iDreamPost
android-app
ios-app

అదిరే స్కీమ్.. పెట్టుబడి పెడితే నెలకు లక్ష పెన్షన్!

National Pension Scheme: ఎవరైనా సరే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి ఉద్యోగ విరమణ చేసిన తరువాత తమ లైఫ్ సాఫీగా సాగాలని భావిస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని స్కీమ్స్ లో పెట్టుబడులు పెడుతుంటారు.

National Pension Scheme: ఎవరైనా సరే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి ఉద్యోగ విరమణ చేసిన తరువాత తమ లైఫ్ సాఫీగా సాగాలని భావిస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని స్కీమ్స్ లో పెట్టుబడులు పెడుతుంటారు.

అదిరే స్కీమ్.. పెట్టుబడి పెడితే నెలకు లక్ష పెన్షన్!

కేంద్ర ప్రభుత్వం పేద , మధ్య తరగతి ప్రజల కోసం అనేక పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాక పేదవారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ఇతర స్కీమ్సను కూడా తీసుకొచ్చింది. అలానే ప్రజలు పెట్టుబడి పెట్టి..మంచి ఆదాయం పొందేలా పలు రకాల పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వారి వరకు అన్ని రకాల వారికి వివిధ రకాల స్కీమ్స్ ను ప్రారంభించింది. అలాంటి వాటిల్లో కొన్ని స్కీమ్ తో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుంది. అలానే తాజాగా ఓ స్కీమ్ లో పెట్టుబడి పెడితే నెలకు లక్ష పెన్షన్ తీసుకోవచ్చు. మరి.. ఎలానో ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం…

ఎవరైనా సరే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి ఉద్యోగ విరమణ చేసిన తరువాత తమ లైఫ్ సాఫీగా సాగాలని భావిస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని స్కీమ్స్ లో పెట్టుబడులు పెడుతుంటారు. ఈ నేపథ్యంలోనే పదవీ విరమణ తర్వాత సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడానికి  అనేక పెన్షన్ పథకాలను కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తుంది. అలాంటివాటిలో ముఖ్యమైన పథకం నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్సీపీ) పథకం. దీని ద్వారా ఒక వ్యక్తి తన పదవీ విరమణ తరువాత ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. రిటైర్మెంట్ తరువాత ఆదాయాన్ని పెంచడానికి అలాగే  టాక్స్ ను తప్పించుకోవడానికి ఈ స్కీమ్ ఎంతో ఉపయోగపడుతుంది. ఒక సిస్టమాటిక్  సేవింగ్స్ తో ఆర్థికంగా సురక్షితమైన పదవీ విరమణ కోసం ప్లాన్ చేసే వారికి ఎన్సీపీ స్కీమ్ చాలా సాయపడుతుంది.

ఇక ఈ పథకంలో ఎంత ఎక్కువ పెట్టుబడి పెడితే.. రిటైర్మెంట్ తరువాత అంతే స్థాయిలో పెన్షన్ పొందవచ్చు. ఇక ఎన్సీపీ ద్వారా నెలకు లక్ష పెన్షన్ పొందాలి ఎలానే ఇప్పుడు చూద్దాం.. ఉదాహరణకు ఓ వ్యక్తి 21 ఏళ్ల వయస్సులో  నెలకు రూ.8,700ను నేషనల్  పెన్షన్ సిస్టమ్ స్కీమ్ లో పెడితే..అదే వ్యక్తికి 39 ఏళ్లు వచ్చే సరికి రాబట్టి పెరుగుతుంది. అంతేకాక అక్కడి నుంచి 60 ఏళ్లు వచ్చే వరకు ఆపేసిన ఆ తరువాత నుంచి నెలకు రూ.1,00,000కు పైగా పెన్షన్ లభిస్తుంది. 21 ఏళ్ల వ్యక్తి ఈ పథకంలో నెలకు 8,700 రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి.

అలా ఈ పథకంలో 10 సంవత్సరాలకు పైగా పెట్టుబడి పెడితే, అతను తన పెట్టుబడిపై 10 శాతం రాబడిని పొందుతాడు. అలానే ఫిక్స్డ్  ఆదాయాన్ని ఆర్జించే డెట్ ఫండ్స్ కార్పొరేట్ బాండ్లలో ప్రభుత్వం ఆన్యుటీని  ఇన్వెస్ట్ మెంట్ చేస్తుంది. ఆ ఆన్యుటీపై ఆరు శాతం రాబడిని మీరు పొందినట్లయితే, ఆన్యుటీలో పెట్టుబడి పెట్టిన మొత్తం రూ. 30,07,1749 ఉంటుంది. తద్వారా 60 ఏళ్ల తర్వాత ప్రతినెలా  పెన్షన్‌గా రూ.1,00,239 పొందవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఎన్సీపీలో పెట్టుబడి మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటాయి… కాబట్టి ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసే ముందు మార్కెట్ నిపుణులను సంప్రదించడం మంచిది. ఇక పూర్తి సమాచారం కోసం ఎన్సీపీ అధికారిక వెబ్ సైట్ లో చూడండి.