iDreamPost
android-app
ios-app

D-Martకి లాభాల పంట.. 3 నెలల్లోనే రూ. 774 కోట్లు, కొత్తగా 6 స్టోర్లు

చిన్న వస్తువు కొనాలన్నా, పెద్ద వస్తువు తీసుకోవాలన్నా ఇప్పుడు చాలా మంది చాయిస్ డీ మార్ట్. ఒక వస్తువు కొనేందుకు వెళ్లి.. కంటికి నచ్చినవీ, ఇంట్లో అవసరాలకు అన్ని కొనుగోలు చేస్తుంటారు. ఎప్పుడు తాకిడీ ఉండనే ఉంటుంది. దీంతో..

చిన్న వస్తువు కొనాలన్నా, పెద్ద వస్తువు తీసుకోవాలన్నా ఇప్పుడు చాలా మంది చాయిస్ డీ మార్ట్. ఒక వస్తువు కొనేందుకు వెళ్లి.. కంటికి నచ్చినవీ, ఇంట్లో అవసరాలకు అన్ని కొనుగోలు చేస్తుంటారు. ఎప్పుడు తాకిడీ ఉండనే ఉంటుంది. దీంతో..

D-Martకి లాభాల పంట.. 3 నెలల్లోనే రూ. 774 కోట్లు, కొత్తగా 6 స్టోర్లు

ఒకప్పుడు నిత్యావసర సరుకులు కావాలంటే.. హోల్ సేల్ షాపులకు వెళ్లేవాళ్లు పేద,మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాళ్లు. నెల రోజులకు సరిపడా వస్తువులు తెచ్చుకునే వారు. దూర భారమైనా సరే, వ్యయ ప్రయాసలు పడి ఖాతా కొట్టుకు వెళ్లి మరీ కొనుగోలు చేసేవారు. అలాగే మధ్య మధ్యలో వస్తువులు అయిపోతే.. ఎలాగో ఇంటి దగ్గర చిల్లర కొట్టు ఉంటుంది అక్కడ నుండి తెచ్చుకుంటారు. అప్పు తీసుకుని తిరిగి ఒకేసారి చెల్లించే ఖాతా పద్దతి కూడా ఉండేది. ఆ తర్వాత నిత్యావసర సరకులే కాకుండా ఇంటికి కావాల్సిన అన్ని గృహోపకరణాలను ఒకే చోట లభించేలా అందుబాటులోకి తెచ్చింది డీ మార్ట్. ఇప్పుడు ఇంట్లో సరుకులు కావాలంటే ఫస్ట్ చాయిస్ డీ-మార్టే. ఒక సరుకు కోసం వెళ్లి.. చాలా వస్తువులు కొనుగోలు చేస్తుంటారు.

వంద రూపాయల వస్తువు కొనడానికి వెళ్లి.. వెయ్యి రూపాయలు బిల్లు చేస్తుంటారు. దీని మీద ఫన్నీ మీమ్స్ కూడా వస్తుంటాయి. అయినప్పటికీ.. బెస్ట్ డీల్స్ ఇస్తున్న డీ-మార్ట్‌కు వెళ్లకుండా ఆగలేరు సగటు మానవుడు. ఉప్పు, పప్పుల దగ్గర నుండి తమకు కావాల్సిన వస్తువులను ఇక్కడ నుండే కొనుగోలు చేస్తుంటారు. అందుకే దినదినాభివృద్ధి చెందుతోంది ఈ సంస్థ. పలుమార్లు విమర్శలు ఎదురైనా కూడా సక్సెస్ ఫుల్‌గా దూసుకెళుతుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో  ఈ సంస్థకు బ్రాంచెస్ ఉన్నాయి.  ఇదిలా ఉంటే.. డీ మార్ట్‌కు లాభాల పంట పడింది. డీ మార్ట్‌ను అవెన్యూ  సూపర్ మార్కెెట్ నిర్వహిస్తోంది.   ఈ క్రమంలో మూడు నెలల త్రైమాసిక ఫలితాల్ని ప్రకటించింది.

2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం ఫలితాల్ని ప్రకటించింది.  తొలి త్రైమాసికంలో రూ.773.8 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది లాభం రూ.659 కోట్లుగా ఉంది. అంటే గతంతో  పోలిస్తే 17.5 శాతం వృద్ధి నమోదైంది.  కంపెనీ ఆదాయం సైతం 18.6 శాతం వృద్ధితో రూ.14,069 కోట్లుగా నమోదైంది. అంతకుముందు సంవత్సరం ఇదే సమయంలో ఆదాయం రూ. 11,865.4 కోట్లుగా  ఉంది. ఇక ఈ ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ లాభం వడ్డీ, టాక్స్ వంటివి కలుపుకొని చూస్తే రూ. 1221.3 కోట్లుగా ఉంది.  కంపెనీ మార్జిన్‌ 8.68 శాతంగా ఉంది. ఇక తమ లాభాలు పెరిగేందుకు ప్రధాన కారణం జనరల్ మర్చండైజ్ సహా అప్పారెల్ (దుస్తుల వ్యాపారం) డిమాండ్ పెరగడమేనని తెలిపారు అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నెవిల్లే నోరోన్హా.  అలాగే త్రైమాసికంలో డీమార్ట్‌ కొత్తగా మరో 6 స్టోర్లను తెరిచినట్లు వెల్లడించారు. దీంతో జూన్‌ చివరి నాటికి మొత్తం స్టోర్ల సంఖ్య 371కి చేరింది. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో శుక్రవారం బీఎస్‌ఈలో అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ షేరు 1.15 శాతం లాభంతో రూ.4953 వద్ద ముగిసింది.