P Venkatesh
స్పెషల్ గిఫ్టులు, రకరకాల సర్ ప్రైజ్ లతో లవర్ ని సంతోష పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు ప్రేమికులు. వాలెంటైన్స్ డే రోజున లవ్ బర్డ్స్ కు బిగ్ షాక్ తగలనుంది. లవర్స్ డే రోజు ఆ సేవలు బంద్ కానున్నాయట.
స్పెషల్ గిఫ్టులు, రకరకాల సర్ ప్రైజ్ లతో లవర్ ని సంతోష పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు ప్రేమికులు. వాలెంటైన్స్ డే రోజున లవ్ బర్డ్స్ కు బిగ్ షాక్ తగలనుంది. లవర్స్ డే రోజు ఆ సేవలు బంద్ కానున్నాయట.
P Venkatesh
లవ్ బర్డ్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న వాలంటైన్స్ డే రానే వచ్చింది. ప్రేమికులు తమ ప్రియమైన వారి పట్ల ప్రేమను వ్యక్త పరిచేందుకు రెడీ అయిపోతున్నారు. స్పెషల్ గిఫ్టులు, రకరకాల సర్ ప్రైజ్ లతో లవర్ ని సంతోష పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. లవర్స్ డేకు వారం ముందు నుంచే సందడి మొదలైంది. రోజ్ డే, చాక్లెట్ డే అంటూ వాలంటైన్స్ డేను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక లవర్స్ డే రోజు ఆన్ డెలివరీ సంస్థలకు మంచి గిరాకీ ఉంటుంది. ఫుడ్ డెలివరీ, గిఫ్టుల కోసం ఆన్ లైన్ డెలివరీ సంస్థలను ఆశ్రయిస్తుంటారు ప్రేమికులు. ఈ క్రమంలో లవర్స్ డే రోజున ప్రేమికులకు పెద్ద షాక్ తగలనుంది. డెలివరీ పర్సన్స్ డెలిరీ చేయకుండా షాక్ ఇవ్వనున్నారు.
ఉపాధి కోసం ఫుడ్ డెలివరీ సంస్థల్లో ఎంతో మంది డెలివరీ సంస్థల్లో పనిచేస్తున్నారు. అయితే పొద్దంతా కష్టపడి పనిచేస్తే అన్ని ఖర్చులు పోనూ మిగిలేది అంతంత మాత్రమే. దీంతో కుటుంబాలను పోషించలేక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు డెలివరీ పర్సన్స్. ఈ నేపథ్యంలోనే మంచి జీతం.. ఇన్సెంటీవ్ ల కోసం వాలంటైన్స్ డే రోజున డెలివరీ పర్సన్స్ సమమ్మె చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే డెలివరూ, ఉబెర్ ఈట్స్ డ్రైవర్లు, రైడర్‌లు ఈ స్ట్రైక్‌లో పాల్గొంటారని సమాచారం. ఈ కారణంచేతనే లవర్స్ డే రోజున ఫుడ్ డెలివరీలు, గిఫ్టులు డెలివరీ చేసేందుకు నిరాకరిస్తున్నారు.
రేపు(బుధవారం) సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వేలమంది డెలివరీ వర్కర్లు ఈ సమ్మెలో పాల్గొంటారు. డెలివరీ బాయ్స్ సమ్మెకు సంబంధించి ‘డెలివరీజాబ్ యూకే’ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. లండన్ తో పాటు మిగతా నగరాల్లో కూడా డెలివరీ బాయ్స్ బంద్ లో పాల్గొననున్నారు. చేస్తున్న పనికి న్యాయమైన వేతనం కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. డెలివరీ జాబ్ చేసే యూకే డ్రైవర్లు ప్రతి డెలివరీకి 2.80 పౌండ్స్ నుంచి 3.15 పౌండ్స్ మధ్య సంపాదిస్తారు. ఈ చెల్లింపు కనీసం 5 పౌండ్స్‌కు పెరగాలని డిమాండ్ చేస్తున్నారు. డెలివరీ పర్సన్స్ సమ్మెతో లవర్స్ కి షాక్ తగిలినట్లైంది.
Over 3,000 UK delivery workers in London and several other cities plan strike action on Valentine’s Day demanding better pay and working conditions, organized by Delivery Job UK group. pic.twitter.com/ZiIuBrzMyV
— 𝗡 𝗢 𝗜 𝗦 𝗘 ⚡ A L E R T S (@NoiseAlerts) February 13, 2024