Aadhaar: ఆధార్ ఇంకా అప్డేట్ చెయ్యలేదా? ఇదే చివరి అవకాశం.. మిస్సైతే ఇక తిప్పలే!

Aadhaar: చాలా మంది కూడా ఇప్పటికీ ఆధార్ కార్డ్ ని అప్డేట్ చేయలేదు. కానీ వారికి ఇప్పుడు చివరి గడువు వచ్చింది.

Aadhaar: చాలా మంది కూడా ఇప్పటికీ ఆధార్ కార్డ్ ని అప్డేట్ చేయలేదు. కానీ వారికి ఇప్పుడు చివరి గడువు వచ్చింది.

ఆధార్ కార్డు అనేది భారతీయులకు చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. దీనికి మించిన ముఖ్యమైన డాక్యుమెంట్ భారతీయుడికి ఏదీ లేదు. కాబట్టి కచ్చితంగా ఆధార్ కార్డు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో ఉండే ప్రతి చిన్న డీటైల్ జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఆధార్ కార్డ్ లోని వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు సక్రమంగా దోషరహితంగా ఉండేలా చెక్ చేసుకోవాలి. ఉద్యోగం, వ్యాపారం రీత్యా వేరే ప్రాంతాలకు మారిన వారు ఆధార్ కార్డులోని తమ చిరునామాకు తప్పకుండా అప్డేట్ చేసుకోవాలి. అలాగే సొంత ఊరిలోనే ఉన్నవాళ్లు, కార్డులో వివరాలన్నీ సక్రమంగా ఉన్నవారు కూడా ప్రతి పదేళ్లకు ఒకసారి ఆధార్ కార్డును అప్డేట్ చేసుకుంటూ ఉండాలి.

UIDAI ఎప్పటికప్పుడు ఆధార్ కార్డుని అప్డేట్ చేసుకోమని మనల్ని అలర్ట్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఆధార్ కార్డు హోల్డర్లకు మళ్ళీ ఆదేశాలు జారీ చేసింది. పదేళ్లకు మించి ఆధార్ కార్డును వాడుతున్నవారు ఇంకా ఉంటే కచ్చితంగా అప్ డేట్ చేయాలని సూచించింది. ఇక ఆధార్ వివరాలను ఫ్రీగా అప్డేట్ చేసుకోవటానికి ఈ ఏడాది డిసెంబర్ 14 దాకా ఛాన్స్ కల్పించింది. దీని గురించి సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ లో కూడా పోస్టు చేసింది. కోట్ల మందికి ప్రయోజనం చేకూర్చే ఈ ఫ్రీ సర్వీస్ కేవలం మైఆధార్ పోర్టల్ లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ గడువు దాటితే డబ్బులు కట్టి ఆధార్ అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్డేట్ చేసుకోకోపోతే కచ్చితంగా ఇబ్బందులు తప్పవు.

ఆధార్ కార్డు అనేది అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్. మీ దగ్గర ఎన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు ఉన్నా కూడా ఆధార్ కార్డ్ ఉంటేనే అవి చెల్లుతాయి. అందుకే ఆధార్ కార్డ్ ని సమగ్రంగా, ఎలాంటి తప్పులు లేకుండా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే దీనివల్ల నకిలీల బెడద ఉండదు. మోసాలు జరగవు. సైబర్ క్రైమ్స్ అడ్రస్ లేకుండా పోతాయి. అందుకోసమే ఫ్రీగా అప్ డేట్ సర్వీస్ లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. మనకు ఆ సర్వీసులు ఫ్రీగా ఉన్నప్పుడే ఆధార్ కార్డుని అప్డేట్ చేసుకోవడం మంచిది. పదేళ్ల తర్వాత ఆధార రికార్డులను అప్ డేట్ చేసుకోవడం వల్ల మెరుగైన సేవలు అందుకోవచ్చు. మంచి మంచి ప్రభుత్వ పథకాలను పొందవచ్చు. కాబట్టి డిసెంబర్ 14 లోపు ఆధార్ కార్డ్ లను కచ్చితంగా ఫ్రీగా అప్డేట్ చేసుకోండి. జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ ఇన్ఫర్మేషన్ గురించి మీరేమి అనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments