EPFO ఖాతాదారులకు అలర్ట్.. ఆ అప్ డేట్ కి ప్రూఫ్ గా ఆధార్ చెల్లదు!

EPFO తమ ఖాతాదారులకు బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఇకపై అలాంటి అప్ డేట్స్ కు ఆధార్ కార్డును ప్రూఫ్ గా వాడకూడదని వెల్లడించింది.

EPFO తమ ఖాతాదారులకు బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఇకపై అలాంటి అప్ డేట్స్ కు ఆధార్ కార్డును ప్రూఫ్ గా వాడకూడదని వెల్లడించింది.

ఉద్యోగాలు చేసే వారికి ఈపీఎఫ్వో ఖాతా గురించి తెలిసే ఉంటుంది. ఉద్యోగుల భవిష్యత్ ఉద్యోగ విరమణ తర్వాత కూడా సంతోషంగా ఉండేందుకు కొంత నిధిని సమకుర్చుకునేందుకు వీలుపడే సంస్థ. ఈ ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ తమ ఖాతాదారులకు ఒక కీలక అప్ డేట్ ని ఇచ్చింది. ఈపీఎఫ్వో ఖాతాకు సంబంధించి అవసరమైతే అప్ డేట్స్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అందుకు ప్రూఫ్ గా కొన్ని లిస్టెడ్ డాక్యుమెంట్స్ ని అందించాల్సి ఉంటుంది. ఒక్కో అప్ డేట్ ఒక్కో విధమైన పత్రాలను అందించేందుకు అవకాశం ఉంటుంది. ఆ లిస్టులోంచి ఆధార్ కార్డుని తొలగించారు.

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తమ ఖాతాదారులకు కీలక అలర్ట్ ని జారీ చేసింది. ఇకపై మీరు మీ ఈపీఎఫ్వో ఖాతాకి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ ని అప్ డేట్ చేసుకోవాలి అంటే అందుకు ప్రూఫ్ గా ఆధార్ కార్డుని సమర్పించలేరు. ఎందుకంటే ఆధార్ కార్డుని డేట్ ఆఫ్ బర్త్ అప్ డేట్ వినియోగించే ప్రూఫ్ లిస్టు నుంచి ఈపీఎఫ్వో సంస్థ తొలగించింది. అంటే మీరు మీ ఈపీఎఫ్వో ఖాతాకి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ అప్ డేట్ లేదా కరెక్షన్స్ చేసేందుకు ఆధార్ ని వాడలేరు. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. “డేట్ ఆఫ్ బర్త్ రుజువుగా ఉపయోగించదగిన డాక్యుమెంట్స్ లిస్ట్ నుంచి ఆధార్ కార్డును తొలగించాం. డేట్ ఆఫ్ బర్త్ ప్రూవ్ గా ఆధార్ కార్డుని వినియోగించకూడదని, ఆమోదించదగిన పత్రాల జాబితా నుంచి తొలగించాలంటూ యూఐడీఏఐ నుంచి లేఖ వచ్చిన క్రమంలో ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నాం” అంటూ ఈపీఎఫ్వో సంస్థ సర్క్యులర్ జారీ చేశారు.

ఆధార్ గురించి అందరికీ అవగాహన ఉండే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా భారతదేశ పౌరులకు ఒక్కొక్కరికి ఒక యూనిక్ 12 అంకెల సంఖ్యను జారీ చేస్తారు. దీనిలో మీ పేరు, వివరాలు, చిరునామా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటాయి. అయితే ఈ ఆధార్ ను డేటాఫ్ బర్త్ ధృవీకరణ పత్రంగా మాత్రం వాడకూడదని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచిస్తోంది. దీనిని మీరు మీ గుర్తింపు కార్డుగా, చిరునామా గుర్తింపు కోసం అవరమైన పత్రంగా వాడుకోవచ్చు. ఇంక ఈ ఈపీఎఫ్వో ఖాతాదారులు డేటాఫ్ బర్త్ అప్ డేట్ చేసుకునేందుకు వాడాల్సిన పత్రాలను కూడా వెల్లడించారు.

రిజిస్ట్రార్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ జారీ చేసిన జనన ధృవీకరణ పత్రం, ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన బోర్డ్, యూనివర్సిటీ, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్, టీసీ, ఎస్ఎస్ఈ సర్టిఫికేట్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల సర్వీస్ రికార్డును ధృవీకరణకు వాడుకోవచ్చు. ఇవేమీ లేనిపక్షంలో సివిల్ సర్జన్ పరీక్ష చేసి జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్ ని వాడుకోవచ్చు. దాంతోపాటు అఫిడవిట్ ని ఇవ్వాలి. ఇవి మాత్రమే కాకుండా.. పాస్ పోర్ట్, పాన్ కార్డు, మెడిక్లయిమ్, గవర్నమెంట్ అందించిన నివాస ధృవీకరణ పత్రాన్ని రుజువుగా వాడుకోవచ్చు. ఈపీఎఫ్వో ఖాతాలో డేటాఫ్ బర్త్ ని అప్ డేట్ చేసేందుకు వాడే డాక్యుమెంట్ల నుంచి ఆధార్ తొలగించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments