గూబ గుయ్యమంటున్న ఫోన్ రీఛార్జ్ ధరలు! ఇది మనం చేసుకున్న పాపమే!

Tariff Plans Hike-This Sin is Ours: జియో, వొడాఫోన్ ఐడియా, ఎయిర్ టెల్ నెట్వర్క్ లు రీఛార్జ్ ధరలను ఒక్కసారిగా పెంచేశాయి. దీంతో సామాన్యులు, మధ్యతరగతి వ్యక్తుల మీద మరింత భారం పడనుంది. దారుణంగా ఈ ధరలు పెంచేయడంతో జనాలు లబోదిబోమంటున్నారు. అయితే వీళ్ళకి ఆ అవకాశం ఇచ్చింది మనమే. ఈ ధరల బాదుడు మనం చేసుకున్న పాపమే.

Tariff Plans Hike-This Sin is Ours: జియో, వొడాఫోన్ ఐడియా, ఎయిర్ టెల్ నెట్వర్క్ లు రీఛార్జ్ ధరలను ఒక్కసారిగా పెంచేశాయి. దీంతో సామాన్యులు, మధ్యతరగతి వ్యక్తుల మీద మరింత భారం పడనుంది. దారుణంగా ఈ ధరలు పెంచేయడంతో జనాలు లబోదిబోమంటున్నారు. అయితే వీళ్ళకి ఆ అవకాశం ఇచ్చింది మనమే. ఈ ధరల బాదుడు మనం చేసుకున్న పాపమే.

ఇప్పుడంటే జీబీల్లో డేటా కొంటున్నారు గానీ ఒకప్పుడు ఎంబీల్లో డేటా కొనేవారు. రోజుకు ఎంబీల్లో డేటా వాడేవారు. 1 జీబీ డేటాను నెల రోజులు కూడా వాడుకున్నవారు ఉన్నారు. 1 జీబీ డేటా కొనాలంటే 200, 300, 400 చెల్లించాల్సి వచ్చేది. ఈ బాదుడికి చెక్ పెడుతూ జియో ఒక విప్లవం సృష్టించింది. జియో రాకతో ఎయిర్ టెల్, ఐడియా వంటి నెట్వర్క్ లు దిగొచ్చాయి. అప్పటి వరకూ అధిక ధరలతో బాదిన ఈ కంపెనీలు జియో దెబ్బకు తమ రీఛార్జ్ ప్లాన్స్ ధరలను కూడా తగ్గించాయి. అయితే ఇప్పుడు జియో రీఛార్జ్ ధరలను పెంచేసింది. దీంతో మిగతా నెట్వర్క్ లు కూడా ధరలను పెంచేసాయి. ఈ ధరలను దారుణంగా పెంచేసాయని సామాన్యులు బాధపడుతున్నారు. అయితే ఈ పాపం ఎవరిదంటారు? అంటే ఇది మనం చేసుకున్న పాపమే అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

అవును ఇది మనం చేసుకున్న పాపమే. ఉచితాలకు అలవాటు పడడం వల్ల వచ్చిన సమస్య. జియో ఫ్రీ సిమ్ ఆఫర్ చేయడంతో జనాలు ఎగబడి మరీ తీసుకున్నారు. ఉచితంగా సిమ్ వస్తుంది, ఉచిత కాల్స్ చేసుకోవచ్చు అని చెప్పి ఉచితం అనగానే ఎగబడి తీసుకున్నారు. మరి ఊరకనే జనాలకు ఇవ్వడానికి అంబానీ ఏమన్నా చుట్టమా? కాదుగా. ఇది యాపారం. ఆయన స్ట్రాటజీ ఆయనది. తన సిమ్ కార్డుని ప్రమోట్ చేయడం కోసం, జనాల్లోకి తీసుకురావడం కోసం, ఎక్కువ మంది వాడేలా చేయడం కోసం ఉచితం అనే గేలాన్ని వేశారు. ఆ గేలంలో అందరూ పడ్డారు. అప్పుడు ముఖేష్ అంబానీ లాస్ అయిన నష్టాన్ని ఇప్పుడు ఈ ధరల పెంపుతో కవర్ చేసుకుంటున్నారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

తన స్ట్రాటజీతో ఒక పక్క కాంపిటీటర్స్ అయిన ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా నెట్ వర్క్స్ ని ఢీకొట్టడమే కాక.. వీటన్నిటినీ దాటుకుంటూ వచ్చి టాప్ లో ఉన్నారు. కొన్ని నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా జియోకి 47 కోట్ల మంది యూజర్స్ ఉంటే.. ఎయిర్ టెల్ కి 26 కోట్ల మంది, వొడాఫోన్ ఐడియాకి 12 కోట్ల మంది, బీఎస్ఎన్ఎల్ కి 20 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. మొత్తానికి జియో ఒక మాస్టర్ ప్లాన్ తో ఈ టెలికాం రంగంలోకి అడుగుపెట్టింది. తెలివిగా యూజర్స్ ని ఆకర్షించింది. తెలివిగా ప్రత్యర్థులను ఎదుర్కొని నిలబడింది. ఇప్పుడు తెలివిగా ధరలను పెంచింది. పోనీ జియోని వదిలేసి తమ నెట్వర్క్ లకి షిఫ్ట్ అయ్యేలా మిగతా నెట్వర్క్ లు ఏమన్నా అవకాశం ఇచ్చాయా అంటే లేదు. అవి కూడా ధరలు పెంచేశాయి. జియోలో కంటిన్యూ అయినా బాదుడు తప్పదు, వేరే నెట్వర్క్ కి షిఫ్ట్ అయినా బాదుడు తప్పదు. ఇది ఒక సామాన్యుడు చేసుకున్న పాపమే అని జనం మాట. కాదంటారా?

Show comments