iDreamPost

తక్కువ ధరలో బెస్ట్ స్కూటర్.. 55 వేలకే నయా EV

మీరు ఈమధ్య కాలంలో తక్కువ ధరకు లభించే ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ఎదురుచూస్తున్నట్లైతే మీకు గుడ్ న్యూస్. తక్కువ ధరలోనే బెస్ట్ ఈవీ మార్కెట్ లోకి లాంచ్ అయ్యింది. 55 వేలకే అందుబాటులో ఉంది.

మీరు ఈమధ్య కాలంలో తక్కువ ధరకు లభించే ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ఎదురుచూస్తున్నట్లైతే మీకు గుడ్ న్యూస్. తక్కువ ధరలోనే బెస్ట్ ఈవీ మార్కెట్ లోకి లాంచ్ అయ్యింది. 55 వేలకే అందుబాటులో ఉంది.

తక్కువ ధరలో బెస్ట్ స్కూటర్.. 55 వేలకే నయా EV

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఈవీ స్కూటర్లు, బైక్ ల సేల్ పెరిగింది. ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తక్కువగానే ఉండడంతో వీటి కొనుగోలుకే వాహనదారులు తెగ ఇంట్రస్టు చూపిస్తున్నారు. పెట్రోల్ ధరలు కూడా ఎక్కువగా ఉండడంతో ఈవీల వినియోగం పెరిగిపోయింది. ఇప్పటికే ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు ఈవీల తయారీలో దూసుకెళ్తున్నాయి. రకరకాల మోడళ్లను రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. తాజాగా మరో ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. హర్యానాకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ జీటీ ఫోర్స్ ఈవీ స్కూటర్ల సిరీస్ ను విడుదల చేసింది. అతి తక్కువ ధరకే అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్ ను సొంతం చేసుకోవచ్చు.

మీరు ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనాలనే ప్లాన్ లో ఉంటే ఇదే సరైన సమయం. రూ. 55 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్ ను దక్కించుకోవచ్చు. జీటీ ఫోర్స్ ఈవీ తయారీ సంస్థ విడుదల చేసిన కొత్త మోడల్లు జీటీ వెగాస్, టీడీ రైడ్‌ ప్లస్‌, జీటీ వన్‌ ప్లస్‌ ప్రో, జీటీ డ్రైవ్ ప్రో స్కూటర్ల. వీటి ధరలు చూస్తే.. రూ.55,555 నుంచి రూ.84,555 వరకు ఉన్నాయి. సింగిల్ ఛార్జ్ తో 70 నుంచి 110 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు.

జీటీ వేగాస్:

  • జీటీ వెగాస్‌ ధర విషయానికి వస్తే.. రూ.55,555 ఎక్స్-షోరూమ్ ధరతో అందుబాటులో ఉంది. ఎలక్ట్రిక్ స్కూటర్ 1.5 కేడబ్య్లూహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీని అందించారు. ఈ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేయడానికి నాలుగున్నర గంటలు పడుతుంది. ఇది స్లో-స్పీడ్ స్కూటర్ కాబట్టి గరిష్ట వేగం గంటకు 25 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది. జీటీ ఫోర్స్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 70 కిలోమీటర్ల రైడింగ్ రేంజ్‌ను అందిస్తుంది.

జీటీ రైడ్ ప్లస్:

  • జీటీ రైడ్ ప్లస్ దీని ధర రూ.65,555 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది కూడా తక్కువ-స్పీడ్ స్కూటర్. ఇది గరిష్టంగా గంటకు 25 కిమీల వేంగంతో ప్రయాణించగలదు. బ్యాటరీ ప్యాక్ 2.2 కేడబ్య్లూహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీని అందించారు. సింగిల్ ఛార్జ్ తో ఈ స్కూటర్ 90-95 కిమీ ప్రయాణించొచ్చు.

జీటీ డ్రైవ్ ప్రో:

  • జీటీ డ్రైవ్ ప్రో జీటీ ఫోర్స్ విక్రయిస్తున్న అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ స్కూటర్ ధర రూ.84,555 (ఎక్స్- షోరూమ్)గా ఉంది. ఈ స్కూటర్‌లో 2.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని పొందుపరిచారు. ఈ స్కూటర్ రేంజ్ 110 కిలోమీటర్లు. ఈ స్కూటర్ గరిష్టంగా 65-70 కిమీల వేగంతో ప్రయాణిస్తుంది. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ కావడానికి నాలుగున్నర గంటలు పడుతుంది.

జీటీ వన్ ప్లస్ ప్రో:

  • జీటీ వన్ ప్లస్ ప్రో రూ.76,555 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ స్కూటర్ గరిష్టంగా 65-70 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100- 110 కి.మీల వరకు ప్రయాణించొచ్చు. ఈ స్కూటర్‌లో 2.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని పొందుపరిచారు. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ కావడానికి నాలుగున్నర గంటలు పడుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి