iDreamPost
android-app
ios-app

రూ.20తో 200 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్!

The Power EV P-Sport: నేటికాలంలో అనేక కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తెస్తున్నాయి. వివిధ రకాల ఫీచర్లతో బైక్ లను, కార్లును మార్కెట్ లోకి విడుదల చేస్తోన్నాయి. తాజాగా ఓ ఈవీ బైక్ మార్కెట్ లో అందుబాటులో ఉంది. కేవలం రూ.20 ఖర్చుతో 200కిలోమీటర్లు ప్రయాణించ వచ్చు.

The Power EV P-Sport: నేటికాలంలో అనేక కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తెస్తున్నాయి. వివిధ రకాల ఫీచర్లతో బైక్ లను, కార్లును మార్కెట్ లోకి విడుదల చేస్తోన్నాయి. తాజాగా ఓ ఈవీ బైక్ మార్కెట్ లో అందుబాటులో ఉంది. కేవలం రూ.20 ఖర్చుతో 200కిలోమీటర్లు ప్రయాణించ వచ్చు.

రూ.20తో 200 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్!

నేటికాలంలో ఎలక్ట్రిక్ వాహననాల వినియోగం బాగా పెరిగింది. పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించేందుకు, ఇంధనపు ఖర్చులను ఆదాయ చేసుకోవాలనే ఉద్దేశంతో మార్కెట్ లోకి ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చాయి. అలానే వాటికి ఆదరణ కూడా బాగానే ఉంది. రోజు రోజుకు పెరుగుతున్న ఇంధనం ఖర్చును తగ్గించుకునేందుకు వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే సమయంలో మార్కెట్ లోకి కొత్త కొత్త ఫీచర్లతో ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి. అలానే కొత్త ఎలక్ట్రిక్ బైక్ కొనాలనే ఉద్దేశం ఉండే వారికి  ఓ శుభవార్త. అదిరిపోయే మోడల్ తో ఒక బైక అందుబాటులో ఉంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

నేటికాలంలో అనేక కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తెస్తున్నాయి. వివిధ రకాల ఫీచర్లతో బైక్ లను, కార్లును మార్కెట్ లోకి విడుదల చేస్తోన్నాయి. అలాంటి వాటిల్లో పవర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీ ఒకటి. ఈ కంపెనీ అదిరిపోయే బైక్‌ను అందిస్తోంది. పీ స్పోర్ట్, పీ స్పోర్ట్ ప్లస్ అనే రెండు మోడల్స్ ను మార్కెట్‌లో విక్రయిస్తోంది. ఈక్రమంలో మనం ఎంచుకునే మోడల్ ఆధారంగా ఆ వెహికల్ లో లభించే ఫీచర్లు కూడా మారతాయి.

ఇక పీ స్పోర్ట్ బైక్ విషయానికి వస్తే.. దీనికి ఒక్కసారి ఛార్జీంగ్ పెడితే  150 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. అలానే పి-స్పోర్ట్  ప్లస్ మోడల్  అయితే ఏకంగా 210 కిలో మీటర్ల వెళ్లోచ్చు.  ఈ రెండు మోడల బైక్స్‌లో ఎకో, స్టాండర్డ్, టర్బో, రివర్స్ అనే డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. మనం ఎంచుకునే మోడ్ ఆధారంగా పరిమితి  కూడా మారుతుంది.

ఇక పీ స్పోర్ట్ బైక్ ఎక్స్‌ షోరూమ్ ధర చూసినట్లు అయితే రూ. 1.45 లక్షల నుంచి మొదలైవుతుంది. ఇది కేవలం ప్రైమరీ ధర మాత్రమే. దీనికి ఇన్సూరెన్స్, జీఎస్‌టీ, రిజిస్ట్రేషన్ రుసుములు అదనంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా పీ స్పోర్ట్ ప్లస్ మోడల్ అయితే ధర రూ.1.75 లక్షలుగా ఉంది. దీనికి కూడా పి-స్పోర్ట్ బైక్ మాదిరిగానే ఇన్సూరెన్స్, జీఎస్‌టీ, ఇతర చార్జీలు అదనం. పవర్ ఎలక్ట్రిక్ కంపెనీ టాప్ ఎండ్ వేరియంట్‌లో 3 వేల వాట్ మోటార్  ఉంటుంది. పీక్ పవర్ 6500 వాట్. ఈ బైక్  టాప్ స్పీడ్ గంటకు 85 కిలోమీటర్లు, బరువు 115 కేజీలు ఉంటుంది. అలానే ఈ బైక్ లో లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. దీనికి 4 గంటలు ఛార్జింగ్ సమయం సరిపోతుంది.

డిస్క్ బ్రేకులు, ఎల్ఈడీ డిస్‌ప్లే ఉంటుంది.  బైక్  ముందు భాగంలో హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్స్,  అలానే వెనుక భాగంలో హైడ్రాలిక్ మోనో షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి. సెంట్రల్, రీజనరేటివ్ అనే రెండు బ్రేకింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఇక ఎవరైనా ఈ బైక ను బుక్ చేసుకోవాలంటే కంపెనీ వెబ్‌సైట్‌ ని సందర్శించవచ్చు. ఈ బైక్ రన్నింగ్ కాస్ట్ విషయానికి వస్తే.. కేవలం 20నుంచి 30 రూపాయ ఖర్చుతోనే 200 కిలోమీటర్లు వెళ్లొచ్చని కంపెనీ పేర్కొంటోంది. అందువల్ల ఇంధన ధరలు భరించలేని వారు ఈ వెహికల్స్ కొనుగోలు చేయొచ్చు. ఇంకా మార్కెట్‌లో పలు రకాల ఈవీ బైక్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా చూడొచ్చు.