iDreamPost
android-app
ios-app

తగ్గినట్లే తగ్గి మళ్లీ షాకిస్తోన్న బంగారం ధర.. నేటి రేట్లు ఇవే

  • Published Nov 03, 2023 | 9:29 AM Updated Updated Nov 03, 2023 | 9:29 AM

గత మూడు రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధర నేడు స్వల్పంగా పెరిగింది. ఇక వెండి ధర కూడా భారీగా పెరిగింది. మరి నేడు వెండి, బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

గత మూడు రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధర నేడు స్వల్పంగా పెరిగింది. ఇక వెండి ధర కూడా భారీగా పెరిగింది. మరి నేడు వెండి, బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

  • Published Nov 03, 2023 | 9:29 AMUpdated Nov 03, 2023 | 9:29 AM
తగ్గినట్లే తగ్గి మళ్లీ షాకిస్తోన్న బంగారం ధర.. నేటి రేట్లు ఇవే

భారతీయులకు బంగారం అంటే చాలా సెంటిమెంట్‌. ఆభరణంగానే కాక.. అక్కరకు పనికి వచ్చే పెట్టుబడిగా కూడా భావిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో చేతిలో రూపాయి లేకపోయినా.. బంగారం ఉంటే అక్కరకు పనికి వచ్చే సాధనంగా కూడా భావిస్తారు.. అందుకే సందర్భం దొరికిన ప్రతి సారి బంగారం కొనడానికి ఆసక్తి చూపుతారు. పండగలు, వివాహాది శుభకార్యాల వేళ కచ్చితంగా పసిడి కొనుగోలు చేస్తారు. అయితే గత కొంత కాలంగా బంగారం ధర రాకెట్‌ కన్నా వేగంగా దూసుకుపోతుంది. ఈ క్రమంలో కొన్నాళ్ల పాటు పెరగడం.. ఆపై తగ్గడం చేస్తోంది. ఇక గత మూడు రోజులుగా దిగి వచ్చిన గోల్ట్‌ రేటు.. నేడు మళ్లీ పెరిగింది. శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా బంగారం ధర ఎంత ఉంది అంటే..

నేడు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. భాగ్యనగరంలో నేడు 22 క్యారెట్‌ల గోల్డ్ రేటు 10 గ్రాముల మీద రూ.100 పెరిగి ప్రస్తుత రూ. 56,500 మార్క్ వద్ద ట్రేడవుతోంది. అలాగే 24 క్యారెట్‌ స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాముల మీద రూ. 110 పెరిగి రూ. 61,640 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లోనే కాక దేశ రాజధాని ఢిల్లీలో కూడా నేడు బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ఢిల్లీలో నేడు 22 క్యారెట్‌ బంగారం ధర 10 గ్రాముల మీద రూ.100 పెరిగి రూ. 56,650 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్‌ ప్యూర్ గోల్డ్ రేటు తులం మీద రూ. 110 పెరిగి ప్రస్తుతం రూ. 61,790 మార్క్‌ వద్ద అమ్ముడవుతోంది.

భారీగా పెరిగిన వెండి ధర..

నేడు వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. శుక్రవారం నాడు దేశ బులియన్‌ మార్కెట్‌లో వెండి ధర భారీగా పెరిగింది. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి ధర కిలో మీద రూ. 700 మేర పెరిగి.. రూ. 77,700 మార్క్ వద్ద ట్రేడవుతోంది. ఢిల్లీలో కూడా వెండి ధర భారీగానే పెరిగింది. నేడు ఢిల్లీలో సిల్వర్‌ రేటు కిలో మీద 700 పెరిగి ప్రస్తుతం రూ. 74,800 మార్క్ వద్ద ట్రేడవుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ క్రమంగా పుంజుకుంటున్నాయి. క్రితం రోజుతో పోలిస్తే స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 3 డాలర్ల వరకు పెరిగింది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1986 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 22.73 డాలర్ల వద్ద అమ్ముడవుతోంది.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet