iDreamPost

వన్ ప్లస్ 12 ఆర్ మొబైల్ కొన్న వారందరికీ డబ్బులు వెనక్కి! ఈ డేట్ వరకే ఛాన్స్!

  • Published Feb 20, 2024 | 7:10 PMUpdated Feb 21, 2024 | 9:37 AM

ఈ మధ్య కాలంలో వన్‌ప్లస్‌ 12ఆర్‌ ఫోన్ లను కొనుగోలు చేసిన కస్టమర్లకు వన్‌ప్లస్‌ కంపెనీ భారీ షాక్ ను ఇచ్చింది. అదేమిటంటే..

ఈ మధ్య కాలంలో వన్‌ప్లస్‌ 12ఆర్‌ ఫోన్ లను కొనుగోలు చేసిన కస్టమర్లకు వన్‌ప్లస్‌ కంపెనీ భారీ షాక్ ను ఇచ్చింది. అదేమిటంటే..

  • Published Feb 20, 2024 | 7:10 PMUpdated Feb 21, 2024 | 9:37 AM
వన్ ప్లస్ 12 ఆర్ మొబైల్ కొన్న వారందరికీ డబ్బులు వెనక్కి! ఈ డేట్ వరకే ఛాన్స్!

ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్ నిత్య అవసరం అయిపోయింది. కొంతమంది వీటిని అవసరం కోసం వాడుతుంటే.. ఇంకొంత మంది విలాసాల కోసం కూడా వాడుతున్నారు. దీనితో.. స్మార్ట్ ఫోన్స్ ధరలు లక్షలు దాటిపోయే పరిస్థితి వచ్చేసింది. ఇక ఈ మధ్యకాలంలో మాత్రం ప్రతి ఒక్కరు ఎక్కువగా వన్‌ప్లస్‌ ఫోన్ లను కొనుగోలు చేస్తున్నారు. ఇవి అత్యున్నత ఫీచర్లతో, మంచి కెమెరా క్వాలీటితో మార్కెట్ లోకి వస్తున్నాయి. కాకుంటే.. వీటి ధరలు కూడా అదే రేంజ్ లో ఉంటున్నాయి. కాస్త ఎక్కువ ధర అయినా పర్లేదు.. మంచి యూజర్ ఎక్స్ పీరియన్స్ కోరుకునేవారు ఈ ఫోన్స్ ఎక్కువగా కొంటూ వస్తున్నారు. ఈ నేపధ్యలోనే ఇటీవలే మార్కెట్ లో వన్‌ప్లస్‌ 12ఆర్‌ పేరుతో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసిన వారికి కంపెనీ ఓ కీలక ప్రకటన చేసింది.

వన్‌ప్లస్‌ 12ఆర్‌ స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేసిన వారందరూ తిరిగి తమ స్మార్ట్ ఫోన్ లను ఇచ్చేయాలని, అలా ఇచ్చిన వారికి.. స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసిన పూర్తి డబ్బులను తిరిగి చెల్లించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇంతకీ వన్ ప్లస్ కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనుక పెద్ద కారణమే ఉంది. కంపెనీ లాంచింగ్ సమయంలో స్మార్ట్‌ ఫోన్‌ ఫ్లాష్‌ స్టోరేజీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని అందించి, ఇప్పుడు క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. అయితే ఈ ఆవకాశం మార్చి 16వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని వన్‌ప్లస్‌ సీఈఓ తెలిపారు.ఈ వన్‌ప్లస్‌ 12 ఆర్‌ స్మార్ట్ ఫోన్‌ UFS 3.1 కాగా, లాంచింగ్ సమయంలో.. ఇది 4.0 అని ప్రకటించారు. దీంతో వన్‌ప్లస్‌ ఆర్‌ 256జీబీ వేరియంట్‌ను కొనుగోలు చేసినవారికి బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ ఎదురైంది. తప్పు తమవైపే ఉండటంతో ఇప్పుడు పూర్తి మొత్తాన్ని రిఫండ్‌ చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. వన్‌ప్లస్‌ కస్టమర్‌ కేర్‌ను సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని వన్‌ప్లస్‌ సీఓఓ ‘కిండర్‌ లియు’ సూచించారు.

ఇక ఈ వన్‌ప్లస్‌ 12 ఆర్‌ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. పైగా ఇది 6.78 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లే తో అందించారు. అలాగే ఈ స్మార్ట్ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇక కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడీయో కాల్స్‌ కోసం ఇందులో 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇక ఇందులో 5000 MH బ్యాటరీని ఇచ్చారు. కాగా, 16 జీబీ+256 జీబీ వేరియంట్‌ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ ధర ధర విషయానికొస్తే.. ధర రూ.45,999గా నిర్ణయించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి