iDreamPost
android-app
ios-app

ఒక రైలు తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఏ కంపెనీలు తయారుచేస్తాయి?

  • Published Apr 22, 2024 | 5:22 PM Updated Updated Apr 22, 2024 | 5:22 PM

మనలో చాలా మంది రైలు ఎక్కుతారు. రైలు ప్రయాణం అంటే ఇష్టపడని వారు ఉండరు. చాలా బాగుంటుంది. అయితే మీకు తెలుసా? ఒక రైలుని తయారు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో? ఏ ఏ కంపెనీలు రైలుని తయారు చేస్తాయో? ఇవాళ ఈ కథనంలో మీరు ఈ విషయాలు తెలుసుకోబోతున్నారు.  

మనలో చాలా మంది రైలు ఎక్కుతారు. రైలు ప్రయాణం అంటే ఇష్టపడని వారు ఉండరు. చాలా బాగుంటుంది. అయితే మీకు తెలుసా? ఒక రైలుని తయారు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో? ఏ ఏ కంపెనీలు రైలుని తయారు చేస్తాయో? ఇవాళ ఈ కథనంలో మీరు ఈ విషయాలు తెలుసుకోబోతున్నారు.  

ఒక రైలు తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఏ కంపెనీలు తయారుచేస్తాయి?

భారతదేశంలో రైళ్లను చేసే కంపెనీలు చాలా ఉన్నాయి. ఐసీఎఫ్, బీహెచ్ఈఎల్ ఝాన్సీ, బనారస్ లోకోమోటివ్ వర్క్స్, రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఇలా చాలా కంపెనీలు ఉన్నాయి. ఒక రైలుని తయారు చేయడానికి అయ్యే ఖర్చు టైప్ ఆఫ్ ట్రెయిన్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ రైళ్లలో రెండు రకాల కోచ్ లు ఉంటాయి. ఒకటి ఎల్హెచ్బీ కోచ్ లు, రెండు ఐసీఎఫ్ కోచ్ లు. ఈ బోగీల్లో స్లీపర్ క్లాస్, జనరల్ క్లాస్, ఏసీ, పార్సిల్, లగేజ్ అండ్ బ్రేక్ వ్యాన్ అని రకాలు ఉంటాయి. ఐసీఎఫ్ అంటే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. ఇది చెన్నైలో ఉంది. ఇండియాలో మొట్టమొదటిసారిగా ప్రారంభమైన ఫ్యాక్టరీ. ఈ కంపెనీ తయారు చేసే ఒక స్లీపర్ క్లాస్ కోచ్ కి 80 లక్షలు, జనరల్ క్లాస్ బోగీకి 70 లక్షలు, ఏసీ బోగీకి కోటిన్నర నుంచి రెండు కోట్లు, పార్సిల్ వ్యాన్ బోగీకి 50 లక్షలు, లగేజ్ అండ్ బ్రేక్ వ్యాన్ కి 65 లక్షలు ఖర్చు అవుతుంది.

ఒక రైలులో ఉండే కోచ్ లను బట్టి, కోచ్ రకాన్ని బట్టి ఆ రైలు విలువ అనేది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఐసీఎఫ్ కోచ్ లు 24 అనుకుంటే అందులో 10 స్లీపర్ క్లాస్ లు, 4 జనరల్ కోచ్ లు, 8 ఏసీ కోచ్ లు, 2 లగేజ్ అండ్ బ్రేక్ వ్యాన్ కోచ్ లు ఉంటాయి. వీటితో పాటు ఒక ఇంజిన్ ఉంటుంది. మొత్తం వీటి ధర కలిపిస్తే.. 50 కోట్ల నుంచి 60 కోట్ల వరకూ ఉంటుంది. ఇక ఎల్హెచ్బీ (LHB) అంటే లింక్ హాఫ్ మన్ బాష్ కంపెనీ. ఇది జర్మనీకి చెందిన రైలు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇండియన్ రైల్వేస్ కోసం ప్యాసింజర్ బోగీలను తయారు చేస్తుంటుంది. ఇది ఐసీఎఫ్ తో పోలిస్తే అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వీటిని తయారు చేస్తారు. ఒక స్టాండర్డ్ ఎల్హెచ్బీ రైలులో 6 నుంచి 7 స్లీపర్ కోచ్ లు, 4 సాధారణ బోగీలు, 6 ఏసీ బోగీలు ఉంటాయి. 16, 18, 20, 22 కోచ్ లను కలిగి ఉంటాయి.

వీటిని తయారు చేయాలంటే.. ఒక ఏసీ కోచ్ కి 2.5 కోట్లు.. నాన్ ఏసీ కోచ్ కి కోటి 50 లక్షలు ఖర్చు అవుతుంది. ఇంజిన్ కాస్ట్ వచ్చేసి 20 కోట్లు ఉంటుంది. 26 కోచ్ లు కలిగిన ఫుల్ ఏసీ రైలుని తయారు చేయడానికి 85 కోట్లు ఖర్చు కాగా.. 26 కోచ్ లు కలిగిన నాన్ ఏసీ రైలుని తయారుచేయడానికి 59 కోట్లు ఖర్చు అవుతుంది. ఇక 16 కోచ్ లు కలిగిన వందే భారత్ రైలుని తయారు చేయాలంటే 115 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. జీఎస్టీ కాకుండా ఈ రేటు. చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) జనరల్ మేనేజర్ ఏకే అగర్వాల్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. 16 కోచ్ లు కలిగిన వందే భారత్ రైలుని తయారు చేయడానికి 110 కోట్ల నుంచి 120 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ఎల్హెచ్బీ కోచ్ ధర ఒక్కొక్కటీ 2.5 కోట్లు ఉంటుందట. అదే లోకోమోటివ్ కాస్ట్ వచ్చేసి 12 కోట్ల నుంచి 15 కోట్లు ఉంటుందట.

How much does it cost to make a train

వచ్చే రెండేళ్లలో 200 వందే భారత్ రైళ్లని నడిపేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తుంది. దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ ని టాటా స్టీల్ కంపెనీ తీసుకుంది. వందే భారత్ రైలు కోచ్ లు, సీట్లు తయారు చేస్తే కాంట్రాక్ట్ ని టాటా స్టీల్ కంపెనీ తీసుకుంది. ఈ కంపెనీ ఎల్హెచ్బీ కోచ్ లు, ట్రైన్ ప్యానల్స్, కిటికీలను కూడా తయారు చేస్తుంది. మొత్తంగా ఒక మామూలు రైలు పట్టాలెక్కాలంటే కనీసం 50 కోట్లు ఖర్చు అవుతుంది. అదే ఫుల్ ఏసీ బోగీలున్న రైలు పట్టాలెక్కాలంటే కనీసం 85 కోట్లు ఖర్చు అవుతుంది. అదే ఏసీ, నాన్ ఏసీ కలిపి ఉన్న రైలు పట్టాలెక్కాలంటే 60 కోట్లు ఖర్చు అవుతుందన్న మాట. ఒక సినిమాకి ఒక స్టార్ హీరో తీసుకునే రెమ్యునరేషన్ కి రైలు వచ్చేస్తుందన్న మాట.

ఇందుకే కాబోలు సూపర్ స్టార్ రజినీకాంత్ 3 ఏసీ కోచ్ లు కలిగిన చిన్న రైలుని ఇండియన్ రైల్వేస్ నుంచి కొనుగోలు చేశారు. ఈయన చెన్నైలోని కేలంబక్కంలో ఉన్న తన ఫామ్ హౌజ్ లో ఈ రైలు మీద తిరుగుతారు. ఆయనకు రైలు ప్రయాణం అంటే ఇష్టమట. మెట్రో రైలు బోగీ తయారు చేయాలంటే 7 కోట్ల నుంచి 8 కోట్లు అవుతుందట. బల్క్ ఆర్డర్ ఇస్తే కనుక 4 కోట్ల నుంచి 6 కోట్లు అవుతుందట. అంటే మెట్రో రైలులో ఉండే 3 బోగీలకు 21 కోట్ల నుంచి 24 కోట్లు ఖర్చు అవుతుందన్నమాట. మరి ఒక రైలుని తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలిసింది కదా. ఈ కథనం పిల్లలకు ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి. అలానే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.