Dharani
Dharani
ఎన్నటికి వన్నె తరగని లోహం ఏదైనా ఉంది అంటే అది బంగారమే. ప్రస్తుత కాలంలో భూమి, బంగారం.. వీటి మీద పెట్టుబడి పెడితే.. భవిష్యత్తులో భారీ లాభాలే కానీ.. నష్టపోయే అవకాశం ఏమాత్రం లేదు. గత పదేళ్లలోనే బంగారం, భూమి ధర ఎంత భారీ పెరిగిందో చూడవచ్చు. ఇక ఈ ఏడాది పసిడి ధర రెండు సార్లు గరిష్టాలకు చేరింది. ఇక గత పది రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధర.. నేడు మాత్రం భారీ షాక్ ఇచ్చింది. శనివారం దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. మరి నేడు దేశీయంగా బంగారం, వెండి ధరలు ఎంత పెరిగాయి.. బంగారం పది గ్రాముల ధర ఎంత ఉంది అంటే..
నేడు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర 10 గ్రాముల మీద 220 రూపాయలు పెరిగింది. ఇక నేడు భాగ్యనగరంలో 22 క్యారెట్ పది గ్రాముల గోల్డ్ రేటు రూ.54,700 గా ఉంది. అలానే 24 క్యారెట్ మేలిమి బంగారం ధర కూడా పెరిగింది. 24 క్యారెట్ గోల్డ్ రేటు 10 గ్రాముల మీద రూ.220 పెరిగి.. 59,670 రూపాయలుగా ట్రేడవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధర పెరిగింది. నేడు హస్తినలో 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.54,550 ఉండగా.. 24 క్యారెట్ బంగారం ధర రూ.59,820 గా ఉంది.
నేడు వెండి ధర బంగారం బాటలోనే పయనించింది. కిలో వెండి మీద ఏకంగా 500 రూపాయలు పెరిగింది. నేడు ఢిల్లీలో కిలో వెండి ధర రూ.74 వేల రూపాయల వద్ద ట్రేడవుతోంది. అలానే హైదరాబాద్‌లో వెండి ధర రూ.77,500 వద్ద ట్రేడవుతోంది.