iDreamPost
android-app
ios-app

EV స్కూటర్ పై క్రేజీ ఆఫర్.. ఏకంగా 41 వేల వరకూ ఆదా.. త్వరపడండి

ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనాలనుకునే ప్లాన్ లో ఉన్నట్లైతే ఇదే మంచి అవకాశం. ప్రముఖ కంపెనీకి చెందిన ఈ స్కూటర్ పై బంపరాఫర్ అందుబాటులో ఉంది. ఏకంగా రూ. 41 వేల వరకు ఆదా చేసుకోవచ్చు.

ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనాలనుకునే ప్లాన్ లో ఉన్నట్లైతే ఇదే మంచి అవకాశం. ప్రముఖ కంపెనీకి చెందిన ఈ స్కూటర్ పై బంపరాఫర్ అందుబాటులో ఉంది. ఏకంగా రూ. 41 వేల వరకు ఆదా చేసుకోవచ్చు.

EV స్కూటర్ పై క్రేజీ ఆఫర్.. ఏకంగా 41 వేల వరకూ ఆదా.. త్వరపడండి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ వాహనాల వినియోగం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నాయి. కాలుష్య నివారణ కోసం ఎలక్ట్రిక్ వాహనాల వాడకమే ఉత్తమమని సూచిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రం విద్యుత్‌ వాహనాల కొనుగోళ్ల మీద భారీ ఎత్తున సబ్సిడీ అందించేందుకు ఇ-మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ ను ప్రారంభించనుంది. వాహనదారులు సైతం ఎలక్ట్రిక్ వాహనాల పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే మీరు ఈ మధ్యకాలంలో ఈవీ స్కూటర్ తీసుకోవాలని భావిస్తే బంపరాఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ సంస్థ టీవీఎస్‌ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ పై భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ లో భాగంగా మీరు రూ. 41 వేల వరకు ఆదా చేసుకోవచ్చు.

ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థలు తమ సేల్స్ పెంచుకునేందుకు భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీలు పోటీపడి రాయితీలను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో టీవీఎస్‌ కు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూబ్ పై కళ్లు చెదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. ఏకంగా 41 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ మాత్రం మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. మీరు ఈ ఆఫర్ ద్వారా ఫేమ్ 2 సబ్సిడీ కింద రూ.22,065 పొందొచ్చు. అదేవిధంగా రూ. 6000 క్యాష్ బ్యాక్, నో కాస్ట్ ఈఎంఐపై కొనుగోలు చేస్తే రూ. 7500 అదనపు తగ్గింపును పొందే అవకాశం ఉంది. ఇదే కాకుండా రూ. 5000 విలువైన ఎక్స్‌టెండెడ్‌ వారంటీ కూడా పూర్తి ఉచితంగా పొందొచ్చు. కంపెనీ అందించే ఈ ఆఫర్ ను వినియోగించుకుంటే మీరు రూ. 40,564 ఆదా చేసుకోవచ్చు.

TVS

టీవీఎస్ ఐక్యూబ్ ఈవీ స్కూటర్ సింగిల్ ఛార్జ్ తో 145 కి.మీల దూరం ప్రయాణించొచ్చు. గంటకు 82 కి.మీల వేగంతో ప్రయాణిస్తుంది. ఐక్యూబ్‌ ఎస్టీ మోడల్‌ 0-80 నుంచి చార్జ్‌ చేయడానికి 4 గంటల 6 నిమిషాల సమయం పడుతుంది. ఇందులో 5.1కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. టీవీఎస్‌ ఐక్యూబ్‌ ఎలక్ట్రిక్ స్కూటర్ 7 అంగుళాల టీఎఫ్టీ టచ్ స్క్రీన్, క్లీన్ యూఐ, ఇన్ఫినిటీ థీమ్ పర్సనలైజేషన్, వాయిస్ అసిస్ట్, అలెక్సా స్కిల్ సెట్, ఇంట్యూటివ్ మ్యూజిక్ ప్లేయర్ కంట్రోల్, ఓటీఏ అప్డేడేట్స్, ప్లగ్-అండ్-ప్లే విత్ ఛార్జర్ ఫాస్ట్ ఛార్జింగ్, సేఫ్టీ ఇన్ఫర్మేషన్, బ్లూటూత్ ఫీచర్లతో పాటు 32 లీటర్ల స్టోరేజ్ ను కలిగి ఉంది.