ఉల్లి ధరల కట్టడికి కేంద్ర కీలక నిర్ణయం.. కిలో రూ.25కే

పెరుగుతున్న ఉల్లి ధరలను కట్టడి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఉల్లి ధరలు దిగి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు మార్కెట్‌ నిపుణులు. ఆ వివరాలు..

పెరుగుతున్న ఉల్లి ధరలను కట్టడి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఉల్లి ధరలు దిగి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు మార్కెట్‌ నిపుణులు. ఆ వివరాలు..

ఉల్లి ధర కొనకుండానే సామాన్యుల చేత కన్నీరు పెట్టిస్తోంది. 10 రోజుల క్రితం వరకు కూడా కిలో ఉల్లి రేటు 20 రూపాలయలోపే ఉండగా.. ఈ వారంలో భారీగా పెరిగింది. ప్రస్తతం ఒపెన్‌ మార్కెట్‌లో కిలో ఉల్లిపాయల ధర ఏకంగా 80 రూపాయలకు చేరింది. రేటు ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని అంటున్నారు మార్కెట్‌ నిపుణులు. ఈ ఏడాది వాతవరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల ఉల్లి దిగుమతి బాగా తగ్గిపోయింది. దాంతో ధర పెరిగింది. పెరుగుతున్న ఉల్లి రేటును కట్టడి చేయడం కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కిలో ఉల్లిని 25 రూపాయలకే అమ్మడానికి నిర్ణయించింది. ఆ వివరాలు..

ఉల్లి ధరల కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే బఫర్ స్టాక్ నుంచి రిటైల్ మార్కెట్లలోకి లక్ష టన్నుల ఉల్లిని విడుదల చేయనున్నట్లు కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఉల్లి ధరలను తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఎగుమతులపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అంతేకాక సబ్సిడీ కింద దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో.. కిలో ఉల్లిని రూ.25 కే విక్రయిస్తోంది. దీంతోపాటు ఈ నెలలోనే మార్కెట్లలోకి బఫర్ స్టాక్ నుంచి లక్ష టన్నుల ఉల్లిని రిలీజ్ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కారణంగా.. దేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ అయిన ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండిలో హోల్‌సేల్ కిలో ఉల్లిపాయల రేటు రూ.30 కి పడిపోయినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో ఉల్లి ధరలు మరింత తగ్గనున్నాయని.. దీంతో సామాన్యుడికి భారీ ఊరట లభిస్తుందని పేర్కొంటున్నాయి. అయితే హోల్‌సేల్ మార్కెట్‌లో ఉల్లి ధరలు భారీగా తగ్గినా.. దాని ప్రభావం రిటైల్ మార్కెట్‌లలో ఇంకా కనిపించడం లేదని మార్కెట్ వర్గాలతోపాటు వినియోగదారులు పేర్కొంటున్నారు. అందుకు తగ్గట్లుగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Show comments