iDreamPost
android-app
ios-app

బంపరాఫర్.. EVపై 34 వేల డిస్కౌంట్.. సింగిల్ ఛార్జ్ తో 160kms రేంజ్

  • Published Jun 01, 2024 | 12:01 PM Updated Updated Jun 01, 2024 | 12:01 PM

మీరు కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ఈ ఆఫర్ ను వదలకండి. ప్రముక కంపెనీకి చెందిన ఈవీపై 34 వేల డిస్కౌంట్ లభిస్తోంది. త్వరపడండి.

మీరు కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ఈ ఆఫర్ ను వదలకండి. ప్రముక కంపెనీకి చెందిన ఈవీపై 34 వేల డిస్కౌంట్ లభిస్తోంది. త్వరపడండి.

  • Published Jun 01, 2024 | 12:01 PMUpdated Jun 01, 2024 | 12:01 PM
బంపరాఫర్.. EVపై 34 వేల డిస్కౌంట్.. సింగిల్ ఛార్జ్ తో 160kms రేంజ్

ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఖర్చులు తగ్గించుకునేందుకు వాహనదారులు ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. పెట్రోల్ తో నడిచే బైక్ ల ధరల్లోనే ఈవీలు సైతం వస్తుండడంతో కొనేందుకు ఇంట్రస్టు చూపిస్తున్నారు. ప్రయాణ ఖర్చు తగ్గడం, సింగిల్ ఛార్జ్ తోనే వంద కి.మీలకు పైగా ప్రయాణించే సౌకర్యం ఉండడంతో ఈవీలకు ఆదరణ పెరిగింది. ప్రముఖ టూవీలర తయారీ కంపెనీలు లేటెస్ట్ ఫీచర్లతో, స్టన్నింగ్ డిజైన్స్ తో ఎలక్ట్రిక్ వెహికిల్స్ ను తయారు చేసి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. మరి మీరు కూడా కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నట్లైతే మీకు బంపరాఫర అందుబాటులో ఉంది. ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఏకంగా 34వేల డిస్కౌంట్ లభిస్తోంది. త్వరపడండి.

ప్రముఖ ఈవీ తయారీ సంస్థ ఒకాయ కంపెనీకి చెందిన ఫాస్ట్ ఎఫ్4 మోడల్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై 11 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఫ్లిప్ కార్ట్ లో ఒకాయ ఫాస్ట్ ఎఫ్4 మోడల్ అసలు ధర రూ. 1,50,112గా ఉంది. ఆఫర్ లో భాగంగా రూ. 1,32,500కు దక్కించుకోవచ్చు. బ్యాంక్, క్రెడిట్ కార్డ్ ఆఫర్లను ఉపయోగించుకున్నట్లైతే 34 వేల తగ్గింపు పొందొచ్చు. మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటే మీకు అదనంగా రూ. 16,125 వరకు డిస్కౌంట్ వస్తుంది. అంటే మొత్తంగా చూస్తే దాదాపు రూ. 34 వేల తగ్గింపుతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సొంతం చేసుకోవచ్చు.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై మూడేళ్ల వరకు లేదంటే 30 వేల కిలోమీటర్ల వరకు బ్యాటరీకి వారంటీ లభిస్తుంది. సింగిల్ ఛార్జ్ తో 160కి.మీల వరకు ప్రయాణించొచ్చు. గంటకు 70కి.మీల వేగంతో ప్రయాణిస్తుంది. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ కావడానికి 5 గంటలు పడుతుంది. ఇందులో ట్యూబ్ లెస్ టైర్లు ఉంటాయి. ఈ స్కూటర్‌లో డ్యూయెల్ ఎల్ఈడీ హెడ్ లైట్స్, స్ప్రింగ్ లోడ్ రియర్ సస్పెన్షన్, టెలీస్కోపిక్ ఫోర్క్ ఫ్రంట్ సస్పెన్షన్, రివర్స్ బటన్, రిమోట్ స్టార్ట్ అండ్ స్టాప్ వంటి పలు రకాల ఫీచర్లు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో అందించారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet