Today Gold and silver price: పసిడి ప్రియులకు షాకిస్తున్న బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?

పసిడి ప్రియులకు షాకిస్తున్న బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?

బంగారం కొనాలనుకునే వారికి షాక్. గోల్డ్ ధరలు పరుగులు పెడుతున్నాయి. రెండ్రోజులుగా స్థిరంగా ఉన్న ధరలు నేడు మళ్లీ పెరిగాయి. నేడు హైదరాబద్ లో తులం ఎంతుందంటే?

బంగారం కొనాలనుకునే వారికి షాక్. గోల్డ్ ధరలు పరుగులు పెడుతున్నాయి. రెండ్రోజులుగా స్థిరంగా ఉన్న ధరలు నేడు మళ్లీ పెరిగాయి. నేడు హైదరాబద్ లో తులం ఎంతుందంటే?

బంగారం కొనాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్. గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు నేడు మళ్లీ పెరిగాయి. రోజు రోజుకు గోల్డ్ రేట్స్ పెరుగుతూ రికార్డు ధరకు చేరుకుంటున్నాయి. పసిడి కొనాలనుకునే వారు వెనకా ముందు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. సీజన్ తో సంబంధం లేకుండా బంగారం ధరలు పెరుగుతుండడంతో పసిడి ప్రియులు షాక్ కు గురవుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకుంటున్న ఒడిదుడుకులు, డాలర్ తో రూపాయి మారకం విలువ పడిపోవడం వంటివి గోల్డ్ రేట్ పెరుగుదలకు కారణమవుతున్నాయి. మరి నేడు హైదరాబాద్ మార్కెట్ లో తులం పసిడి ధర ఎంతుందంటే?

నేడు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,700 ఉండగా నేడు రూ. 100 పెరిగింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,800 వద్ద అమ్ముడవుతోంది. అదే విధంగా నిన్న 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,950 ఉండగా నేడు రూ. 100 పెరిగి రూ. 63,050 వ‌ద్ద ట్రేడ్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ పట్నంలలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,950 వద్దకు చేరింది. ఇదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 63,200 వద్ద కొనసాగుతుంది.

వెండి ధర

వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. నేడు కిలో సిల్వర్ పై రూ.200 పెరిగింది. నిన్న హైదరాబాద్ మార్కెట్ లో కిలో సిల్వర్ ధర 77500 కాగా నేడు పెరిగిన ధరతో రూ. 77700 వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 77,700 గా నమోదైంది. హస్తినలో కిలో వెండి రూ.76,200కు చేరింది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.73,000 వద్ద కొనసాగుతోంది.

Show comments