P Krishna
Good News is BSNL: దేశంలోని టెలికాం రంగంలో బీఎస్ఎన్ఎల్ ఎప్పటి నుంచో సర్వీసు అందిస్తుంది.. కాకపోతే ఇతర నెట్ వర్క్ లకు పోటీగా 4 జీ లేకపోవడం వినియోగదారులకు నిరాశ కలిగిస్తుంది.
Good News is BSNL: దేశంలోని టెలికాం రంగంలో బీఎస్ఎన్ఎల్ ఎప్పటి నుంచో సర్వీసు అందిస్తుంది.. కాకపోతే ఇతర నెట్ వర్క్ లకు పోటీగా 4 జీ లేకపోవడం వినియోగదారులకు నిరాశ కలిగిస్తుంది.
P Krishna
ప్రపంచంలో టెక్నాలజీ పెరిగిన తర్వాత మనిషి ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఒక్క చనిపోయిన మనిషికి ప్రాణం పోయడం తప్ప ప్రతి ఒక్క విషయంలో ఎన్నో ప్రయోగాలు చేస్తూ విజయాన్ని అందుకుంటున్నాడు. సాంకేతికంగా విప్లవాత్మక మార్పులు వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ రంగంలో ఎంతో అభివృద్ది సాధించారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. చేతిలో స్మార్ట్ ఫోన్, దానికి తోడు ఇంటర్ నెట్ ఉంటే చాలు ప్రపంచంలో ప్రతిదీ మన కళ్ల ముందు ఉన్నట్లే లెక్క. భారత దేశంలో ఎప్పటి నుంచో కమ్యూనికేషన్ రంగంలో ఉంటున్న బీఎస్ఎన్ఎల్ తాజాగా వినియోగదారులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది.
బిజినెస్ అంటేనే పోటీ.. ఎంతోమందిని ఈ రంగంలో పోటీ ఎదుర్కొని ముందుకు సాగినవారికే మంచి విజయం దక్కుతుందని అంటారు. వ్యాపార రంగం అంటేనే సొంత వారికి కూడా పోటీ ఇవ్వడం. దేశంలోని టెలికం వ్యవస్థలో జియో, ఎయిర్ టేల్, ఐడియా నెట్ వర్కులు రాజ్యమేలుతున్నాయి. ఎప్పటికప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ రంగంలో ముందుకు సాగుతూ ఆయా నెట్ వర్క్‌లు వినియోగదారులకు సేవలు అందిస్తున్నాయి. ఇటీవల జియో, ఎయిర్ టేల్ భారీగా ధరలు పెంచాయి. దీంతో ఎప్పటి నుంచో టెలికం రంగంలో సేవలు అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. కాకపోతే 4G లేకపోవడంతో వినియోగదారులు నిరాశ చెందుతున్నారు. అలాంటి వారికి BSNL గొప్ప శుభవార్త చెప్పింది.
BSNL వినియోగదారులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం ఆధర్వంలోని సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ ఆగస్టులో 4 జీ సేవలను ప్రారంభించబోతుంది. దీనికి ముందు పెద్ద ఎత్తున 4జీ టవర్లను యుద్ద ప్రాతిపదికన ఏర్పాటు చేస్తుంది. దేశంలోని పలు ప్రాంతాల్లో వారంలోపు ఒక 1000 వరకు 4జీ టవర్లను ఇన్ స్టాట్ చేసినట్లు బీఎస్ఎన్ఎల్ సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించింది. 4జీ, 5జీ కోసం మొత్తం 1.12 లక్షల టవర్లు ఇన్‌స్టాల్ చేయడం తమ లక్ష్యం అని.. ఇప్పటి వరకు ప్రభుత్వ రంగ టెటికం కంపెనీ 12వేల టవర్ల వరకు ఇన్‌స్టాల్ చేసినట్లు తెలిపింది. ఇటీవల వరుసగా రిచార్జీ రేట్లు పెంచడంతో అందరూ BSNL వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది.