iDreamPost
android-app
ios-app

మహిళలకు గుడ్ న్యూస్.. నేటి బంగారం ధరలు!

  • Published Sep 29, 2023 | 8:54 AM Updated Updated Sep 29, 2023 | 8:59 AM
మహిళలకు గుడ్ న్యూస్.. నేటి బంగారం ధరలు!

బంగారం అంటే భారతీయులు అమితంగా ఇష్టపడతారు. అందుకే మన దేశంలో బంగారానికి ఉన్న విలువు అంతా ఇంతా కాదు. మహిళలు బంగారాన్ని తమ గౌరవసూచకంగా వాడుతుంటారు. పండుగలు, వివాహ కార్యక్రమాలు, ఇతర శుభకార్యాలకు బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు ఎంతగానో ఆసక్తి చూపిస్తుంటారు. ఇటీవల బంగారం ధరలు రోజూ పెరిగిపోతూ వచ్చాయి.. కానీ గత వారం రోజులుగా బంగారం ధరలు నిలకడగా ఉంటూ వస్తున్నాయి. మహిళలకు గొప్ప శుభవార్త.. నేటి బంగారం ధరలు ఎంతో తెలుసుకుందాం.

బంగారం కొనుగోలు చేయానుకునేవారికి గొప్ప శుభవార్త. గత వారం రోజులుగా బంగారం ధరలు స్థిరంగా ఉండటమే కాదు.. తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్ లో శుక్రవారం బంగారం ధరల విషయాకి వస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.53,900 గా నమోదు అయ్యింది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.58,800 గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ గోల్డ్ రూ.600, 24 క్యారెట్ గోల్డ్ ధర రూ.650 కి తగ్గింది. విజయవాడలో కూడా ఇదే ధర కొనసాగుతుంది. ఇక వెండి ధర విషయానికి వస్తే.. కేజీ ధర రూ.500 కి తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్నం నగరాల్లో కేజి ధర రూ.76,500గా ట్రెండ్ అవుతుంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో బంగారం, వెండి ధరల విషయానికి వస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 54,050లుగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.58,950 గా కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 54,100లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 59,020 గా కొనసాగుతుంది. ఇక వెండి విషయానికి వస్తే.. ముంబైలో కిలో వెండి ధర రూ.73,700 ఉండగా, బెంగుళూరులో రూ.73,000లుగా ఉంది, చెన్నైలో 76,500 లుగా నమోదు అయ్యింది.