iDreamPost
android-app
ios-app

కస్టమర్లకు OPPO క్రేజీ ఆఫర్.. రూ. 10 లక్షలు గెలుచుకునే ఛాన్స్

  • Published Oct 09, 2024 | 4:04 PM Updated Updated Oct 09, 2024 | 4:04 PM

OPPO Diwali Bonanza 2024: కస్టమర్లకు ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ఒప్పో అదిరిపోయే ఆఫర్ ను తీసుకొచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 10 లక్షలు గెలుచుకునే ఛాన్స్ అందిస్తోంది.

OPPO Diwali Bonanza 2024: కస్టమర్లకు ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ఒప్పో అదిరిపోయే ఆఫర్ ను తీసుకొచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 10 లక్షలు గెలుచుకునే ఛాన్స్ అందిస్తోంది.

  • Published Oct 09, 2024 | 4:04 PMUpdated Oct 09, 2024 | 4:04 PM
కస్టమర్లకు OPPO క్రేజీ ఆఫర్.. రూ. 10 లక్షలు గెలుచుకునే ఛాన్స్

పండగల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే దసరా పండగ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. ఫెస్టివల్ సీజన్ లో సేల్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఏదో ఒక నూతన వస్తువును కొనేందుకు ఇంట్రెస్టు చూపిస్తుంటారు. ఫోన్ కొనుక్కోవాలని, బైక్ కొనుక్కోవాలని ఆలోచిస్తుంటారు. ఇదే సమయంలో ఆఫర్ల కోసం ఎదురుచూస్తుంటారు. ధరలు తగ్గగానే తమకు నచ్చిన ప్రొడక్ట్స్ కొనుగోలు చేస్తుంటారు. ఈ పండగల సీజన్ ను మరింత క్యాష్ చేసుకునేందుకు ఈ కామర్స్ సంస్థలు, మొబైల్ తయారీ కంపెనీలు, టూవీలర్ కంపెనీలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఆఫర్ల వర్షం కురిపించి తమ సేల్ ను పెంచుకోవాలని పలు కంపెనీలు రెడీ అవుతున్నాయి.

తమ ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్స్ ను అందిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ప్రత్యేక సేల్ తో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇక మరికొన్ని రోజుల్లో దీపావళి ఫెస్టివల్ సీజన్ కూడా ప్రారంభంకాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ఒప్పో మరోసారి గ్రాండ్ సేల్ తో ముందుకొచ్చింది. ఒప్పో ఫోన్లపై భారీ ఆఫర్స్ ను ప్రకటించింది. మొబైల్స్ పై కళ్లు చెదిరే డీల్స్ తో పాటు కస్టమర్లకు రూ. 10 లక్షలు గెలుచుకునే ఛాన్స్ కల్పిస్తోంది. మీరు కూడా ఒప్పో దివాళీ సేల్ లో పాల్గొని 10 లక్షలు పొందొచ్చు. ఒప్పో దివాళీ బొనాంజ ఆఫర్ తో మీరు మిలియనీర్ అయిపోవచ్చు. ఒప్పో కంపెనీ ‘పే జీరో, వర్రీ జీరో, విన్‌ రూ.10 లక్షలు’ పేరిట దీపావళి 2024 సేల్‌ను భారత్‌లో ప్రవేశపెట్టింది.

అక్టోబర్ 01 నుంచి ప్రారంభమైన ఈ సేల్.. నవంబర్ 07 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌లో ఒప్పో రెనో 12 ప్రో 5జీ, ఒప్పో ఎఫ్‌27 ప్రో+ 5జీ స్మార్ట్‌ఫోన్‌లపై ఆకర్షణీయమైన డీల్‌లను అందిస్తుంది. వీటిపై 12 నెలల నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం ఉంది. ఈ సేల్‌లో ఎంపిక చేసిన ప్రొడక్టులపై క్యాష్‌ ప్రైజ్‌లు, ఒప్పో ఫైండ్ ఎన్‌3 ఫ్లిప్‌ ఫోన్లను కంపెనీ అందించనుంది. నో కాస్ట్‌ ఈఎంఐ, జీరో డౌన్‌ పేమెంట్‌, జీరో ప్రాసెసింగ్‌ ఫీ, ఇన్‌స్టంట్‌ క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనున్నట్లు తెలిపింది. కోటక్‌ బ్యాంక్‌, టీవీఎస్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీబీ ఫైనాన్స్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ యూజర్లకు 6 నుంచి 9 నెలల పాటు జీరో ప్రాససింగ్‌ ఫీ.. ఏడాది పాటు జీరో డౌన్‌ పేమెంట్‌ సదుపాయం అందిస్తోంది.

హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌, కోటక్‌, ఆర్‌బీఎల్‌, డీబీఎస్‌, ఫెడరల్‌ బ్యాంక్‌ యూజర్లకు 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ అందించనుంది. ఒప్పో రెనో 11 సిరీస్‌, ఒప్పో ఎఫ్‌25 ప్రో, ఒప్పో ఎఫ్‌27 5జీ, ఒప్పో ఏ3 ప్రో5జీ, ఒప్పో కే12 ఎక్స్‌ 5జీ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. నవంబర్‌ 7లోపు కొనుగోలు చేసే వారికి ఒప్పో ఫైండ్‌ ఎ3 ఫ్లిప్‌, ఒప్పో ఎక్నో బడ్స్‌2, ఒప్పో ప్యాడ్‌, లక్ష రూపాయలు గెలుచుకొనే ఛాన్స్ ఉంది. ఒప్పో రిటైల్‌ స్టోర్‌, ఒప్పో ఇ-స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ ద్వారా కొనుగోలు చేసిన వారు ఈ ప్రయోజనాలు పొందొచ్చని ఒప్పో తెలిపింది. పూర్తి సమాచారం కోసం www.oppo.com వెబ్ సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet girişjojobet giriş