iDreamPost
android-app
ios-app

క్రేజీ ఆఫర్లు ప్రకటించిన Maruti Suzuki.. ఆ మోడల్ కార్లపై 1.5 లక్షల వరకు తగ్గింపు!

  • Published Mar 07, 2024 | 6:54 PM Updated Updated Mar 07, 2024 | 6:54 PM

మీరు ఈ మధ్య కారు కొనాలనే ప్లాన్ లో ఉన్నట్లైతే ఇదే మంచి ఛాన్స్. ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ క్రేజీ ఆఫర్లను ప్రకటించింది. ఆ మోడల్ కార్లపై ఏకంగా లక్షకు పైగా తగ్గింపు ప్రకటించింది.

మీరు ఈ మధ్య కారు కొనాలనే ప్లాన్ లో ఉన్నట్లైతే ఇదే మంచి ఛాన్స్. ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ క్రేజీ ఆఫర్లను ప్రకటించింది. ఆ మోడల్ కార్లపై ఏకంగా లక్షకు పైగా తగ్గింపు ప్రకటించింది.

  • Published Mar 07, 2024 | 6:54 PMUpdated Mar 07, 2024 | 6:54 PM
క్రేజీ ఆఫర్లు ప్రకటించిన Maruti Suzuki.. ఆ మోడల్ కార్లపై 1.5 లక్షల వరకు తగ్గింపు!

సొంత వెహికిల్ ఉంటే ఆ సౌకర్యమే వేరుంటుంది. ఎప్పుడు అవసరముంటే అప్పుడు ఎక్కడికంటే అక్కడికి ప్రయాణం చేయొచ్చు. ప్రైవేట్ వెహికిల్స్ తో పోల్చితే సొంత వాహనాలే బెటర్ అంటుంటారు. ఇక కరోనా అనంతరం సొంత వాహనాలు వాడేందుకే ఇంట్రస్ట్ చూపిస్తున్నారు జనాలు. ఈ నేపథ్యంలోనే కార్లు, బైక్ లను ఇబ్బడిముబ్బడిగా కొనేస్తున్నారు. మార్కెట్ డిమాండ్ ను బట్టి ఆటోమొబైల్ కంపెనీలు ఆధునిక ఫీచర్లు, స్టన్నింగ్ డిజైన్ లతో సరికొత్త మోడళ్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు క్రేజీ ఆఫర్లను ప్రకటిస్తూ సేల్స్ ను పెంచుకుంటున్నాయి. ఈ క్రమంలో దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ కొన్ని మోడళ్లపై బంపరాఫర్స్ ప్రకటించింది. ఏకంగా రూ. 1.5 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తోంది.

ఇటీవల కార్ల ధరలు పెంచుతూ షాకిచ్చిన ఆటోమొబైల్ సంస్థల.. ప్రస్తుతం కస్టమర్లకు ఊరటనిచ్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. పలు కంపెనీలు తమ కార్లపై ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. దేశీయ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ మార్చి నెలకు సంబంధించి కొన్ని మోడళ్లపై ఆఫర్లు ప్రకటించింది. మారుతి సుజుకి నెక్సా లైనప్‌లో ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, జిమ్నీ వంటి కార్లపై కస్టమర్లు రూ.1.5లక్షల వరకు డిస్కౌంట్, ప్రయోజనాలు అందుకోవచ్చు.

మారుతి సుజుకి బాలెనో:

  • మారుతి సుజుకి బాలెనో మోడల్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. బాలెనో పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లపై తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ మోడల్ పెట్రోల్ వేరియంట్లపై రూ. 48,000 వరకు, సీఎన్జీ వేరియంట్లపై రూ. 33,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. మారుతి సుజుకి బాలెనోలోని అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో ఎయిర్‌బ్యాగ్స్, సీట్-బెల్ట్ రిమైండర్, హై-స్పీడ్ వార్ణింగ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు / కెమెరా, ఇమ్మొబిలైజర్, ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్‌లు మరియు ఐసోఫిక్స్ చైల్డ్-సీట్ మౌంట్‌లు వంటివి ఉన్నాయి.

మారుతి సుజుకి ఇగ్నిస్:

  • మారుతి సుజుకి ఇగ్నిస్ కారుపై రూ. 79,000 వరకు డిస్కౌంట్‌ ప్రకటించింది. 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో కలిగి ఉంది. ఇందులో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, స్టార్ట్/స్టాప్ ఇగ్నిషన్ బటన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, టిల్ట్ స్టీరింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉన్నాయి.

జిమ్నీ:

  • మారుతి సుజుకి జిమ్నీ మోడల్ పై క్రేజీ ఆఫర్ ప్రకటించింది. ఈ మోడల్‌ను రూ. 1.5 లక్షల వరకు డిస్కౌంట్‌తో దక్కించుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ అన్ని ప్రాంతాల్లో అందుబాటులో లేదు. కేవలం ముంబై, రత్నగిరిలోని డీలర్‌షిప్‌లకు మాత్రమే వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ కారులో అధునాతన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఏబీఎస్ (anti-lock braking system), ఈబీడీ (electronic brakeforce distribution), బ్రేక్ అసిస్ట్ సిస్టమ్, ఈఎస్పీ (electronic stability program) వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. వాటితో పాటు, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, 3 పాయింట్ ఎమర్జెన్సీ లాకింగ్, రిట్రాక్టర్ సీట్ బెల్ట్స్, రియర్ వ్యూ కెమెరా మొదలైనవి కూడా ఉన్నాయి.

ఫ్రాంక్స్:

  • మారుతి సుజుకి ఫ్రాంక్స్ మోడల్ పై కూడా భారీ డిస్కౌంట్ పొందొచ్చు. ఫ్రాంక్స్ కారు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ రూ.20,000 వరకు డిస్కౌంట్‌తో కొనుగోలు చేయొచ్చు. అయితే 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ వేరియంట్ పై రూ.55,000 డిస్కౌంట్ లభిస్తోంది.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా హైబ్రిడ్:

  • మారుతి సుజుకి గ్రాండ్ విటారా హైబ్రిడ్ మోడల్ పై ఏకంగా రూ. 79,000 వరకు డిస్కౌంట్‌ ప్రకటించింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet