iDreamPost
android-app
ios-app

20 వేల స్మార్ట్ ఫోన్ 10 వేలకే! Flipkart బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో భారీ డిస్కౌంట్స్..

  • Published Apr 29, 2024 | 8:09 PM Updated Updated Apr 29, 2024 | 8:09 PM

యూజర్లకు గుడ్ న్యూస్ అందించిన ఫ్లిప్ కార్ట్. ఫ్లిప్ కార్ట్ లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ మే 3 నుంచి ప్రారంభం కానున్నది. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ ను అందిస్తోంది.

యూజర్లకు గుడ్ న్యూస్ అందించిన ఫ్లిప్ కార్ట్. ఫ్లిప్ కార్ట్ లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ మే 3 నుంచి ప్రారంభం కానున్నది. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ ను అందిస్తోంది.

  • Published Apr 29, 2024 | 8:09 PMUpdated Apr 29, 2024 | 8:09 PM
20 వేల స్మార్ట్ ఫోన్ 10 వేలకే! Flipkart బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో భారీ డిస్కౌంట్స్..

మండుటెండల్లో కూల్ కూల్ ఆఫర్లను అందించేందుకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఇక స్మార్ట్ ఫోన్ లవర్స్ కు మాత్రం ఫ్లిప్ కార్ట్ అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. ఫ్లిఫ్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ను ప్రకటించింది. ఈ సేల్ లో భాగంగా స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. మీరు ఈ మధ్య కొత్త ఫోన్ కొనాలనుకునే ప్లాన్ లో ఉన్నట్లైతే ఫ్లిఫ్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో కొనుగోలు చేస్తే భారీగా లాభం పొందుతారు. ఈ సేల్ లో ఫ్లిప్ కార్ట్ 20 వేలు విలువ చేసే స్మార్ట్ ఫోన్ ను కేవలం 10 వేలకే అంటే సగం ధరకే స్మార్ట్ ఫోన్లను సొంతం చేసుకోవచ్చు.

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ మే 3 నుంచి ప్రారంభం కానున్నది. మే 3 నుంచి మే 9 వ‌రకూ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ కొన‌సాగుతుంది. ఈ సేల్‌కు సంబంధించి కొన్ని డీల్స్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్ వెల్ల‌డించింది. ఫ్లిప్ కార్ట్ అధికారిక వెబ్ సైట్ ప్రకారం.. ఈ సేల్ కు సంబంధించి ఓ స్మార్ట్ ఫోన్ ఎంఆర్పీ ధర రూ. 19,999 ఉన్నట్లైతే సేల్ ప్రైస్ లో రూ. 15,999కే అందిస్తోంది. అంటే నాలుగు వేలు తగ్గింపు లభిస్తోంది. ఇదీకాక ఎక్సేంజ్ ఆఫర్ కింద మరో 5000 తగ్గింపునిస్తుంది. దీంతో పాటు బ్యాంక్ డిస్కౌంట్ రూ. 1000 అందిస్తోంది. అంటే మీకు ఆ స్మార్ట్ ఫోన్ ఫైనల్ గా రూ.9,999కే దక్కించుకోవచ్చు. నో కాస్ట్ ఈఎంఐ కింద 2,499 తో కొనుగోలు చేసే సౌకర్యాన్ని కల్పిస్తోంది ఫ్లిప్ కార్ట్. ఇక ఈ సేల్ లో ఏ కంపెనీ ఫోన్లు ఎంత ధరకు లభిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం.

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా పలు కంపెనీలకు చెందిన స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది ఫ్లిప్ కార్ట్. మోటొరొలా ఎడ్జ్ 50 ప్రొ సేల్‌లో రూ. 27999 వ‌ద్ద డిస్కౌంట్ ధ‌ర‌కు లిస్ట్ కానుంది. మోటొ ఎడ్జ్ 40 నియో రూ. 19,999కే అందుబాటులో ఉండ‌నుండ‌గా మోటో జీ64 రూ. 12,999 మోటో జీ34 రూ. 9999కి సేల్‌లో అందుబాటులో ఉండ‌నున్నాయి. పోకో ఎం6 రూ.7999కే ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో దక్కించుకోెవచ్చు. పోకో ఎక్స్‌6 రూ. 17,999, ఐఫోన్ 12 రూ.39,499కి ల‌భించ‌నున్నాయి. ఇక పిక్సెల్ 7ఏ ప‌లు ఆఫ‌ర్ల‌తో రూ. 31,999కి, పిక్సెల్ 8 రూ. 49,999కే ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో అందుబాటులో ఉంటాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş