P Venkatesh
కొద్ది రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు నేడు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకున్న ఒడిదుడుకులు, డాలర్ తో రూపాయి మారకం విలువ పడిపోవడం వంటి కారణాలు బంగారం దరలు పెరుగుటకు కారణమవుతున్నాయి. ఈ రోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే?
కొద్ది రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు నేడు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకున్న ఒడిదుడుకులు, డాలర్ తో రూపాయి మారకం విలువ పడిపోవడం వంటి కారణాలు బంగారం దరలు పెరుగుటకు కారణమవుతున్నాయి. ఈ రోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే?
P Venkatesh
ఓవైపు పండగలు మరో వైపు శుభకార్యాలు, పెళ్లిల్లు జోరుగా జరుగుతున్నాయి. ఈ కారణంగా బంగారం కొనే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నప్పటికీ వినియోగదారులు గోల్డ్ కొనడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. బంగారంపై అంత మక్కువ చూపిస్తుంటారు పసిడి ప్రియులు. అయితే రోజు రోజు పెరుగుతున్న బంగారం ధరలు గోల్డ్ కొనే వారికి షాకిస్తున్నాయి. కొద్ది రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు నేడు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకున్న ఒడిదుడుకులు, డాలర్ తో రూపాయి మారకం విలువ పడిపోవడం వంటి కారణాలు బంగారం దరలు పెరుగుటకు కారణమవుతున్నాయి. ఈ రోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే?
మార్కెట్‌లో ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,600 వద్ద ట్రేడ్ అవుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 61,750 కు చేరింది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 200 పెరిగింది. ఇదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 220 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 56,600 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 61,750 వద్ద అమ్ముడవుతోంది. ఇక దేశ రాజధాని హస్తినలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,750లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,900గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,700లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,850గా నమోదైంది.
ఇక బంగారంతో పాటు వెండి ధరలు కూడా పరుగులు పెడుతున్నాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర నేడు రూ. 75,300లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 1200 పెరిగింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 75,300లు ఉండగా.. చెన్నైలో రూ. 78,700గా నమోదైంది. హైదరాబాద్‌లో రూ. 78,700లుగా ఉంది. వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 78,700గా ట్రేడవుతోంది.