iDreamPost
android-app
ios-app

ఫ్యామిలీ కోసం బెస్ట్ EV.. సింగిల్ ఛార్జ్ తో 110KM రేంజ్

eblu feo x: ఈవీప్రియుల కోసం మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. బడ్జెట్ ధరలోనే లభ్యమవుతున్నది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ ఛార్జ్ తో 110కి.మీల రేంజ్ ను ఇస్తుందని కంపెనీ తెలిపింది.

eblu feo x: ఈవీప్రియుల కోసం మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. బడ్జెట్ ధరలోనే లభ్యమవుతున్నది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ ఛార్జ్ తో 110కి.మీల రేంజ్ ను ఇస్తుందని కంపెనీ తెలిపింది.

ఫ్యామిలీ కోసం బెస్ట్ EV.. సింగిల్ ఛార్జ్ తో 110KM రేంజ్

ఎలక్ట్రిక్ వెహికిల్స్ కు ఆదరణ పెరుగుతోంది. ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు సరికొత్త ఈవీలను రూపొందించి మార్కెట్ లోకి రీలీజ్ చేస్తున్నాయి. స్టన్నింగ్ లుక్, క్రేజీ ఫీచర్లతో వస్తున్న ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఈవీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ఎలక్ట్రిక్ కార్లు, బైక్ లు, స్కూటర్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ వస్తోంది. పెట్రోల్ ధరలు తగ్గించుకునేందుకు కూడా ఈవీలను కొనుగోలు చేస్తున్నారు వాహనదారులు. ఇప్పుడు మార్కెట్ లోకి మరో కొత్త ఈవీ లాంచ్ అయ్యింది. గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ ఇబ్లూ ఫియో ఎక్స్ ఈవీని రిలీజ్ చేసింది. ఫ్యామిలీ కోసం బెస్ట్ ఈవీ అని కంపెనీ చెబుతోంది.

ఇబ్లూ ఫియో ఎక్స్ ఈవీ క్రేజీ ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ ఛార్జ్ తో 110కి.మీల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 2.36 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఈ-స్కూటర్ ఎకానమీ, నార్మల్, పవర్ అనే మూడు రైడ్ మోడ్లతో వస్తుంది. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సియాన్ బ్లూ, వైన్ రెడ్, జెట్ బ్లాక్, డెలీ గ్రే మరియు ట్రాఫిక్ వైట్ అనే కలర్స్ లో లభిస్తున్నది. ఈ ఈవీలో హై రిజల్యూషన్ ఏఓహెచ్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్‌, వెనుక భాగంలో ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి.

Best EV

దీనిలో 7.4 అంగుళాల డిజిటల్ ఫుల్ కలర్ డిస్‌ప్లేను అందించారు. ఈ స్క్రీన్ ను బ్లూటూత్ ద్వారా మొబైల్ ఫోన్‌కి కనెక్ట్ చేయవచ్చు. దీంతోపాటు మొబైల్ ఫోన్‌ ఛార్జ్ చేసుకునేందుకు పోర్ట్‌ ఆప్షన్ ఇచ్చారు. దీని సీటు కింద 28 లీటర్ల బూట్ స్పేస్‌ ఉంది. వస్తువులను పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫ్యామిలీతో షాపింగ్ కు వెళ్లినప్పుడు ఈ ఈవీ మీ చెంత ఉన్నట్లైతే మీ వస్తువులను బూట్ స్పేస్ లో పెట్టుకుని రావొచ్చు. ఈ కొత్త ఇబ్లూ ఫియో ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ఎక్స్-షోరూమ్ ధర రూ.99,999గా నిర్ణయించారు. బడ్జెట్ ధరలో ఈవీ కోసం చూసే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు.