iDreamPost
android-app
ios-app

ఓలా EVపై రూ. 20 వేల తగ్గింపు.. ఏ మోడల్ పై అంటే?

  • Published Dec 02, 2023 | 7:51 PM Updated Updated Dec 02, 2023 | 7:51 PM

మీరు ఈ మధ్యకాలంలో మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఎదురు చూస్తున్నారా? తక్కువ ధరలో అదిరే ఫీచర్లు కలిగిన ఈ స్కూటర్లు కావాలనుకునే వారికి ఓలా బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. ఏకంగా ఆ మోడల్ పై రూ. 20 వేల డిస్కౌంట్ ను ప్రకటించింది.

మీరు ఈ మధ్యకాలంలో మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఎదురు చూస్తున్నారా? తక్కువ ధరలో అదిరే ఫీచర్లు కలిగిన ఈ స్కూటర్లు కావాలనుకునే వారికి ఓలా బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. ఏకంగా ఆ మోడల్ పై రూ. 20 వేల డిస్కౌంట్ ను ప్రకటించింది.

  • Published Dec 02, 2023 | 7:51 PMUpdated Dec 02, 2023 | 7:51 PM
ఓలా EVపై రూ. 20 వేల తగ్గింపు.. ఏ మోడల్ పై అంటే?

ఇప్పుడంతా ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. పెట్రోల్ రేట్లు అంతకంతకు పెరుగుతున్న తరుణంలో ఖర్చులు తగ్గించుకునేందుకు వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. అంతేగాక కాలుష్య రహితంగా కూడా ఉండడం, ఈవీ కంపెనీలు పలు రకాల ఆఫర్స్ కూడా ప్రకటించడంతో ఈవీ స్కూటర్ల కొనుగోళ్లు పెరిగాయి. ఈ క్రమంలో ప్రముఖ ఎలక్ట్రికల్ వెహికిల్స్ తయారీ సంస్థ ఓలా అదిరిపోయే ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓలా డిసెంబర్ టు రిమెంబర్ అనే క్యాంపెయిన్ ను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ఓలాకు చెందిన ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ పై భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. దీంతో పెట్రోల్ స్కూటర్ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్ ను పొందే అవకాశం కల్పించింది. ఈ కార్యక్రమం డిసెంబర్ 3 నుంచి ప్రారంభం అవుతుంది. ఇంతకీ ఆ మోడల్ ఏంటంటే?

ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఓలా దూసుకెళ్తోంది. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్లుగా ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందించి మార్కెట్ లోకి ప్రవేశపెట్టడంతో ఓలా స్కూటర్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడుతోంది. ఇప్పటికే పలు రకాల మోడల్లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో వినియోగదారులను మరింత ఆకర్షించేందుకు ఓలా బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. ఓలాకు చెందిన ఈవీ స్కూటర్ ఎస్1ఎక్స్ ప్లస్ మోడల్ పై కళ్లు చెదిరే డిస్కౌంట్ ను ప్రకటించింది. ఈ ఈవీ బైక్ పై ఏకంగా రూ. 20 వేల తగ్గింపు కల్పిస్తోంది. ఎస్1ఎక్స్ ప్లస్ మోడల్ ధర ఇదివరకు రూ. 1,09,999 కు లభించగా ఓలా ప్రకటించిన రూ. 20 వేల డిస్కౌంట్ తో ఇప్పుడు రూ. 89,999 కే సొంతం చేసుకోవచ్చు.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అయినటువంటి ఎస్1 ఎక్స్ ప్లస్ అనేది హై క్వాలిటీ పర్ఫార్మెన్స్ మోడల్. అత్యాధునిక ఫీచర్లను ఈ స్కూటర్ లో పొందుపరిచారు. సుపీరియర్ రైడ్ క్వాలిటీ పొందొచ్చు. కంపెనీ ఇందులో 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ అమర్చింది. సింగిల్ ఛార్జింగ్ తో 151 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు అని కంపెనీ వెల్లడించింది. కాగా ఎస్1 ఎక్స్ ప్లస్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లు. అలాగే ఇందులో 6 కేడబ్ల్యూ మోటార్ ఉంటుంది. దీని వల్ల ఈ స్కూటర్ కేవలం 3.3 సెకన్లలోనే 0 నుంచి 40 కిలోమీటర్ల స్పీడ్ ను అందుకుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఓలా ప్రకటించిన ఆఫర్ ను వినియోగించుకుని ఎస్1 ఎక్స్ ప్లస్ ఈ స్కూటర్ ను సొంతం చేసుకోండి. పూర్తి వివరాలకు ఓలా అధికారిక వెబ్ సైటన్ https://www.olaelectric.com/ ను పరిశీలించండి. ఓలా ప్రకటించిన ఆ ఆఫర్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom