Chance Of Hike Gold Rates: గోల్డ్ కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి! కేంద్రం నిర్ణయంతో ధరలు పెరిగే ఛాన్స్!

గోల్డ్ కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి! కేంద్రం నిర్ణయంతో ధరలు పెరిగే ఛాన్స్!

Central Government Plans To Hike GST On Gold, Silver Purchases: గత నాలుగు రోజులుగా వరుసగా బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. దీంతో పసిడి ప్రియులకు ఊరట లభించింది. ఇంకొన్ని రోజులు ఆగితే ఇంకా తగ్గుతుందేమో అని అనుకుని ఆగిపోయిన వారికి అలర్ట్.

Central Government Plans To Hike GST On Gold, Silver Purchases: గత నాలుగు రోజులుగా వరుసగా బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. దీంతో పసిడి ప్రియులకు ఊరట లభించింది. ఇంకొన్ని రోజులు ఆగితే ఇంకా తగ్గుతుందేమో అని అనుకుని ఆగిపోయిన వారికి అలర్ట్.

బడ్జెట్ రోజున బంగారం, వెండి, ప్లాటినం వంటి వాటి మీద కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బంగారం, వెండి మీద 10 శాతం ఉన్న కస్టమ్స్ డ్యూటీని 6 శాతానికి తగ్గించింది కేంద్రం. దీంతో ఆరోజున బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఆ తర్వాత కూడా తగ్గుతూ వచ్చాయి. దీంతో బంగారం, వెండి కొనాలనుకునేవారికి భారీ ఊరట లభించినట్లయ్యింది. అయితే ఈ ఆనందాన్ని ఎన్నో రోజులు లేకుండానే కేంద్రం పసిడి ప్రియులకు షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బంగారం, వెండి కొనుగోలుపై విధిస్తున్న జీఎస్టీకి సంబంధించిన అంశం ప్రస్తుతం తెరపైకి వచ్చింది. బంగారం, వెండి కొనుగోళ్లపై జీఎస్టీని పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం బంగారం, వెండి మీద 3 శాతంగా ఉన్న వస్తు సేవల పన్నును 5 శాతానికి పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి.

బంగారంపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించిన కారణంగా జీఎస్టీ రేటు పెంచాల్సిన అవసరం కేంద్రానికి ఏర్పడిందని బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. అయితే బడ్జెట్ రోజున నిర్మల సీతారామన్ జీఎస్టీ రేట్లను మరింత సులభతరం చేసే చర్యలు చేపడతామని అన్నారు. దీంతో బంగారం, వెండిపై 3 శాతం ఉన్న జీఎస్టీని 5 శాతానికి పెంచుతారన్న వార్తలు వస్తున్నాయి. గోల్డ్ బార్స్ మీద, సిల్వర్ బార్స్ మీద బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించింది. 3 శాతం జీఎస్టీతో బంగారం, వెండి మీద పడే పన్ను 18.5 శాతం నుంచి 9 శాతానికి తగ్గింది. అయితే కస్టమ్స్ డ్యూటీని తగ్గించిన కారణంగా జీఎస్టీ రేట్లను పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కస్టమ్స్ డ్యూటీని తగ్గించడం వల్ల బంగారం స్మగ్లింగ్ తగ్గుతుందని.. అయితే జీఎస్టీ పెంచడం వల్ల రెవెన్యూ నష్టాన్ని పూడ్చేందుకు సహాయపడుతుందని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు జీఎస్టీ రేట్ల పెంపు వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు లాభమని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్య పన్నులతో వచ్చే ఆదాయంతో పోలిస్తే బంగారంపై వేసే పన్ను వల్ల వచ్చే ఆదాయమే ఎక్కువని చెబుతున్నారు. కానీ కొనుగోలుదారులపై మాత్రం భారం పడుతుందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. ఒకవేళ కేంద్రం బంగారం, వెండి కొనుగోళ్లపై జీఎస్టీ రేటుని పెంచితే కనుక కొనేవారికి భారీ దెబ్బనే చెప్పాలి. కాబట్టి జీఎస్టీ రేటు పెరగకముందే బంగారం, వెండి కొనుక్కోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పెరిగితే ధరలు పెరుగుతాయని చెబుతున్నారు. 

Show comments