P Krishna
P Krishna
భారత దేశంలో బంగారం కొనేవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉంది. పెళ్లిళ్లు, పండుగల సీజన్ లో బంగారం కొనేవారి సంఖ్య మరింత పెరిగిపోతుంది. అయితే బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉండటంతో ఏ క్షణంలో రేట్లు పెరిగిపోతాయో అన్న అందోళనలో పసిడి ప్రియులు ఉంటున్నారు. అయితే అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితలు, డాలర్ విలువ, ఫెడ్ వడ్డీ రేట్లలో మార్పులుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు బంగారం రేట్లు మారుతూ ఉంటాయని తెలిసిందే. మన దేశంలో ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బంగారాన్ని ఎంతో ఇష్టపడతారు.. ఆభరణాలు ధరిస్తుంటారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో గత రెండు మూడు రోజులుగా బంగారం, వెండి ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి.
ప్రపంచంలో ఎక్కువగా బంగారు దిగుమతి చేసుకునే దేశంలో భారత్ టాప్ లో ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఎక్కువగా పండుగలు, వివాహాది శుభకార్యాలకు బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఈ మద్య బంగారం ధరలు అమాంతం పెరిగిపోతున్న విషయం తెలిసిందే. కాకపోతే గత రెండు మూడు రోజుల నుంచి మాత్రం బంగారం, వెండి ధరల్లో పెద్దగా మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. కాకపోతే మళ్లి ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం కొనుగోలు చేయదల్చిన వారు ఈ సమయంలో కొనుగోలు చేస్తూ మంచిదని సూచిస్తున్నారు.
నేడు హైదరాబాద్ లో మార్కెట్ లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ ధర రూ.59, 950 గా నమోదు కాగా, 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ ధర రూ.54,950 గా ట్రెండ్ అవుతుంది. ఇక వెండి ధర రూ.79, 300 లు మార్కెట్ వద్ద ట్రెండ్ అవుతుంది. ఢిల్లీతో పోలిస్తే.. హైదరాబాద్ లో వెండి ధర ఎక్కువగానే ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.55,100 వద్ద స్థిరంగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.60,100 గా పలుకుతుంది. వెండి ధర రూ.75,800 గా ట్రెండ్ అవుతుంది.