Egg Price: కొండెక్కిన గుడ్డు ధరలు.. ఎంత పెరిగిందంటే?

దేశంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ధరలో ఉండేది కొడిగుడ్డు ఒక్కటే.. కానీ ఈ మద్య కోడి గుడ్డు ధరలకు కూడా రెక్కలు వచ్చాయి.

దేశంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ధరలో ఉండేది కొడిగుడ్డు ఒక్కటే.. కానీ ఈ మద్య కోడి గుడ్డు ధరలకు కూడా రెక్కలు వచ్చాయి.

ఇటీవల నిత్యావసర ధరలకు రెక్కలు వచ్చాయి.. మార్కెట్ కి వెళ్లి ఏ వస్తువు కొనాలన్నా సామాన్యులు భయపడిపోతున్నారు. పప్పు, నూనె, గ్యాస్, కూరగాయలు, మాంసం ఇలా వేటి ధర చూసినా చుక్కలు చూపిస్తున్నాయి. డిసెంబర్ నెలలో కార్తిక మాసం కారణంగా చికెన్, గుడ్డు ధరలు భారీగా తగ్గాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే కోడిగుడ్డు రూ.5 లు, చికెన్ రూ.100 లకే లభించాయి. కానీ కార్తీకమాసం పూర్తయిన తర్వాత కోడిగుడ్డు, చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. ముఖ్యంగా మార్కెట్ లో కోడి గుడ్డు ధర దారుణంగా పెరిగిపోయింది. ఉత్పత్తి తగ్గి, డిమాండ్ పెరగడం వల్లనే రేట్లు అమాంతం పెరిగిపోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే..

కోడిగుడ్డు అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. గుడ్డుతో ఎన్నో రకాల వంటలు చేసుకుకుంటారు.. ఎవరైనా స్నేహితులు, బంధువులు ఇంటికి వస్తే మటన్, చికెన్ లేకున్నా కోడి గుడ్లతో కూర చేసి మెప్పిస్తుంటారు. కోడిగుడ్డు మంచి పౌష్టికాహారం.. అందుకే రోజుకి ఒక గుడ్డు తినాలని వైద్యులు సలహాలు ఇస్తుంటారు. మార్కెట్ లో ప్రస్తుతం చికెన్, మటన్ ధరలు బాగా పెరిగిపోయాయి. అందుకే పేద, మధ్యతరగతి కుటుంబీకులు ఎక్కువగా కోడిగుడ్లతో సరిపెట్టుకుంటున్నారు. కానీ ఇప్పుడు కోడిగుడ్ల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. గత వారం రోజుల క్రితం ఒక గుడ్డు ఏడు రూపాయలు ఉండగా.. ఇప్పుడు అది కాస్త రూ.8 లకు పెరిగిపోయింది. వారం వారం ధరల్లో మార్పులు సామాన్యులకు నిరాశ కలిగిస్తున్నాయి.

ప్రస్తుతం మార్కెట్ లో హూల్ సేల్ లో ఒక్క గుడ్డ ధర రూ.8 పలుకుతుంది. ఇటీవల చలి బాగా పెరిగిపోయింది.. జనాలు చాలా వరకు కోడి గుడ్లు కొనేందుకు ఇష్టపడుతున్నారు.. డిమాండ్ పెరిగిపోవడంతో సప్లై తగ్గడంతో ధరల్లో మార్పులు వచ్చాయని వ్యాపారులు అంటున్నారు. హైదరాబాద్ లో కోడిగుడ్లకు బాగా డిమాండ్ ఉందని.. ఇక్కడ ఉండే అమ్మకాలు  మిగతా నగరాల కన్నా ఎక్కువగా ఉటుందని వ్యాపారులు అంటున్నారు. గత 15 రోజుల క్రితం కేసు ధర హూల్ సేల్ గా రూ.160, రిటైల్ గా రూ.6 లకు అమ్మెవారు. కానీ ఇప్పుడు కేసు ధర రూ.180 నుంచి రూ.200 వరకు పెరిగిపోయింది. దీంతో మార్కెట్ లో రూ.7 నుంచి రూ.8 వరకు అమ్ముతున్నారు.

కొన్ని గ్రామాల్లో అయితే కాస్త రేటు ఎక్కువ అంటున్నారు. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం చలికాలం కావడంతో గుడ్ల ఉత్పత్తి తగ్గుతుందని, మామూలూ రోజులతో పోలిస్తే ఉత్పత్తి 60 శాతం నుంచి 70 శాతానికి పడిపోతుందని ఫౌల్ట్రీ యజమానులు అంటున్నారు. అదీ కాకుండా మన దగ్గర నుంచి 50 శాతం మేర ఢిల్లీ, ముంబై, ఉత్తర్ ప్రదేశ్ తో పాలు రాజస్థాన్ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారని.. రానున్న రోజులు ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments