iDreamPost
android-app
ios-app

Honda: కారు కొనాలనుకునేవారికి బంపరాఫర్.. తక్కువ ధరకే హొండా కార్లు!

  • Published Sep 05, 2024 | 6:20 PM Updated Updated Sep 05, 2024 | 6:20 PM

Honda Cars: కారు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. హోండా తన కార్లపై డిస్కౌంట్ ఇస్తుంది. కార్లపై క్యాష్ డిస్కౌంట్స్ సహా ఇతర ప్రయోజనాల్ని కల్పిస్తోంది.

Honda Cars: కారు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. హోండా తన కార్లపై డిస్కౌంట్ ఇస్తుంది. కార్లపై క్యాష్ డిస్కౌంట్స్ సహా ఇతర ప్రయోజనాల్ని కల్పిస్తోంది.

  • Published Sep 05, 2024 | 6:20 PMUpdated Sep 05, 2024 | 6:20 PM
Honda: కారు కొనాలనుకునేవారికి బంపరాఫర్.. తక్కువ ధరకే హొండా కార్లు!

కొత్తగా కారు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. మరో దిగ్గజ కార్ల తయారీ సంస్థ హోండా తన కార్లపై డిస్కౌంట్ ఇస్తుంది. తన కార్లపై క్యాష్ డిస్కౌంట్స్ సహా ఇతర ప్రయోజనాల్ని కూడా హొండా కల్పిస్తోంది. ఏకంగా లక్షా 14 వేల వరకు ధరలు తగ్గించుకునే వెసులుబాటు కల్పిస్తోంది హొండా కంపెనీ. ఇప్పుడు వినాయక చవితి, దసరా, దీపావళి వంటి పండగలు వస్తున్నాయి. పండుగ సీజన్లు వచ్చాయంటే.. చాలా మంది కూడా వాహనాలు కొనుగోలు చేయాలని భావిస్తుంటారు. దీనిని క్యాష్ చేసుకునేందుకే కార్ల తయారీ కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అయితే ఇప్పటికే కొన్ని కంపెనీలు ఆఫర్లు ప్రకటించగా ఇక ఇప్పుడు వినియోగదారుల్ని ఆకర్షించేందుకు.. హోండా కంపెనీ కూడా ముందుకొచ్చింది. మరి హొండా కంపెనీ ఇస్తున్న ఈ సూపర్ ఆఫర్ల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

హోండా తన సిటీ మిడ్ సైజ్ సెడాన్‌పైన రూ. 1.14 లక్షల దాకా తగ్గింపుని ఇచ్చింది. హోండా సిటీ సెడాన్ అన్ని వేరియంట్లపై ఈ తగ్గింపు ఉంది. అలాగే హొండా మూడేళ్ల ఫ్రీ మెయింటెనెన్స్ ప్యాకేజీ కూడా అందిస్తోంది. హోండా సిటీ ధర ప్రస్తుతం ఎక్స్ షోరూంలో రూ. 12 లక్షల నుంచి స్టార్ట్ అవుతంది.ఇక హోండా సిటీ e:HEV కార్ పై రూ. 90 వేల దాకా తగ్గింపు ఉంటుంది. అలాగే మూడేళ్ల ఫ్రీ మెయింటెనెన్స్ ప్యాకేజీ ఉంది. ఈ హైబ్రిడ్ సెడాన్ ధర రూ. 20 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే హోండా ఎలివేట్.. SUV పై మూడేళ్ల ఫ్రీ మెయింటెనెన్స్ ప్యాకేజీతో పాటు రూ. 75 వేల దాకా తగ్గింపు ఉంటుంది. దీని ప్రారంభ ధర ఎక్స్ షోరూంలో రూ. 11 లక్షల రేంజిలో ఉంటుంది.

హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్ రూ. 1.12 లక్షల దాకా తగ్గింపుని ఇస్తుంది హొండా కంపెనీ.అంతేగాక క్యాష్ డిస్కౌంట్ తో పాటు మూడేళ్ల పాటు ఫ్రీ మెయింటెనెన్స్ ప్యాకేజీ ఉంటుంది. హోండా అమేజ్ ప్రారంభ ధరని కూడా రూ. 30 వేలు తగ్గించింది హోండా. దీంతో దీని ధర ప్రస్తుతం ఎక్స్ షోరూంలో రూ. 7 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ-వేరియంట్‌పై రూ. 82 వేల దాకా తగ్గింపు ఉంటుంది.ఇక ఎస్ వేరియంట్‌పై రూ. 92 వేల దాకా తగ్గింపు ఉంటుంది. ఇక అన్నీ కలుపుకొని రూ. లక్ష దాకా మనం తగ్గింపు పొందవచ్చు. మరి హోండా కంపెనీ తన కార్లపై ఇస్తున్న ఈ బంపర్ ఆఫర్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

 

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetavrupabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet