iDreamPost
android-app
ios-app

Union Budget 2024: ధరలు తగ్గేవి కేవలం ఈ కంపెనీ ఫోన్లు మాత్రమే! ఎందుకంటే..?

  • Published Jul 24, 2024 | 11:58 AMUpdated Jul 24, 2024 | 11:58 AM

నిన్న మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా స్మార్ట్ ఫోన్లు, చార్జర్ల ఉత్పత్తులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.

నిన్న మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా స్మార్ట్ ఫోన్లు, చార్జర్ల ఉత్పత్తులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.

  • Published Jul 24, 2024 | 11:58 AMUpdated Jul 24, 2024 | 11:58 AM
Union Budget 2024: ధరలు తగ్గేవి కేవలం ఈ కంపెనీ ఫోన్లు మాత్రమే! ఎందుకంటే..?

2024-25 వార్షిక బడ్జెట్ ని పార్లమెంట్ లో మంగళవారం (జులై 23)న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టారు. పీఎం నరేంద్ర మోదీ నేతృత్వంలో బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు, రైతులకు, నిరుద్యోగుల సంక్షేమానికి పెద్ద పీట వేసే బడ్జెట్ అని అన్నారు. కేంద్ర బడ్జెట్ లో మొబైల్ ఫోన్లపై పన్నులు తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రాథమిక కస్టమ్స్ సుంకం తగ్గింపు ఐటీ రంగాభివృద్దిని మరింత ప్రేరేపిస్తుందని.. మొబైల్ పరికరాల వినియోగదారులు విస్తృతంగా అందుబాటులోకి తెస్తుందని సామాన్యులు భావిస్తున్నారు. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ ఒకటి ఉంది. వివరాల్లోకి వెళితే..

నిన్న 2024 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగిస్తూ.. స్మార్ట్ ఫోన్లు, చార్జర్ల ఉత్పత్తులపై బేసిక్ కస్టమ్స్ (బీసీడి) తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు, మొబైల్ చార్జర్లతో పాటు స్మార్ట్ ఫోన్ విడిభాగాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం 20 శాతంలతో 15 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.ఈ తగ్గింపు ప్రభావం హై- ఎండ్ ఫోన్లపై మాత్రమే. కారణంగా భారత్ లో అమ్ముడవుతున్న 95 శాతం స్మార్ట్ ఫోన్లు దేశీయంగానే తయారు అవుతున్నాయి.దేశంలో దిగుమతి చేసుకుంటున్న ఫోన్లు ఓపో, వన్ ప్లస్, శాంసంగ్ కంపెనీల ఫన్ల ధరలు 5 శాతం తగ్గనున్నాయి. ఇదిలా ఉంటే.. తక్కువ మార్జిన్, చీప్ సెట్ ధరలు పెరగడం, రూపాయి హెచ్చుతగ్గులు కారణంగా ప్రీమియం స్మార్ట్ ఫోన్ల సెగ్మెంట్ లో తీవ్రమైన పోటీ ఉండే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో కస్టమ్స్ డ్యూటీ 5 శాతం తగ్గింపు ఏమాత్రం సరిపోదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.  ఇదిలా ఉంటే మొబైల్స్ పై సుంకం తగ్గించడం వల్ల వల్ల దేశీయ ఉత్పత్తులు పెంచడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ లో భారత దేశం పోటీతత్వాన్ని పెంపొందించినట్లు అవుతుందని అభిప్రాపడుతున్నారు. మొత్తానికి సుంకం తగ్గించడంతో స్మార్ట్ ఫోన్లు తక్కువ ధరలకు లభిస్తాయని అభిప్రాయపడుతున్నారు. కానీ మొబైల్ ధరల తగ్గుదలపై ఆశ పెట్టుకోవద్దని ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి