iDreamPost
android-app
ios-app

ఎలక్ట్రిక్‌ కార్లపై భారీ డిస్కౌంట్‌ ప్రకటించిన ప్రముఖ కంపెనీ!

  • Published Aug 05, 2023 | 12:18 PM Updated Updated Aug 05, 2023 | 12:18 PM
  • Published Aug 05, 2023 | 12:18 PMUpdated Aug 05, 2023 | 12:18 PM
ఎలక్ట్రిక్‌ కార్లపై భారీ డిస్కౌంట్‌ ప్రకటించిన ప్రముఖ కంపెనీ!

కొత్తగా కారు కొనాలనుకునే వారికి ప్రముఖ కార్ల తయారీ కంపెనీ సంస్థ హ్యూండాయ్‌ మోటార్స్‌ ఇండియా శుభవార్త చెప్పింది. ఎలక్ట్రిక్‌ కార్లపై భారీగా డిస్కౌంట్‌ తీసుకువచ్చింది. తక్కువ ధరలో మంచి కారు.. అది కూడా ఎలక్ట్రిక్‌ కారు కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. హ్యూండాయ్‌ కోనా ఎలక్ట్రిక్‌ కారుపై సదరు కంపెనీ భారీ డిస్కౌంట్‌ పెట్టింది. ఈ కారు కొనుగోలుపై ఏకంగా 2 లక్షల రూపాయలు తగ్గింపు ఉంది. ఈ ఆఫర్‌ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. ఇక, హ్యూండాయ్‌ కోనా ఎలక్ట్రిక్‌ కారు మార్కెట్‌ ధర దాదాపు 20 లక్షల రూపాయలుగా ఉంది. డిస్కౌంట్‌ వర్తించే సమయంలోగా కారును కొన్న వారికి రెండు లక్షల రూపాయలు ఆదా అవుతుంది.

కారును 18 లక్షల రూపాయలకే సొంత చేసుకోవచ్చు. హ్యూండాయ్‌ కంపెనీ జులైలో కోనా కారుపై లక్ష రూపాయల వరకు డిస్కౌంట్‌ ఇచ్చింది. నెల రోజుల్లోనే ఈ డిస్కౌంట్‌ను 2 లక్షలకు పెంచింది. హ్యూండాయ్‌ కోనా ఎలక్ట్రిక్‌ కారు ఈ కంపెనీ తయారు చేసిన తొలి ఎలక్ట్రిక్‌ కారు కావటం.. ఆ కారుపై కంపెనీ భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తూ ఉండటం విశేషం. ఈ కారు 39.2 కడబ్ల్యూహెచ్‌ లిథియం అయాన్‌ బ్యాటరీతో నడుస్తుంది. ఒకసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా 450 కిలో మీటర్లు ప్రయాణించవచ్చు.

కాగా, హ్యూండాయ్‌ కంపెనీ ఎలక్ట్రిక్‌ కారుతో పాటు మిగిలిన మోడళ్లపై కూడా డిస్కౌంట్లు ప్రకటించింది. ఐ20,20 ఎన్‌ మోడళ్లపై రూ. 40 వేల వరకు డిస్కౌంట్‌ ఇచ్చింది. ఇక, ఆరా మోడల్‌పై రూ. 33 వేల రూపాయల డిస్కౌంట్‌ ప్రకటించింది. అల్కాజార్‌ మోడల్‌పై రూ. 20 వేల తగ్గింపు ఉంది. కార్లు కొనేముందు డిస్కౌంట్లపై పూర్తి అవగాహన ఉండాలి. ఈ డిస్కౌంట్లు పలు రకాలుగా కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. మరి, హ్యూండాయ్‌ మోటార్స్‌ కోనా ఎలక్ట్రిక్‌ కారుపై భారీ డిస్కౌంట్‌ ఇవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio