P Krishna
ప్రతిరోజూ గుడ్డు తినడం వల్ల ఎన్నో పోషక పదార్థాలు సమకూరుతాయి అని వైద్యులు చెబుతుంటారు. నాన్ వెజ్ ప్రియులకు గుడ్డు ఒక వరం లాంటిది.. ఎన్నో రకాల వంటకాలు చేసుకొని తింటుంటారు.
ప్రతిరోజూ గుడ్డు తినడం వల్ల ఎన్నో పోషక పదార్థాలు సమకూరుతాయి అని వైద్యులు చెబుతుంటారు. నాన్ వెజ్ ప్రియులకు గుడ్డు ఒక వరం లాంటిది.. ఎన్నో రకాల వంటకాలు చేసుకొని తింటుంటారు.
P Krishna
దేశంలో నిన్నటి వరకు కార్తీక మాసం సందడి కొనసాగింది. సాధారణంగా కార్తీక మాసంలో చాలామంది మాంసం ముట్టరు. చివరికి కోడి గుడ్డు కూడా తినరు. దీంతో కార్తీక మాసంలో చికెన్ ధర దారుణంగా పడిపోయింది. మూడు నెలల క్రితం రూ.300 వరకు ఉన్న చికెన్ ఇటీవల రూ.150కి చేరుకుంది. కొన్నిచోట్ల కేవలం కిలో రూ.100 లకే ఆఫర్ పెట్టిన సంగతి తెలిసిందే. కోడిగుడ్డు ధరలు కూడా భారీగా తగ్గాయి. రూ.6 లకు గుడ్డు లభించింది. ఇప్పుడు కార్తీక మాసం పూర్తయ్యింది.. మళ్లీ నాన్ వెజ్ ధరలు పుంజుకోవడం మొదలయ్యాయి. నిన్నమొన్నటి వరకు సామాన్యులకు అందుబాటు ధరలో ఉన్న గుడ్డు ఒకేసారి పెరిగిపోయింది. త్వరలో క్రిస్మస్, న్యూ ఇయర్ రాబోతున్న నేథ్యంలో గుడ్డు పై ధరల ప్రభావం పడినట్టు వ్యాపారులు చెబున్నారు. వివరాల్లోకి వెళితే..
ప్రతిరోజూ గుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని అంటారు. అంతేకాదు ఇంటికి అతిధులు, స్నేహితులు వస్తే వెంటనే గుడ్డు తో వంటకాలు చేసి వడ్డిస్తుంటారు. మద్యతరగతి నాన్ వెజ్ తినే కుటుంబాల్లో గుడ్డుకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అలాంటిది కార్తీక మాసం ముగియడంతో గుడ్డ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రిలైట్ మార్కెట్ లో ఒక్కో గుడ్డు ధర రూ.6.50 నుంచి రూ.7 వరకు పెరగడంతో నాన్ వెజ్ ప్రియులకు షాక్ తగిలినట్టయ్యింది. వైద్యులు రోజుకో కోడి గుడ్డు తినండి.. ఆరోగ్యంగా ఉండండి అంటూ సూచనలు, సలహాలు ఇస్తుంటారు. ఇప్పుడు మార్కెట్ లోకి వెళ్తే గుడ్డు ధర చుక్కలు చూపిస్తుంది. సాధారణంగా నాన్ వెజ్ తినేవారు కచ్చితంగా గుడ్డును ఏదో ఒక రూపంలో తింటుంటారు. ఉడికించిన గుడ్లలో ఎన్నో పోషక పదార్ధాలు ఉంటాయి. ఒక్క గుడ్డులో 7 గ్రాముల ప్రొటీన్, 5 గ్రాముల కొవ్వు, 75 కేలరీలతో పాటు ఐరన్, విటమిన్స్, కొవ్వులు, ఖనిజాలు ఉంటాయి కనుక డాక్టర్లు రోజూ గుడ్డు తినాలని చెబుతుంటారు. పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే ఉడికించిన గుడ్డును ఎంతో ఇష్టంగా తింటారు.
ప్రస్తుతం రిటైల్ మార్కెట్ లో ఒక్క గుడ్డు ధర రూ.6.50 నుంచి రూ.7 రూపాయలకు పెరగడంతో కొన్ని ప్రాంతాల్లో మరికాస్త ఎక్కువ రేటుకే అమ్ముతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టోకుగా 100 గుడ్ల ధర రూ.580 ఉంటే.. హూల్ సేల్ మార్కెట్ లో గుడ్డ ధర రూ.5.80 పలుకుతుండగా.. అది రిటైల్ మార్కెట్ లోకి వచ్చేసరికి రూ.1.20 వరకు పెరుగుతుంది.. దీంతో ప్రసుతం మార్కెట్ లో వ్యాపారులు ఒక్క గుడ్డు రూ.7 కు విక్రయిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు.. నార్త్ ఇండియా, పశ్చిమ బెంగాల్ లో సైతం కోడి గుడ్ల కు భారీగా డిమాండ్ పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. అక్కడ కూడా భవిష్యత్ లో రేట్లు భారీగా పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.