iDreamPost
android-app
ios-app

బెస్ట్ స్కీమ్.. మీ కూతురి భవిష్యత్తు బంగారమే.. రోజుకు 75 కడితే.. చేతికి 14 లక్షలు

  • Published Jul 30, 2024 | 6:10 PM Updated Updated Jul 30, 2024 | 6:10 PM

LIC Kanyadan Insurance Policy: మీరు మీ కూతురి భవిష్యత్తు కోసం పొదుపు చేయాలనుకుంటున్నారా? అయితే బెస్ట్ స్కీమ్ అందుబాటులో ఉంది. రోజుకు 75 కడితే చేతికి 14 లక్షలు అందుకోవచ్చు.

LIC Kanyadan Insurance Policy: మీరు మీ కూతురి భవిష్యత్తు కోసం పొదుపు చేయాలనుకుంటున్నారా? అయితే బెస్ట్ స్కీమ్ అందుబాటులో ఉంది. రోజుకు 75 కడితే చేతికి 14 లక్షలు అందుకోవచ్చు.

  • Published Jul 30, 2024 | 6:10 PMUpdated Jul 30, 2024 | 6:10 PM
బెస్ట్ స్కీమ్.. మీ కూతురి భవిష్యత్తు బంగారమే.. రోజుకు 75 కడితే.. చేతికి 14 లక్షలు

ఆడపిల్ల పుడితే ఇప్పటికీ కొంతమంది భారంగానే భావిస్తున్నారు. పురిటిలోనే ప్రాణాలు తీసిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఆడపిల్ల పుడితే లక్ష్మీ దేవి పుట్టిందనుకునేలా ప్రభుత్వాలు అద్భుతమైన స్కీమ్స్ ను తీసుకొస్తున్నాయి. ఆడబిడ్డలు గల తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండేలా సుకన్య సమృద్ధి యోజన పథకం, ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ వంటివి అందుబాటులో ఉన్నాయి. ఈ స్కీమ్స్ లో బిడ్డల పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే మీ కూతురి భవిష్యత్తు బంగారమవుతుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా అందించే కన్యాదాన్ పాలసీ ఆడపిల్లల కోసం బెస్ట్ స్కీమ్. ఇందులో రోజుకు 75 కడితే.. చేతికి 14 లక్షలు వస్తాయి.

ఆడపిల్ల చదువుకు, పెళ్లి ఖర్చులకు ఇబ్బంది కలగకూడదంటే కన్యాదాన్ పాలసీలో చేరితే లక్షల్లో లాభం పొందొచ్చు. ఆడపిల్లలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఎల్ఐసీ ఈ పథకాన్ని తీసుకొచ్చింది. పేరెంట్స్ తమ కూతురు పేరు మీద ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీని తీసుకోవచ్చు. కుమార్తె వయసు కనీసం సంవత్సరం ఉండాలి. 13-25 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధి వరకు పాలసీ కొనసాగించొచ్చు. ప్రభుత్వానికి చెందిన పాలసీ కాబట్టి ఎలాంటి రిస్క్ ఉండదు. గ్యారంటీ రిటర్స్న్ పొందొచ్చు. ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీ ఆదాయ పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు పొందొచ్చు.

ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీలో రోజుకు రూ. 75 పొదుపు చేస్తే.. అంటే నెలకు రూ. 2,250 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. నెలవారీ ప్రీమియం 25 ఏళ్ల పాటు చెల్లించాలి. మెచ్యూరిటీ కాలానికి చేతికి 14 లక్షలు అందుతాయి. ఈ డబ్బుతో మీ కూతురు చదువు, పెళ్లి ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు. ఈ పాలసీలో చేరితే పాలసీదారుడు సహజ కారణాలతో మరణిస్తే.. రూ. 5 లక్షల డెత్ బెనిఫిట్ లభిస్తుంది. ప్రమాద కారణంగా అయితే 10 లక్షల డెత్ బెనిఫిట్ పొందొచ్చు. లోన్ కూడా పొందొచ్చు. ఎల్ఐసీ కన్యాదాన్ ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం సమీపంలోని ఎల్ఐసీ బ్రాంచ్ ను సంప్రదించి తెలుసుకోవచ్చు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss