P Venkatesh
HDFC UPI Payments: ఆ బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలర్ట్. ఆ తేదీనాడు యూపీఐ సేవలు నిలిచిపోనున్నాయి. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం సేవలు నిలిచిపోనున్నట్లు బ్యాంక్ తెలిపింది.
HDFC UPI Payments: ఆ బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలర్ట్. ఆ తేదీనాడు యూపీఐ సేవలు నిలిచిపోనున్నాయి. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం సేవలు నిలిచిపోనున్నట్లు బ్యాంక్ తెలిపింది.
P Venkatesh
ఆన్ లైన్ చెల్లింపులు అందుబాటులోకి వచ్చాక చెల్లింపుల ప్రక్రియ ఈజీ అయిపోయింది. డిజిటల్ చెల్లింపులతో ఉన్న చోటు నుంచే క్షణాల్లో పేమెంట్ చేసే సౌకర్యం ఏర్పడింది. కిరాణా షాపుల దగ్గర్నుంచి మొదలుకుని షాపింగ్ మాల్స్ వరకు ఏ వస్తువు కొన్నా ఆన్ లైన్ పేమెంట్ చేస్తున్నారు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్స్ తో యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు. ఏదైన కారణం చేత యూపీఐ సేవలు నిలిచిపోతే యూజర్లకు ఏం చేయాలో తోచని పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ హెచ్ డీ ఎఫ్ సీ తమ కస్టమర్లకు బిగ్ అలర్ట్ ఇచ్చింది. రేపు యూపీఐ సేవలు నిలిచిపోనున్నాయని తెలిపింది. ఏ సమయంలో అంటే?
ఇటీవల హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు టెక్నికల్ గా సిస్టమ్ అప్ డేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఫేక్ పేమెంట్స్, ఫ్రాడ్ ను అరికట్టేందుకు బ్యాంక్ చర్యలు తీసుకుంటోంది. ఆ కారణంగా యూపీఐ సేవలు కొంత సమయం పాటు నిలిచిపోతున్నాయి. రేపు మరోసారి యూపీఐ సేవలు బంద్ కానున్నాయి. సిస్టమ్ మెయింటనెన్స్ కారణంగా యూపీఐ సేవలు ఆగస్టు 10, 2024 రోజున అందుబాటులో ఉండవని హెచ్ డీ ఎఫ్ సీ తెలిపింది. ఆగస్టు 10వ తేదీన దాదాపు మూడు గంటల పాటు యూపీఐ పేమెంట్లు నిలిచిపోతాయని తెలిపింది.
ఈ మేరకు కస్టమర్లకు సమాచారం అందిస్తోంది. ఆగస్టు 10, 2024 రోజున తెల్లవారు జామున 2.30 గంటల నుంచి ఉదయం 5.30 గంటల వరకు డౌన్‌టైమ్ నిర్ణయించింది. ఆ సమయంలో యూపీఐ సేవలు అందుబాటులో ఉండవు. అయితే యూపీఐ సేవలు అందుబాటులో ఉండకపోయినా కస్టమర్లు ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఏటీఎంల ద్వారా నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాదారులకు యూపీఐ లిమిట్ ఉంది. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి 24 గంటల్లో అంటే ఒక రోజులో గరిష్ఠంగా రూ. 1 లక్ష పంపించవచ్చు. రోజులో 20 ట్రాన్సాక్షన్లకు అనుమతి ఉంది.