ఈనెల 18న ‘NPS వాత్సల్య’ స్కీమ్ ప్రారంభం.. అదిరిపోయే బెనిఫిట్స్!.. మీ పిల్లల ఫ్యూచర్ బంగారమే

NPS Vatsalya: మీ పిల్లల బంగారు భవిష్యత్తుకోసం పెట్టుబడిపెట్టాలనుకుంటున్నారా? అయితే కేంద్రం అందించే ఎన్ పీఎస్ వాత్సల్య పథకం బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ నెల 18 నుంచి ప్రారంభంకానున్నది.

NPS Vatsalya: మీ పిల్లల బంగారు భవిష్యత్తుకోసం పెట్టుబడిపెట్టాలనుకుంటున్నారా? అయితే కేంద్రం అందించే ఎన్ పీఎస్ వాత్సల్య పథకం బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ నెల 18 నుంచి ప్రారంభంకానున్నది.

ఏ తల్లిదండ్రులైన తమ పిల్లల భవిష్యత్ బాగుండాలని కోరుకుంటారు. పిల్లలు ఉన్నత స్థాయిలో స్థిరపడాలని భావిస్తుంటారు. అందుకోసం తల్లిదండ్రులు కష్టపడుతూ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంటారు. ఏ కష్టం రాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటుంటారు. వాళ్లు ప్రయోజకులుగా ఎదిగిన రోజు పేరెంట్స్ ఆనందాలకు హద్దే ఉండదు. అంతలా సంబరపడిపోతుంటారు. పిల్లలకు మంచి విద్యను అందిస్తుంటారు, ఆస్తిపాస్తులు కూడా కూడబెడుతుంటారు. కొందరు తల్లిదండ్రులు బిడ్డల భవిష్యత్తు కోసం పలు పథకాల్లో ఇన్వెస్ట్ కూడా చేస్తుంటారు.

ఆడపిల్లల చదువులకు, పెళ్లి ఖర్చులకు భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ముందుగానే పెట్టుబడులు పెడుతుంటారు. మరి మీరు కూడా మీ పిల్లల ఫ్యూచర్ కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం పిల్లల కోసం ఎన్ పీఎస్ వాత్సల్య స్కీమ్ ను తీసుకొచ్చింది. ఇందులో చేరితే భారీ ప్రయోజనాలను అందుకోవచ్చు. ఈ పథకాన్ని ఈ నెల 18న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించనున్నారు. మరి ఈ స్కీమ్ లో చేరేందుకు పిల్లల వయసు ఎంత ఉండాలి? బెనిఫిట్స్ ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకోసం అద్భుతమైన పథకాలను ప్రవేశపెడుతున్నది. ముఖ్యంగా ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ ను తీసుకొచ్చి మంచి రాబడిని అందిస్తున్నది. ఆడపిల్లలు పుట్టారని బాధపడే తల్లిదండ్రులకు మహాలక్ష్మి పుట్టిందనుకునేలా చేస్తుంది ఈ స్కీమ్. ఇప్పుడు అమ్మాయిల కోసం ఎన్ పీఎస్ వాత్సల్య స్కీమ్ ను తీసుకొచ్చింది. ఈ ఏడాది పూర్తి స్తాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన కేంద్రం పిల్లలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఈ పథకాన్ని ప్రకటించింది. పిల్లల ఫ్యూచర్ కోసం దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనుకునే తల్లిదండ్రులకు ఇది బెస్ట్ స్కీమ్ అంటున్నారు నిపుణులు. ఇప్పుడు ఈ పథకాన్ని సెప్టెంబర్ 18, 2024 రోజున ప్రారంభించనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పథకాన్ని లాంచ్ చేసిన తర్వాత విధి విధానాలు వెల్లడించనున్నారు.

ఎన్ పీఎస్ వాత్సల్య స్కీమ్ లో 18 ఏళ్లలోపు బాలబాలికల పేరిట ఖాతా తెరవొచ్చు. తల్లిదండ్రులు, లేదా సంరక్షకులు వారి పిల్లలపేరిట అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. పిల్లలు మేజర్లు అయ్యాక ఆ ఖాతాలను సాధారణ ఎన్‌పీఎస్ ఖాతాగా మారుస్తారు. నేషనల్ పెన్షన్ స్కీమ్ ను మరింత విస్తరించేందుకు ఎన్ పీఎస్ వాత్సల్య పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా కాంపౌండింగ్ ప్రయోజనాన్ని పొందవచ్చు. అంటే వడ్డీపైన వడ్డీ లభిస్తుంది. మైనర్లుగా ఉన్నప్పుడే ఈ ఖాతా తీసుకోవడం వల్ల రిటైర్ మెంట్ నాటికి పెద్ద మొత్తంలో డబ్బు చేతికి అందుతుంది.

సాధారణంగా ఎన్‌పీఎస్ స్కీమ్‌‌లో టైర్ 1, టైర్ 2 అనే రెండు ఖాతాలు ఉంటాయి. టైర్-1 ప్రాథమిక పింఛను అకౌంట్, ఇందులో చేరినపపుడు విత్ డ్రాలపై పరిమితులు ఉంటాయి. ఇక టైర్-2 అనేది స్వచ్ఛంద పొదుపు పథకం. రిటైర్మెంట్ తర్వాత అంటే 60 ఏళ్లు వచ్చాక ఎన్‌పీఎస్‌ నిధిలో 60 శాతం డబ్బులు ఒకేసారి తీసుకోవచ్చు. మిగిలిన 40 శాతంతో యాన్యుటీ పథకాలు కొనుగోలు చేయాలి. దీని ద్వారా నెల నెలా చేతికి పెన్షన్ వస్తుంది. ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80సీసీడీ (1బీ) ద్వారా రూ.50 వేల వరకు పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది సెక్షన్ 80సీ కింద రూ.1,50,000లకు అదనం. అంటే ఎన్ పీఎస్ వాత్సల్య స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపులు పొందవచ్చు.

Show comments