iDreamPost
android-app
ios-app

Flipkart సమ్మర్‌ సేల్‌.. తక్కువ ధరకే ACలు, ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్లు, కూలర్లు

  • Published Apr 16, 2024 | 6:53 PM Updated Updated Apr 16, 2024 | 6:53 PM

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో సమ్మర్ సేల్ ప్రారంభంకాబోతోంది. తక్కువ ధరకే హోమ్ కూలింగ్ అప్లయన్సెస్‌ అయిన కూలర్లు, ఏసీలు, ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్లు అందుబాటులో ఉండనున్నాయి.

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో సమ్మర్ సేల్ ప్రారంభంకాబోతోంది. తక్కువ ధరకే హోమ్ కూలింగ్ అప్లయన్సెస్‌ అయిన కూలర్లు, ఏసీలు, ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్లు అందుబాటులో ఉండనున్నాయి.

  • Published Apr 16, 2024 | 6:53 PMUpdated Apr 16, 2024 | 6:53 PM
Flipkart సమ్మర్‌ సేల్‌.. తక్కువ ధరకే ACలు, ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్లు, కూలర్లు

వేసవికాలం జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. భానుడు భగభగలాడిస్తున్నాడు. జనాలు అడుగు తీసి బయట పెట్టలేని పరిస్థితి వచ్చేసింది. సూర్య బ్రో మేమంటే నీకు ఎందుకంత కోపం అంటూ సోషల్ మీడియాలో మీమ్స్, ఎండలను ఉద్దేశించి చేసే కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓ వైపు టెంపరేచర్స్ పెరుగుదల, మరోవైపు వడగాల్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ ఎండ వేడిమి నుంచి తప్పించుకునేందుకు కూలర్లు, ఏసీలు, ఫ్యాన్ల కు పనిచెబుతున్నారు ప్రజలు. మరి మీరు కూడా ఈ సమ్మర్ లో చల్లదనాన్ని కలిగించే కూలింగ్‌ అప్లయన్సెస్‌ ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే రెడీగా ఉండండి. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో సమ్మర్ సేల్ ప్రారంభంకాబోతోంది.

ఎండకాలం వచ్చిందంటే చాలు చల్లదనాన్నిచ్చే ఉపకరణాలకు ధరలు పెరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో సామాన్యులు కూలర్లు, ఏసీలు, ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్లను కొనలేని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి వారికి గుడ్ న్యూస్ కళ్లు చెదిరే ఆఫర్లతో ఫ్లిప్ కార్ట్ లో సమ్మర్ సేల్ ప్రారంభం కానుంది. ఏప్రిల్‌ 17న మొదలై 23 వరకు కొనసాగనుంది. ఈ సేల్ లో భాగంగా తక్కువ ధరకే మీరు ఏసీలు, ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్లను దక్కించుకోవచ్చు. పలు కంపెనీలకు చెందిన కూలింగ్‌ హోమ్‌ అప్లయన్సెన్స్‌ ఫ్లిప్ కార్ట్ సమ్మర్ సేల్ లో అందుబాటులో ఉండనున్నాయి. కస్టమర్ల బడ్జెట్ ను దృష్టిలోఉంచుకొని వివిధ రకాల ఆఫర్లు ఉంటాయని ఫ్లిప్ కార్ట్ తెలిపింది.

ఫ్లిప్ కార్ట్ సమ్మర్ సేల్ లో భాగంగా కూలింగ్ అప్లియెన్సెస్ ధరలు రూ.1,299 నుంచి ప్రారంభమవుతాయని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. వీటి కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్‌, ఎక్స్ఛేంజ్ వంటి ఇతర ఆఫర్లను అందించనుంది. నో-కాస్ట్‌ ఈఎంఐ, డౌన్ పేమెంట్‌, క్యాష్‌ ఆన్ డెలివరీ, ఫ్లిప్‌కార్ట్‌ పే లేటర్‌ ఈఎంఐ వంటి పేమెంట్‌ ఆప్షన్లు ఉన్నాయి. శామ్‌సంగ్‌, వర్ల్‌పూల్‌, హయర్‌, గోద్రేజ్‌ వంటి బ్రాండ్ లకు చెందిన రిఫ్రిజిరేటర్లు రూ.9,990 నుంచి ప్రారంభమై రూ.2 లక్షల వరకు ఉన్నట్లు వెల్లడించింది. ఏసీల్లో ఎల్‌జీ, వోల్టాస్‌, గోద్రేజ్‌, డైకిన్‌, పానాసోనిక్‌, బ్లూస్టార్‌ బ్రాండ్లు రూ.25,000-65,000 ధరల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపింది. సీలింగ్‌ ఫ్యాన్ల ధర రూ.1,299 నుంచి రూ.15,000 వరకు ఉన్నట్లు పేర్కొంది. కూలర్ల ధరలు కూడా తక్కువ ధరకే అందుబాటులో ఉండనున్నట్లు ఫ్లిప్ కార్ట్ తెలిపింది. మరి రేపే ప్రారంభం కాబోతున్న ఫ్లిప్ కార్ట్ సమ్మర్ సేల్ లో మీకు కావాల్సిన కూలింగ్ అప్లియెన్సెస్ ను తక్కువ ధరలకే దక్కించుకోండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet