iDreamPost
android-app
ios-app

సిట్రోయిన్ బసాల్ట్ కూప్ కారు లాంఛ్! ధరలు, ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే?

  • Published Aug 18, 2024 | 1:15 AM Updated Updated Aug 18, 2024 | 1:15 AM

Citroen Basalt SUV Coupe: సిట్రోయిన్ కార్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చూడటానికి ఎంతో స్టైలిష్ గా ఉండే ఈ కార్లు వినియోగదారులను ఎంతగానో ఆక్లెట్టుకుంటున్నాయి.

Citroen Basalt SUV Coupe: సిట్రోయిన్ కార్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చూడటానికి ఎంతో స్టైలిష్ గా ఉండే ఈ కార్లు వినియోగదారులను ఎంతగానో ఆక్లెట్టుకుంటున్నాయి.

సిట్రోయిన్ బసాల్ట్ కూప్ కారు లాంఛ్! ధరలు, ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే?

సిట్రోయిన్ కార్లు ఎంత స్టైలిష్ గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక తాజాగా లాంచ్ అయిన బసాల్ట్ ఎస్‌యూవీ కూపే (Basalt SUV Coupe) కార్ అయితే వాహనదారులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. దీని ధర విషయానికి వస్తే… ఈ కారు ప్రారంభ ధరను రూ .7.99 లక్షలుగా సిట్రోయిన్  కంపెనీ ప్రకటించింది. ఈ సిట్రోయిన్ బసాల్ట్ యూ (You), ప్లస్ (Plus), మ్యాక్స్ (Max) అనే మూడు వేరియంట్లలో ఉంటుంది. ఈ కార్ టాప్ వేరియంట్ ధర రూ.13.62 లక్షలుగా ఉంది. వీటి డెలివరీలు సెప్టెంబర్ నెల మొదటి వారంలో ప్రారంభం కానున్నాయని తెలుస్తుంది.ఈ కార్ ని టెస్ట్ డ్రైవ్ చేయాలనుకునే కస్టమర్‌లు కంపెనీకి చెందిన లా మైసన్ సిట్రోయిన్ డీలర్‌షిప్‌లలో (La Maison Dealerships) టెస్ట్‌డ్రైవ్ చేయవచ్చు. దీని గురించి పూర్తి వివరాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ కార్ ఇంజిన్ విషయానికి వస్తే.. ఇది రెండు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఒకటి 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్. ఇది 80 bhp మరియు 115nm మాక్సిమం టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది స్పెషల్ గా 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్‌తో యాడ్ చేయబడింది. రెండో ఇంజిన్ విషయానికి వస్తే.. 1.2-లీటర్ కెపాసిటీ గల మూడు సిలిండర్ల టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌. ఇది 109 bhp పవర్‌ని 190 nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారులో 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా 205 ఎన్ఎమ్ టార్క్ అందించే టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ ఉంటుందని తెలుస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే..ఈ కార్ 1.2 NA ఇంజిన్‌ లీటరుకు 18 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇక 1.2 టర్బో పెట్రోల్ మాన్యువల్ అయితే లీటరుకు 19.5 కిలోమీటర్లు, ఆటోమేటిక్ లీటరుకు 18.7 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

ఈ కారులో LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్‌, 16-ఇంచెస్‌ అల్లాయ్ వీల్స్, రాప్ రౌండ్ టెయిల్ లైట్లు, రియర్ ఎయిర్ కండిషనింగ్ వెంట్స్‌ ఉంటాయి. రెండో వరుసలో ప్రయాణీకులకు అడ్జస్ట్ చేయదగిన థై సపోర్ట్ ఉంటుంది. ఈ కూపే ఎస్‌యూవీలో 10.25 ఇంచెస్‌ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌ ఫీచర్లు ఉంటాయి. అలాగే ఈ కార్ వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే ఇంకా అలాగే ఆండ్రాయిడ్ ఆటోను సపోర్ట్ చేస్తుంది. ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్‌సీ), పార్కింగ్ సెన్సార్లతో కూడిన రియర్ పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టిపిఎంఎస్) ఉంటాయి.