P Krishna
P Krishna
బంగారం అంటే ఇష్టడని వారు ఉండరు. దేశంలో మహిళలు బంగార ఆభరణాలు ధరించడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తుంటారు. ఇంట్లో జరిగే ఏ శుభకార్యం అయినా బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా పండుగలు, వివాహాది శుభకార్యాల సమయంలో బంగారు కొనుగోలు మరీ ఎక్కవగా ఉంటుంది. అందుకే దేశంలో బంగారానికి బాగా డిమాండ్ ఉంటుంది. గత కొంతకాలంగా బంగారం రేట్లు బాగా పెరిగిపోతూ వచ్చింది. నేడు దేశంలోని ప్రముఖ నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం.
ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువు ఏదీ అంటే బంగారం అంటారు. దీనికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. సీజన్ ఏదైనా బంగారం అంటే మహిళలు ఎప్పుడూ ఇష్టపడుతూనే ఉంటారు. గత వారం రోజులుగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ.280 తగ్గింది. దీంతో ప్రస్తుతం రేటు రూ.59,450 గా పలుకుతుంది. 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ.250 తగ్గింది, రూ.54,450 గా పలుకుతుంది. విజయవాడలో కూడా ఇదే రేటు కొనసాగుతుంది.
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.54,650 పలుకుతుంది.. 24 క్యారెట్ల ధర రూ.59,600 ట్రెండ్ అవుతుంది. ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.54,500, 24 క్యారెట్ గోల్డ్ రేటు రూ.59,450 పలుకుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,800, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,780 గా పలుకుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో హైదరాబద్, విజయవాడ, విశాఖ పట్నంలో వెండి ధర రూ. 77, 000గా కొనసాగుతుంది. ఢిల్లీ, ముంబైలో కిలో ధర రూ.74,200, చెన్నైలో కిలో వెండి ధర రూ.77,000, బెంగుళూరు లో రూ.73,000గా కొనసాగుతుంది.