Dharani
పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. వడ్డీ రేటు పెంచుతూ ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది. ఎంత పెంచింది అంటే..
పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. వడ్డీ రేటు పెంచుతూ ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది. ఎంత పెంచింది అంటే..
Dharani
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్.. పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. వడ్డీరేటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ వడ్డీ రేటును ఖరారు చేసింది. శనివారం జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(సీబీటీ) సమావేశం సందర్భంగా పీఎఫ్ వడ్డీ రేటు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఈపీఎఫ్ఓ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ ఏడాది ఈపీఎఫ్ ఖాతాల్లోని నిల్వలపై వడ్డీ రేటు 8.25 శాతంగా ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. పీఎఫ్ మొత్తంపై గత మూడేళ్లలో ఇదే అత్యధిక వడ్డీ రేటు కావడం గమనార్హం. ఇక గతేడాది వడ్డీ రేటుతో పోలీస్తే.. ఈ ఏడాది ఇంట్రెస్ట్ రేటు స్వల్పంగా పెంచారు. దీనిపై పీఎఫ్ ఖాతాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘ఈ రోజు జరిగిన ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 235వ సమావేశం సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును సిఫార్సు చేసింది. దేశ శ్రామిక శక్తికి సామాజిక భద్రతను పటిష్టం చేయాలన్న ప్రధాని నరేంద మోదీ హామీని నెరవేర్చే క్రమంలో నేడు తీసుకున్న నిర్ణయం ఓ మందడుగు’’ అంటూ ట్వీట్ చేశారు.
ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు ఆర్థిక మంత్రిత్వ శాఖతో సంప్రదించిన తర్వాత ప్రతి ఏడాది ఈపీఎఫ్ వడ్డీ రేటును సమీక్షిస్తారు. ఆ తర్వాత సీబీటీ సిఫార్సు చేసిన రేటును పరిగణలోకి తీసుకున్న తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తుది వడ్డీ రేటు తెలియజేస్తుంది. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించన తర్వాత మాత్రమే పెంచిన వడ్డీ రేటును ఈపీఎఫ్ఓ అధికారికంగా నోటీఫై చేస్తుంది. ఆ తర్వాత ఈ వడ్డీ మోత్తాన్ని ఈపీఎఫ్ఓకు చెందిన సుమారు 6 కోట్ల మంది చందాదారుల అకౌంట్లలో జమ చేస్తుంది.
ఇక సీబీటీ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక శాఖ త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన వడ్డీ రేటుతో పోలిస్తే ఈ ఏడాది కాస్త పెరిగింది. 2022- 23 ఆర్థిక ఏడాదికి గానూ వడ్డీ రేటును 8.15 శాతంగా ఇచ్చారు. అంతకు ముందు ఏడాది 2021- 22లో 8.10 శాతంగా ఇచ్చారు. వీటితో పోలిస్తే ఈసారి 10 బేసిస్ పాయింట్ల మేర పెంచి 8.25గా నిర్ణయించారు.