, విడిభాగాల కొరత, ముడి సరుకుల ధరలు పెరగడం వంటి కారణాలతో ధరల పెంపు అనివార్యమని భావించి ధరలు పెంచేశాయి. దీంతో కార్ల కొందామనే ప్లాన్ లో ఉన్నవారికి షాక్ తగిలినట్లైంది. అయినప్పటికీ కొన్ని కంపెనీలు కస్టమర్లను ఆకర్షించి తమ సేల్స్ ను పెంచుకునేందుకు బంపరాఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఆటమొబైల్ కంపెనీ హ్యుండాయ్ కొన్ని మోడళ్లపై భారీ ఆఫర్ ను ప్రకటించింది. ఆ మోడల్ కార్లపై ఏకంగా రూ. 43 వేల వరకు తగ్గింపు అందిస్తోంది. ఈ మధ్యాకాలంలో కారు కొనాలనుకునే వారికి ఇది ఊరటనిచ్చే విషయమనే చెప్పాలి.

ఆటోమొబైల్ కంపెనీ హ్యూండాయ్ కొన్ని సెలెక్ట్ చేసిన మోడళ్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. మార్చి నెలకుగాను ఈ ఆఫర్లు వర్తించనున్నాయి. మొత్తం 4 మోడళ్లపై డిస్కౌంట్ ప్రకటించింది. హ్యుందాయ్ అధికారిక వెబ్ సైట్ ప్రకారం కొన్ని కార్లపై మార్చిలో రూ.43,000 వరకు తగ్గింపు అందిస్తోంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, హ్యుందాయ్ ఐ20, హ్యుందాయ్ ఆరా, హ్యుందాయ్ వెన్యూ వంటి మోడళ్లపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లలో భాగంగా కస్టమర్లకు క్యాష్ డిస్కౌంట్, ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్, కార్పొరేట్ బెనిఫిట్స్ అందనున్నాయి. ఈ ఆఫర్లు మార్చి 1 నుంచి 31 వరకు అమల్లో ఉంటాయిన కంపెనీ వెల్లడించింది.

ఆ మోడల్ కార్లపై తగ్గింపు ఇలా..

హ్యూండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్

  • హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ మోడల్ కారుపై రూ. 30,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 10,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్, రూ. 3,000 కార్పొరేట్ బెనిఫిట్ అందిస్తోంది. ఇవన్నీ కలిపి ఈ కారుపై మొత్తం రూ. 43,000 వరకు తగ్గింపు లభించనుంది. దీని ధర రూ. 5.92 లక్షల నుంచి రూ. 8.56 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంది.

హ్యూండాయ్ ఆరా

  • హ్యుందాయ్ ఆరా మోడల్‌పై రూ. 20,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 10,000 ఎక్స్చేంజ్ డిస్కౌంట్, రూ. 3,000 కార్పొరేట్ బోనస్ అందిస్తోంది. దీంతో ఈ కారుపై రూ. 33,000 వరకు తగ్గింపు లభిస్తోంది. హ్యుందాయ్ ఆరా ధర రూ. 6.49 లక్షల నుంచి రూ. 9.05 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

హ్యూండాయ్ ఐ20

  • హ్యుందాయ్ ఐ20పై రూ. 15,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 10,000 ఎక్స్చేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ మోడల్ కారుపై కార్పోరేట్ బెనిఫిట్ ప్రకటించలేదు. మొత్తం రూ. 25,000 వరకు ప్రయోజనం చేకూరనున్నది. హ్యుందాయ్ ఐ20 ధర రూ. 7.04 లక్షల నుంచి రూ. 11.21 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంది.

హ్యూండాయ్ వెన్యూ

  • హ్యుందాయ్ వెన్యూ ఎస్‌యూవీపై రూ. 30,000 వరకు బెనిఫిట్స్‌ పొందొచ్చు. ఇందులో రూ.20,000 క్యాష్ డిస్కౌంట్, రూ.10,000 ఎక్స్చేంజ్ డిస్కౌంట్ అందించనుంది. వెన్యూ ధర రూ. 7.94 లక్షల నుంచి రూ. 13.44 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంది.
Show comments