iDreamPost
android-app
ios-app

సేవింగ్స్ ఖాతాలో డబ్బు డిపాజిట్ చేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోకపోతే నష్టపోతారు

  • Published Jul 05, 2024 | 12:12 PM Updated Updated Jul 05, 2024 | 12:12 PM

Saving Account: బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. మీరు సేవింగ్ ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నారా? సేవింగ్ ఖాతా లిమిట్ ఎంతో తెలుసా? లిమిట్ దాటితే ఐటీ శాఖ నోటిసులు జారీ చేస్తుంది.

Saving Account: బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. మీరు సేవింగ్ ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నారా? సేవింగ్ ఖాతా లిమిట్ ఎంతో తెలుసా? లిమిట్ దాటితే ఐటీ శాఖ నోటిసులు జారీ చేస్తుంది.

  • Published Jul 05, 2024 | 12:12 PMUpdated Jul 05, 2024 | 12:12 PM
సేవింగ్స్ ఖాతాలో డబ్బు డిపాజిట్ చేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోకపోతే నష్టపోతారు

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు బ్యాంక్ అకౌంట్లను కలిగి ఉంటున్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందాలన్నా, వ్యాపారం ప్రారంభించేందుకు లోన్ కావాలన్నా బ్యాంకుల్లో అకౌంట్ ఉండాల్సిందే. బ్యాంకులు తమ కస్టమర్లకు సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్ వంటివి అవసరానికి తగ్గట్టుగా ఇస్తుంటాయి. అయితే ఎక్కువ మంది సేవింగ్ ఖాతాలనే కలిగి ఉంటారు. సంపాదించిన సొమ్మును సేవింగ్స్ ఖాతాల్లో పొదుపు చేసుకుంటుంటారు ఖాతాదారులు. ఒక్కోసారి ఇతరుల డబ్బులను కూడా తమ ఖాతా ద్వారా లావాదేవీలు నిర్వహిస్తుంటారు. అలాంటి సందర్భాల్లో సేవింగ్స్ ఖాతా లిమిట్ దాటుతుంది. దీంతో ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ నుంచి నోటిసులు వస్తాయి. మరి ఇలా కాకూడదు అంటే సేవింగ్ ఖాతాలో ఎంత డబ్బు ఉండొచ్చు. పరిమితి ఎంత? ఆ వివరాల్లోకి వెళ్తే..

ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు సేవింగ్స్ అకౌంట్లో రూ.10 లక్షలు డిపాజిట్ చేయొచ్చు. దీనికి మించి ఎక్కువ నగదు జమ చేసినట్లయితే ఆ ఖాతా వివరాలను బ్యాంకులు ఆదాయపు పన్ను శాఖకు తెలియజేస్తాయి. పరిమితికి మించి సేవింగ్ చేస్తే అది ఆదాయపన్ను శాఖ పరిధిలోకి వెళ్తుంది. ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 లోని సెక్షన్ 285బీఏ ఈ నిబంధనలు సూచిస్తోంది. సేవింగ్స్ ఖాతాలోని డబ్బును ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినటప్పుడు అందులో ఇచ్చిన సమాచారంతో సరిపోలకపోతే ఐటీ శాఖ నోటీసులు జారీ చేస్తుంది.

Savings Account

అప్పుడు ఖాతాదారులు ఆ ఆదాయానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఐటీ శాఖకు తప్పుడు సమాచారం ఇస్తే కొన్నిసార్లు జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలకు గురికావాల్సి ఉంటుంది. కాబట్టి సేవింగ్ ఖాతాలో ఎంత డబ్బు ఉండొచ్చో ముందే తెలుసుకుంటే ఇబ్బందులు పడకుండా ఉండొచ్చు. మీ పొదుపు ఖాతాలోని సొమ్ములపై వచ్చే వడ్డీ మీ ఆదాయానికి జమ అవుతుంది. వడ్డీపై పన్ను కట్టాలి. బ్యాంకు ఇచ్చే వడ్డీపై 10 శాతం టీడీఎస్ కట్ అవుతుంది. బ్యాంక్ ఖాతాలోని నగదుపై వచ్చే వడ్డీ రూ.10 వేల కంటే తక్కువుంటే పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom